E-Paper
Advertisement

టైటాన్ మీదకు మీ పేరు.. నాసా నుంచి బోర్డింగ్ పాస్ కూడా, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

టైటాన్ మీదకు మీ పేరు.. నాసా నుంచి బోర్డింగ్ పాస్ కూడా, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!
Advertisement

అల్లంత దూరాన్న ఉన్న అంతరిక్షంలో అలా అలా ఎగిరిపోతుంటే.. ఎంత బాగుంటుందో కదూ. అయితే, ఇదంతా కలలోనే సాధ్యం. లేదా వ్యోమగామిగా కూడా ఛాన్స్ కొట్టేయొచ్చు. కానీ, ఆ అవకాశం దొరకడం అంత ఈజీ కాదు. అయితే.. నాసా త్వరలో చేపట్టనున్న ‘డ్రాగన్‌ఫ్లై’ అంతరిక్ష మిషన్‌ ద్వారా ఒక అద్భుత అవకాశం ఇస్తోంది. భూమి నుంచి సుమారు 160 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న ఓ రహస్య ప్రపంచానికి మీ పేరును పంపనుంది. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ.

శని గ్రహానికి చెందిన అదిపెద్ద ఉపగ్రహం టైటాన్. నాసా త్వరలోనే డ్రాగన్‌ఫ్లై అంతరిక్ష మిషన్‌లో భాగంగా అటువైపు ప్రయాణం చేయనుంది. ఈ సందర్భంగా జనాల నుంచి సేకరించిన పేర్లను ఒక డిజిటల్ చిప్‌లో భద్రపరిచి.. అంతరిక్ష నౌకలో తీసుకెళ్తారు. ఈ మిషన్‌లో భాగంగా.. టైటాన్ ఉపరితలంపై ఎగురుతూ పలు పరిశోధనలు చేయనున్నారు. అక్కడి సేంద్రియ రసాయానాలను అధ్యయనం చేస్తారు. అక్కడి జీవించడానికి అనకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేదా అని తెలుసుకోనున్నారు.

మీ పేర్లు ఇవ్వండి..

Advertisement

ఈ మిషన్‌లో ప్రజలను కూడా భాగస్వామ్యులను చేయాలనే ఉద్దేశంతో నాసా ‘సెండ్ యువర్ నేమ్ టు టైటాన్’ అనే కార్యక్రమం చేపట్టింది. జనాలు పంపిన పేర్లను డ్రాగన్‌ఫ్లై ద్వారా అంతరిక్షంలోకి పంపిస్తారు. సాధారణంగా ఇతర గ్రహాలపై పరిశోధనలు చేసే రోవర్లు నేలపై నడుస్తూ ముందుకు సాగుతాయి. కానీ, డ్రాగన్‌ఫ్లై మాత్రం ఎనిమిది రోటర్ల సహాయంతో హెలికాప్టర్‌లా గాల్లో ఎగురుతూ.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లగలదు. టైటాన్‌లో వాతావరణం భూమి కంటే భిన్నంగా ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ. దానివల్ల ఎగురుతూ పరిశోధనలు చేయడం సులభంగా ఉంటుంది.

అదో రహస్య ప్రపంచం..

టైటాన్‌పై ద్రవరూపంలో ఉన్న మిథేషన్, ఈథేన్ సరస్సులు, సముద్రాలు ఉంటాయి. దాని ఉపరితలంపై సంక్లిష్టమైన సేంద్రియ అణువులు పేరుకుపోతుంటాయి. వీటిని అధ్యయనం చేయడం ద్వారా ఆ రహస్య ప్రపంచం గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. టైటాన్‌ మీద సుమారు మైనస్ 179 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇంత తీవ్రమైన చలిలో నీరు గడ్డకట్టి రాయిలా మారిపోతుంది. అయితే, మీథేన్ మాత్రం అక్కడ నీరు తరహాలో ప్రవర్తిస్తుంది. మీథేన్ మేఘాలు ఏర్పడటం, వర్షం కురవడం, నదులు, సరస్సులు ఏర్పడటం వంటివి ఏర్పడతాయి.

ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే..

Advertisement

దీని గురించి నాసాకు చెందిన సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ నిక్కీ ఫాక్స్ మాట్లాడుతూ.. ‘‘అంతరిక్ష చరిత్రలో మొట్టమొదటి సారి రోటర్ క్రాఫ్ట్‌ను ఉపయోగిస్తున్నాం. భూమికి దూరంగా ఉన్న మరో ప్రపంచంలో జీవానికి అనుకూలమైన పరిస్థితుల కోసం అన్వేషించడం ఈ మిషన్ ముఖ్య లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌లో మానవళి మొత్తం భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ప్రజల పేర్లను అంతరిక్షంలోకి పంపించాలని నాసా కోరుకుంటోంది’’ అని తెలిపారు. టైటాన్ మీద సూర్యకాంతి చాలా తక్కువ. అందుకే డ్రాగన్‌ఫ్లై సౌర విద్యుత్‌ మీద ఆధారపడదు. దీనికి బదులుగా రేడియోధార్మిక ఐసోటోప్ ఆధారిత విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

Also Read: ఆ రోడ్డు మీద నిలబడి.. ఏం కోరుకున్నా జరిగిపోద్ది, కానీ.. మీ ఆత్మను సైతాన్‌కు రాసివ్వాలట!

మీ పేరు ఇలా నమోదు చేసుకోండి

డ్రాగన్‌ఫ్లై ద్వారా మీ పేరును టైటాన్ మీదకు పంపాలి అనుకుంటే.. నాసా వెబ్ సైట్లో మీ పేర్లను నమోదు చేసుకోవాలి. నాసా షేర్ చేసిన ఈ లింక్ https://my.nasa.gov/specialevents/s/send-your-name-with-dragonfly మీద క్లిక్ చేసి.. మీ పేరు, మెయిల్ ఐడీ ఇస్తే చాలు. వెంటనే మీకు నాసా నుంచి మెయిల్ వస్తుంది. దానితోపాటు మీ పేరుతో డ్రాగన్‌ఫ్లై బోర్డింగ్ పాస్ కూడా జనరేట్ అవుతుంది. ఇప్పటివరకు సుమారు 2.70 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ పేరు కూడా నమోదు చేసుకోండి.

Tags

Related News

జియో సెన్సేషనల్ ప్లాన్.. జస్ట్ రూ.84తో నెల మొత్తం సిమ్ యాక్టివ్.. బడ్జెట్ సేవ్ చేసుకోండిలా!

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్..నంబర్,తేదీపై ట్యాప్ చేస్తే చాలు షార్ట్‌కట్లు ఓపెన్!

కళ్లు చెదిరే ఫీచర్లతో..కొత్త గోబోల్ట్ ఇయర్ బడ్స్ లాంచ్

ప్రీమియం లెదర్ లుక్‌తో నాయిస్ బడ్స్..ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే!

వాచ్‌తో ECG తీసి డాక్టర్‌కు రిపోర్ట్ పంపొచ్చు.. భారత్‌లోకి వచ్చిన గార్మిన్ కొత్త ఫీచర్ ఇదే!

బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్

Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!

Big Stories

Advertisement
×