E-Paper
Advertisement

వాచ్‌తో ECG తీసి డాక్టర్‌కు రిపోర్ట్ పంపొచ్చు.. భారత్‌లోకి వచ్చిన గార్మిన్ కొత్త ఫీచర్ ఇదే!

వాచ్‌తో ECG తీసి డాక్టర్‌కు రిపోర్ట్ పంపొచ్చు.. భారత్‌లోకి వచ్చిన గార్మిన్ కొత్త ఫీచర్ ఇదే!
Advertisement

Garmin ECG App: టెక్నాలజీ మారుతున్న కొద్దీ స్మార్ట్‌వాచ్‌లు కేవలం సమయం చూడటానికి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే లైఫ్‌సేవర్లుగా మారుతున్నాయి. ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీ సంస్థ గార్మిన్.. భారతీయ వినియోగదారుల కోసం ఒక సరికొత్త హెల్త్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ECG APP. ఈ ఫీచర్ ద్వారా మన మణికట్టుపై ఉన్న వాచ్ సహాయంతోనే కేవలం 30 సెకన్లలో గుండె కొట్టుకునే విధానాన్ని రికార్డ్ చేసి, హృదయ స్పందనలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు.

ఇదెలా పనిచేస్తుందంటే?

ఈ యాప్ వాడటం చాలా తేలిక. స్మార్ట్‌వాచ్‌లోని ఇన్-బిల్ట్ సెన్సార్లు గుండె ఎలక్ట్రికల్ యాక్టివిటీని గ్రహిస్తాయి. వాచ్‌లో ఈసీజీ ఆప్షన్ ఓపెన్ చేసి, 30 సెకన్ల పాటు కదలకుండా ఉంటే చాలు. మన గుండె లయబద్ధంగా కొట్టుకుంటోందో లేక ఏమైనా తేడా ఉందా అనేది యాప్ విశ్లేషిస్తుంది. ముఖ్యంగా కర్ణిక దడ (Atrial Fibrillation – AFib) అని పిలిచే ప్రమాదకరమైన క్రమరహిత గుండె స్పందనల సూచనలను ఇది వెంటనే పసిగడుతుంది.

Advertisement

Also Read: యాపిల్ నుంచి ఊహించని ట్విస్ట్.. iPhone 18లో ఏకంగా నాలుగు భారీ మార్పులు.. ధర ఎంతంటే?

రిపోర్ట్స్ డౌన్‌లోడ్, షేరింగ్:

ఈసీజీ రికార్డింగ్ పూర్తయిన తర్వాత ఆ ఫలితాలను వాచ్‌లోనే కాకుండా ఫోన్‌లోని Garmin Connect యాప్‌లో వివరంగా చూడవచ్చు. గతంలో తీసుకున్న ఈసీజీ రీడింగ్స్ అన్నీ ఇందులో భద్రంగా ఉంటాయి. అవసరమైనప్పుడు ఈ డేటాను పీడీఎఫ్ (PDF) రిపోర్ట్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని నేరుగా డాక్టర్‌కు షేర్ చేయవచ్చు. 22 ఏళ్లు పైబడిన వారు ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. అయితే ఇది కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమేనని, అత్యవసర వైద్య పరిస్థితుల్లో డాక్టర్ సలహా తీసుకోవడమే ఉత్తమమని కంపెనీ తెలిపింది.

సపోర్ట్ చేసే గార్మిన్ మోడల్స్:

Advertisement

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Garmin Fenix ​​9, Venu 4, Forerunner 970 వంటి ప్రీమియం మోడళ్లలో మాత్రమే ఈ ECG APP అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ పొందాలంటే వాచ్ సాఫ్ట్‌వేర్‌తో పాటు గార్మిన్ కనెక్ట్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

గార్మిన్ తాజా ఉత్పత్తులు:

దీంతో పాటు గార్మిన్ భారతదేశంలో Cirka Smart Bandను కూడా లాంచ్ చేసింది. స్క్రీన్ లేని ఈ డిజైన్ బ్యాండ్ అసలు ధర రూ.29,990 కాగా.. ఆఫర్‌లో రూ.25,990కి లభిస్తోంది. అలాగే ఇటీవల విడుదలైన Forerunner 70, 170, 170 మ్యూజిక్ మోడళ్లు అమోల్డ్ డిస్ప్లే, హార్ట్ రేట్, పల్స్ ఆక్స్ సెన్సార్లతో అలరిస్తున్నాయి.

Also Read: మార్కెట్‌లోకి రాకముందే ఇన్ని కఠినమైన పరీక్షలా? Samsung Galaxy Z Fold 8 వెనుకున్న ఈ కష్టం తెలిస్తే..

Tags

Related News

కళ్లు చెదిరే ఫీచర్లతో..కొత్త గోబోల్ట్ ఇయర్ బడ్స్ లాంచ్

ప్రీమియం లెదర్ లుక్‌తో నాయిస్ బడ్స్..ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే!

బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్

Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!

యాపిల్ నుంచి ఊహించని ట్విస్ట్.. iPhone 18లో ఏకంగా నాలుగు భారీ మార్పులు.. ధర ఎంతంటే?

రూ.7,190కే వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు!

BSNL సంచలన ప్లాన్.. రోజుకు రూ.7 మాత్రమే.. ఏడాదంతా ఫ్రీ కాల్స్, డేటా!

Big Stories

Advertisement
×