Noise Buds UNO: టెక్నాలజీ మారుతున్న కొద్దీ.. మనం వాడే గాడ్జెట్లు కూడా కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. అందులోనూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్‌స్టైల్‌లో తప్పనిసరిగా మారిపోయాయి. ఆఫీస్ కాల్స్ అటెండ్ అవ్వాలన్నా, జిమ్‌లో వర్కౌట్లు చేయాలన్నా, లేదా ప్రయాణాల్లో పాటలు వినాలన్నా మంచి ఇయర్ బడ్స్ ఉంటే.. ఆ మజాయే వేరు. అయితే మార్కెట్లో.. వేల రూపాయలు వెచ్చించి బ్రాండెడ్ ఇయర్ బడ్స్ కొనడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి వారి కోసమే నాయిస్ సంస్థ అత్యంత తక్కువ ధరలో.. ప్రీమియం ఫీల్ అందించేలా ‘Noise Buds UNO’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
ఈ ఇయర్ బడ్స్ అతిపెద్ద హైలైట్ వీటి ధర అనే చెప్పాలి. మార్కెట్లో లభించే.. ఇతర బ్రాండ్లతో పోటీపడుతూ.. నాయిస్ బడ్స్ ఉనో కేవలం రూ.1,099 ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. కేవలం రూ. 1,100 లోపు బడ్జెట్‌లో.. ప్రీమియం డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు ఉండటం నిజంగా టెక్ లవర్స్ కు ఒక జాక్‌పాట్ లాంటి వార్తే. ప్రస్తుతం ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో.. పాటు నాయిస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
చూడటానికి చాలా సాధారణంగా ఉండే.. ఇతర బడ్జెట్ ఇయర్ బడ్స్‌లా కాకుండా..నాయిస్ బడ్స్ ఉనో ఎంతో ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. దీనికి ఇచ్చిన ప్రీమియం లెదర్ యాసెంట్ ఫినిషింగ్ ఈ ఇయర్ బడ్స్‌కు ఒక క్లాసీ లుక్‌ను ఇస్తుంది. ముఖ్యంగా నేవీ గ్రైన్ కలర్ ఆప్షన్‌లో చూడటానికి ట్రెండీ లుక్ కలిగి ఉన్నాయి. అంతే కాకుండా ఇవి చెవులలో పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎర్గోనామిక్ డిజైన్‌తో వీటిని తయారు చేశారు. ఎంత సేపు వాడినప్పటికీ చెవులు నొప్పి పెట్టవు.
40 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్: ఈ గాడ్జెట్ ప్రధాన బలం దీని బ్యాటరీ లైఫ్. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది ఏకంగా 40 గంటల పాటు పని చేస్తుంది. రోజంతా.. హెవీగా వాడినా సరే, రోజుల తరబడి దీనికి మళ్లీ ఛార్జ్ పెట్టాల్సిన అవసరం రాదు.
కాల్స్ కోసం క్వాడ్ మైక్ ENC: రద్దీగా ఉండే.. రోడ్లు లేదా బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాల్స్ మాట్లాడటం చాలా కష్టంగా ఉంటుంది. కానీ.. ఇందులో ఉన్న క్వాడ్ మైక్ ENC టెక్నాలజీ బయటి సౌండ్లను అణచివేసి, మీ గొంతును అవతలి వారికి స్పష్టంగా వినిపించేలా చేస్తుంది.
Also Read: బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్
డ్యూయల్ పేరింగ్ : ఒకే సమయంలో లాప్‌టాప్ , మొబైల్ ఫోన్ రెండింటినీ వాడేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగ పడుతుంది. డ్యూయల్ పేరింగ్ సపోర్ట్.. ఉండటం వల్ల డివైజ్‌ల మధ్య కనెక్షన్‌ను మార్చుకోవడం చాలా ఈజీ అవుతుంది.
లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ: లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీతో పని చేయడం వల్ల.. ఫోన్‌తో కనెక్షన్ ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉంటుంది. వీడియోలు చూసేటప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు ఆడియోలో ఎలాంటి ల్యాగ్ ఉండదు.
మీరు తక్కువ బడ్జెట్‌లో.. స్టైలిష్ లుక్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ ,క్లియర్ కాల్ క్వాలిటీ కోరుకుంటున్నట్లయితే..రూ.1,099 ధరలో లభించే ఈ మోడల్ నూటికి నూరు శాతం సరైన ఆప్షన్ అవుతుంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇన్ని ఫీచర్లు.. కేవలం నాయిస్ సంస్థ మాత్రమే అందించగలదు. ఆలస్యం చేయకుండా.. ఈ అద్భుతమైన ఇయర్ బడ్స్‌ను మీ సొంతం చేసుకోండి!