WhatsApp new chat shortcuts: రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీ.. ప్రపంచంలో మన పనులను మరింత ఈజీ చేయడానికి సోషల్ మీడియా , మెసేజింగ్ యాప్‌లు తరచూ కొత్త అప్‌డేట్లను తెస్తున్నాయి. అందులోనూ.. వాట్సాప్ తన యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో.. ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. మనం నిత్యం వాడే.. వాట్సాప్‌లో చాటింగ్ చేసేటప్పుడు ఎవరికైనా ఫోన్ నంబర్ పంపాలన్నా, లేదా ఏదైనా డేట్, అడ్రస్ షేర్ చేసుకోవాలన్నా.. ఇప్పటివరకు కొంత సమయం పట్టేది. ఆ నంబర్‌ను కాపీ చేసి డయలర్‌లోకి వెళ్లడం లేదా మ్యాప్స్‌లో వెతకడం వంటి పనులు చేయాల్సి వచ్చేది. ఈ చిన్న చిన్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా వాట్సాప్ ఒక అద్భుతమైన షార్ట్‌కట్ ఫీచర్‌ను తీసుకువచ్చింది.
వాట్సాప్ తీసుకొచ్చిన ఈ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. మీ చాట్ విండోలో ఎవరైనా ఫోన్ నంబర్, క్యాలెండర్ తేదీ లేదా లొకేషన్ అడ్రస్‌ను టైప్ చేసి పంపితే.. మీరు వేరే యాప్‌లకు మారాల్సిన అవసరం లేదు. ఆ టెక్స్ట్ లేదా నంబర్‌పై కేవలం ఒక సారే ట్యాప్ చేస్తే చాలు, దానికి సంబంధించిన షార్ట్‌కట్ ఆప్షన్లు మీ స్క్రీన్ పైకి వస్తాయి.
ఫోన్ నంబర్లపై ట్యాప్ చేస్తే.. చాట్‌లో ఉన్న ఏదైనా మొబైల్ నంబర్‌పై క్లిక్ చేయగానే, నేరుగా కాల్ చేయడం, వాట్సాప్ కాల్ చేయడం లేదా ఆ నంబర్‌ను కాంటాక్ట్ సేవ్ చేసుకోవడానికి ఆప్షన్లు కనిపిస్తాయి. దీని వల్ల నంబర్‌ను కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం పూర్తిగా తప్పుతుంది.
తేదీ పై ట్యాప్ చేస్తే..ఏదైనా ఈవెంట్ లేదా అపాయింట్‌మెంట్ డేట్ చాట్‌లో వస్తే, ఆ తేదీపై ట్యాప్ చేయడం ద్వారా నేరుగా మీ ఫోన్‌లోని క్యాలెండర్‌లో రిమైండర్ లేదా ఈవెంట్‌ను సెట్ చేసుకునే షార్ట్‌కట్ ఓపెన్ అవుతుంది.
అడ్రస్ పై ట్యాప్ చేస్తే.. ఎవరైనా లొకేషన్ లేదా అడ్రస్ పంపితే, దానిపై క్లిక్ చేయగానే గూగుల్ మ్యాప్స్ లేదా ఇతర నావిగేషన్ యాప్‌లు ఓపెన్ అయ్యి ఆ దారిని చూపించడం ప్రారంభిస్తాయి.
సాధారణంగా మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు త్వరగా సమాచారం షేర్ చేసుకోవడానికి, లేదా పనులు పూర్తి చేయడానికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా ఆఫీస్ చాట్స్‌లో లేదా వ్యాపార సంబంధిత విషయాల్లో ఎమర్జెన్సీగా నంబర్లు, అడ్రస్‌లు పంపినప్పుడు ఈ ఫీచర్ టైమ్‌ను విపరీతంగా ఆదా చేస్తుంది. వాట్సాప్ తన యూజర్ల అనుభవాన్ని మరింత ఈజీ చేయడానికి ఈ కాంటెక్స్చువల్ షార్ట్‌కట్ సిస్టమ్‌ను డెవలప్ చేసింది.
Also Read: కళ్లు చెదిరే ఫీచర్లతో..కొత్త గోబోల్ట్ ఇయర్ బడ్స్ లాంచ్
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ దశలవారీగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ,ఐఓఎస్ యూజర్లందరికీ అందిస్తోంది. మీ ఫోన్‌లో ఈ ఫీచర్ పనిచేయాలంటే..ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్‌కి వెళ్లి మీ వాట్సాప్‌ను లేటెస్ట్.. వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి. ఒక వేళ అప్‌డేట్ చేసినప్పటికీ ఈ ఫీచర్ మీకు ఇంకా కనిపించకపోతే..వాట్సాప్ సర్వర్ సైడ్ నుంచి త్వరలోనే మీ అకౌంట్ కు కూడా అందుబాటులోకి వస్తుంది.
మొత్తానికి..చిన్న చిన్న పనుల కోసం కూడా వేరే యాప్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వాట్సాప్ చాట్ విండోలోనే అన్ని పనులు చేసుకునేలా వస్తున్న ఈ ఫీచర్ నిజంగా టెక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరి మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ పని చేస్తుందో లేదో చెక్ చేయండి!