E-Paper
Advertisement

ఆరోగ్యకరమైన స్నాక్స్ కోసం..బడ్జెట్ ధరలోనే ఎయిర్ ఫ్రైయర్స్

ఆరోగ్యకరమైన స్నాక్స్ కోసం..బడ్జెట్ ధరలోనే ఎయిర్ ఫ్రైయర్స్
Advertisement

Best air fryers under 10000: మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఇప్పుడు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. నూనె పదార్థాలను తగ్గించి, టేస్టీగా ఉండే స్నాక్స్ తినాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం ఎయిర్ ఫ్రైయర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. రేపిడ్ ఎయిర్ టెక్నాలజీ సాయంతో ఇవి గాలి ద్వారా ఆహారాన్ని వేయించి, బయటకు క్రిస్పీగా, లోపల జ్యుసీగా ఉండేలా చేస్తాయి.కస్టమర్లు డిజిటల్ టచ్ ప్యానెల్, తక్కువ కరెంట్ ఖర్చు, ఎక్కువ కెపాసిటీ ఉన్న ఎయిర్ ఫ్రైయర్స్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. రూ. 10,000 లోపు బడ్జెట్‌లో లభించే టాప్ 5 ఎయిర్ ఫ్రైయర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 ఎయిర్ ఫ్రైయర్స్:

1. Philips NA221/00 4.2L Digital Air Fryer:

నమ్మకమైన బ్రాండ్, లేటెస్ట్ టెక్నాలజీ కోరుకునే వారికి.. ఫిలిప్స్ ఎన్ఎ221/00  మొదటి ఆప్షన్‌గా నిలుస్తుంది. మార్కెట్లో దీని ధర ..సుమారు రూ. 7,650 వరకు ఉంది. ఇది 4.2 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో సీ-త్రూ గ్లాస్ విండో, 13 ప్రెసెట్ మెనూ ఆప్షన్స్ , ఆటో-షట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉన్నాయి.

2. Faber 8.0L Dual BK Air Fryer:

Advertisement

పెద్ద ఫ్యామిలీలు లేదా ఒకే సారి ఎక్కువ స్నాక్స్ తయారు చేసుకోవాలనుకునే.. వారి కోసం ఫాబెర్ క్రిస్ప్‌ఎక్స్ 8.0ఎల్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని ధర మార్కెట్లో దాదాపు రూ. 7,499గా ఉంది. ఇది ఏకంగా 8 లీటర్ల భారీ కెపాసిటీని కలిగి ఉంది. టచ్ కంట్రోల్, ఎల్ఈడీ డిస్‌ప్లే, 10 ప్రీ-సెట్ మెనూస్ , ఛాంబర్ లైట్‌తో ఉన్న సీ-త్రూ గ్లాస్ దీని ప్రత్యేకతలు.

3. Havells Digital 5.5L Air Fryer:

క్వాలిటీకి మారుపేరైన హేవెలెట్స్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ ఎయిర్ ఫ్రైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు సరిగ్గా సరి పోతుంది. దీని ధర రూ.6,499గా ఉంది. ఇది 5.5 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంది. 8 ప్రీ-సెట్ కుకింగ్ మోడ్స్, డిజిటల్ టచ్ కంట్రోల్ ప్యానెల్, ఓవర్ హీట్ ప్రొటెక్షన్, కూల్-టచ్ హ్యాండిల్ దీనిలో లభిస్తాయి.

4. Pigeon YU Glass Bowl 7L Air Fryer:

Advertisement

యూనిక్ డిజైన్, గ్లాస్ బౌల్‌తో వస్తున్న పిజియన్ హెల్తిఫ్రై ప్లస్ ప్రస్తుతం మార్కెట్లో.. ట్రెండ్‌లో ఉంది. దీని ధర సుమారు రూ. 8,445 వరకు ఉంది. ఇది 7 లీటర్ల పారదర్శక గ్లాస్ బౌల్ డిజైన్‌తో వస్తుంది. ఆహారం ఉడుకుతున్న విధానాన్ని నేరుగా గమనించవచ్చు. టచ్ కంట్రోల్స్, 8 ప్రీ-సెట్ మెనూస్, ఈజీ-క్లీన్ నాన్‌స్టిక్ ఉపరితలం దీని సొంతం.

Also Read: ఇల్లు మెరిసిపోవడానికి..టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఇవే!

5.Solara All-In-One 12L  Air Fryer Oven:

కేవలం ఫ్రై చేసుకోవడమే కాకుండా.. బేకింగ్, రోస్టింగ్ వంటి పనులు కూడా చేయాలనుకునే.. వారి కోసం సోలారా 12ఎల్ పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ధర అంచనాగా రూ.7,999గా ఉంది. ఇది 12 లీటర్ల భారీ సామర్థ్యంతో ..ఓవెన్ రూపంలో వస్తుంది. 12 ప్రీ-సెట్ మెనూస్, రొటిసేరి ఫీచర్, 360-డిగ్రీ రాపిడ్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీ దీని ప్రత్యేకత.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూనే.. నోరూరించే స్నాక్స్ తినాలనుకునే వారికి ఈ ఎయిర్ ఫ్రైయర్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. రూ.10,000 లోపు బడ్జెట్‌లో.. లభించే ఈ బెస్ట్ అప్లయన్సెస్ మీ కిచెన్ పనులను మరింత ఈజీ చేస్తాయి. మీ అవసరాలకు తగిన మోడల్‌ను ఎంచుకుని హెల్తీ లైఫ్‌స్టైల్‌ను ప్రారంభించండి!

Related News

ఇల్లు మెరిసిపోవడానికి..టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఇవే!

టైటాన్ మీదకు మీ పేరు.. నాసా నుంచి బోర్డింగ్ పాస్ కూడా, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

జియో సెన్సేషనల్ ప్లాన్.. జస్ట్ రూ.84తో నెల మొత్తం సిమ్ యాక్టివ్.. బడ్జెట్ సేవ్ చేసుకోండిలా!

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్..నంబర్,తేదీపై ట్యాప్ చేస్తే చాలు షార్ట్‌కట్లు ఓపెన్!

కళ్లు చెదిరే ఫీచర్లతో..కొత్త గోబోల్ట్ ఇయర్ బడ్స్ లాంచ్

ప్రీమియం లెదర్ లుక్‌తో నాయిస్ బడ్స్..ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే!

వాచ్‌తో ECG తీసి డాక్టర్‌కు రిపోర్ట్ పంపొచ్చు.. భారత్‌లోకి వచ్చిన గార్మిన్ కొత్త ఫీచర్ ఇదే!

Big Stories

Advertisement
×