E-Paper
Advertisement

కళ్లు చెదిరే ఫీచర్లతో..కొత్త గోబోల్ట్ ఇయర్ బడ్స్ లాంచ్

కళ్లు చెదిరే ఫీచర్లతో..కొత్త గోబోల్ట్ ఇయర్ బడ్స్ లాంచ్
Advertisement

GOBOULT Mustang Sprint: ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ఇయర్ బడ్స్ కేవలం మ్యూజిక్ వినడానికి మాత్రమే కాకుండా.. నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయి. ఆఫీస్ మీటింగ్స్, వర్కౌట్లు, ప్రయాణాలు లేదా సినిలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైనా సరే మంచి ఇయర్ బడ్స్ ఉంటే.. ఆ ఫీల్ ఏ వేరుగా ఉంటుంది. అయితే ఎక్కువ ధర పెట్టి బ్రాండెడ్ ఇయర్ బడ్స్ కొనలేని వారి కోసం గోబోల్ట్ సంస్థ తక్కువ ధరలో.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లున్న ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఇయర్ బడ్స్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ధర:

ఈ ఇయర్ బడ్స్ మెయిన్ అట్రాక్షన్ వీటి ధర అనే చెప్పాలి. మార్కెట్లో.. లభించే ఇతర బ్రాండ్లతో పోలిస్తే..ఈ మోడల్ కేవలం రూ.1,299 ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. రూ.1,500 లోపు బడ్జెట్‌లో ఏఎన్‌సీ, లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్‌తో  ఇయర్ బడ్స్ దొరకడం నిజంగా టెక్ లవర్స్‌కు గుడ్ న్యూసే. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు , గోబోల్ట్ అధికారిక స్టోర్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

డిజైన్, బిల్డ్ క్వాలిటీ:

Advertisement

ఈ ఇయర్ బడ్స్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడ్రన్‌గా, స్పోర్టీ లుక్‌లో ఉంటాయి. చెవులలో.. పెట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉండేలా వీటిని డిజైన్ చేశారు. ఎంతసేపు పెట్టుకున్నా.. చెవులకు ఎలాంటి నొప్పి ఉండదు. వ్యాయామాలు చేసే టప్పుడు లేదా రన్నింగ్ చేసేటప్పుడు కూడా ఇవి జారి పోకుండా ఉంటాయి.

అద్భుతమైన ఫీచర్లు, పెర్ఫార్మెన్స్:

60 గంటల భారీ బ్యాటరీ లైఫ్: ఈ ఇయర్ బడ్స్ అతిపెద్ద ప్లస్ పాయింట్ వీటి బ్యాటరీ బ్యాకప్. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇవి ఏకంగా 60 గంటల పాటు నాన్‌ స్టాప్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. అంటే ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజుల తరబడి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు.

Advertisement

32dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్: ఈ బడ్జెట్‌లో.. 32dB వరకు  ఏఎన్‌సీ సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల బయటి ప్రపంచంలోని అనవసరమైన శబ్దాలు, ట్రాఫిక్ సౌండ్లు చెవుల్లోకి రాకుండా చేసి, మ్యూజిక్‌ను ప్రశాంతంగా వినేలా చేస్తాయి.

క్వాడ్ మైక్ ఏఎన్‌సీ: కాల్స్ మాట్లాడేటప్పుడు.. స్పష్టమైన వాయిస్ వినిపించేందుకు ఇందులో క్వాడ్ మైక్ ఈఎన్‌సీ  టెక్నాలజీని వాడారు.మీరు రద్దీగా ఉండే ప్రదేశంలో ఉన్నప్పటికీ.. ఎదుటివారికి మీ మాటలు క్లియర్‌గా వినిపిస్తాయి.

10mm డ్రైవర్లు,యాంప్ యాప్ సపోర్ట్: ఇందులో.. ఉండే 10mm డ్రైవర్లు డీప్ బేస్, హై-క్వాలిటీ సౌండ్‌ను అందిస్తాయి. అంతే కాకుండా ‘Amp App’ సపోర్ట్ ద్వారా మీ టేస్ట్‌కు తగినట్లుగా సౌండ్ ఈక్వలైజర్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

Also Read: బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్

లేటెస్ట్ BT v6.0, డ్యూయల్ డివైస్ పేరింగ్: ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ v6.0 టెక్నాలజీ ఉంది. ఇది తక్కువ పవర్ తో ఎక్కువ కనెక్షన్‌ను ఇస్తుంది. అలాగే ఒకే సమయంలో.. రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే డ్యూయర్ పేరింగ్ ఫీచర్ దీని సొంతం. గేమింగ్ లవర్స్ కోసం లో-లేటెన్సీ మోడ్ కూడా అందుబాటులో ఉంది.

ఎందుకు బెస్ట్?

మీరు తక్కువ బడ్జెట్‌లో (రూ. 1,200 – 1,300 రేంజ్‌లో) బెస్ట్ సౌండ్ క్వాలిటీ, లాంగ్ బ్యాటరీ లైఫ్, ఏఎన్‌సీ, లేటెస్ట్ ఫీచర్లు కోరుకుంటే.. ఈ మోడల్ ఇయర్ బడ్స్ పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ ధరలో ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అందించడం నిజంగా అద్భుతం. ఇంకెందుకాలస్యం వెంటనే మీ ఆర్డర్‌ను ప్లేస్ చేసుకోండి!

Related News

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్..నంబర్,తేదీపై ట్యాప్ చేస్తే చాలు షార్ట్‌కట్లు ఓపెన్!

ప్రీమియం లెదర్ లుక్‌తో నాయిస్ బడ్స్..ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే!

వాచ్‌తో ECG తీసి డాక్టర్‌కు రిపోర్ట్ పంపొచ్చు.. భారత్‌లోకి వచ్చిన గార్మిన్ కొత్త ఫీచర్ ఇదే!

బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్

Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!

యాపిల్ నుంచి ఊహించని ట్విస్ట్.. iPhone 18లో ఏకంగా నాలుగు భారీ మార్పులు.. ధర ఎంతంటే?

రూ.7,190కే వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Big Stories

Advertisement
×