E-Paper
Advertisement

ఇల్లు మెరిసిపోవడానికి..టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఇవే!

ఇల్లు మెరిసిపోవడానికి..టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఇవే!
Advertisement

Robot vacuum cleaner deals Amazon 2026: ఇళ్ల శుభ్రత విషయంలో ఇప్పుడు కాలం మారింది. చేతులతో ఇల్లు ఊడ్చి,తుడిచే రోజులు పోయి, ఆ పనులన్నీ చేయడానికి స్మార్ట్ రోబోట్లు మన ఇంట్లోకి వచ్చేసాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి,మహిళలకు ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఒక నిజమైన వరంలా మారాయి. కస్టమర్లు ఎక్కువగా స్మార్ట్ ఫీచర్లు, ఎక్కువ సక్షన్ పవర్, ఆటోమేటిక్ డస్ట్ కలెక్షన్ ఉన్న క్లీనర్లపై ఆసక్తి చూపుతున్నారు. సరిగ్గా.. ఇదే సమయంలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అసాధారణమైన ఆఫర్లతో..కస్టమర్ల ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో తక్కువ ధరకే.. లభిస్తున్న టాప్ 5 రోబోట్ హౌస్ క్లీనర్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 రోబోట్ హౌస్ క్లీనర్లు:

1.ILIFE A30 Pro Robot Vacuum Cleaner:

Advertisement

ఈ సేల్‌లో అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తున్న బెస్ట్ మోడల్స్‌లో.. ఐలిఫ్ ఏ30 ప్రో ముందుంటుంది.దీని అసలు ధర రూ.69,999 కాగా.. అమెజాన్ సేల్‌లో భారీ తగ్గింపుతో కేవలం రూ. 19,899 ధరకే లభిస్తోంది. ఇది 13,000Pa పవర్ ఫుల్ సక్షన్ పవర్,  నావిగేషన్ ,సెల్ఫ్-ఎండ్టీ స్టేషన్‌తో వస్తుంది. దీనిలోని.. 2.5 లీటర్ల డస్ట్ బ్యాగ్ దాదాపు ఏడు వారాల పాటు చెత్తను నిల్వ ఉంచుతుంది. వై-షేప్ మోపింగ్ విధానం ద్వారా.. నేలను మరింత శుభ్రంగా మలుస్తుంది.

2. Dreame D10 Plus Gen 2:

పెట్ హెయిర్ కార్పెట్లు ఉన్న ఇళ్లకు డ్రీమ్ డి10 ప్లస్ జెన్ 2 చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని మార్కెట్ ధర రూ.39,999 ఉండగా.. ఆఫర్ ధరలో.. ఇది రూ.22,999కే.. అందుబాటులో ఉంది. ఇది 6,000Pa సక్షన్ పవర్ కలిగి ఉంది. ఇందులో.. 90 రోజుల పాటు డస్ట్ స్టోరేజ్ చేసుకోగల కెపాసిటీ, స్మార్ట్ నావిగేషన్ ,285 నిమిషాల పాటు నిరంతరం పనిచేసే పవర్ ఫుల్ బ్యాటరీ లభిస్తుంది.

3. ECOVACS Deebot Mini Omni:

Advertisement

చిన్న ఇళ్లకు లేదా తక్కువ స్థలం ఉన్న అపార్ట్‌మెంట్లకు సరి పోయేలా ఎకోవాక్స్ డీబోట్ మినీ ఓమ్ని ప్రత్యేకంగా.. లాంచ్ చేయబడింది. దీని ధర రూ.39,999 వద్ద ట్రెండింగ్‌లో ఉంది. ఇది 9,000Pa సక్షన్ పవర్‌తో.. పాటు, 45 డిగ్రీల హాట్ ఎయిర్ డ్రైయింగ్ , జీరో ట్యాంగిల్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది డీప్ మోపింగ్ చేయడంలో.. అద్భుతంగా పని చేస్తుంది.

4. ECOVACS Deebot Y1 Pro:

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ.. బ్యాకప్ కోరుకునే వారి కోసం ఎకోవాక్స్ డీబోట్ వై1 ప్రో బెస్ట్ ఆప్షన్. దీని అసలు ధర రూ. 59,900 కాగా, అమెజాన్ సేల్‌లో.. ఇది కేవలం రూ. 14,999 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఇది 6,500Pa సక్షన్ పవర్ ,5,200mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒకేసారి.. దాదాపు 3,500 చదరపు అడుగుల వైశాల్యాన్ని శుభ్రం చేయగలదు. దీని బ్యాటరీ లైఫ్ సుమారు 320 నిమిషాల వరకు ఉంటుంది.

Also Read: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్..నంబర్,తేదీపై ట్యాప్ చేస్తే చాలు షార్ట్‌కట్లు ఓపెన్!

5. MOVA E10 Robot Vacuum Cleaner:

మీరు మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా.. బేసిక్ స్మార్ట్ క్లీనర్ కావాలనుకుంటే మోవా ఈ10 మంచి ఛాయిస్. దీని అసలు ధర రూ. 34,999 ఉండగా.. సేల్‌లో కేవలం రూ.11,998 ధరకే లభిస్తోంది. 4,500Pa సక్షన్ పవర్, LDS నావిగేషన్, వాక్యూమ్-అండ్-మోప్ కాంబో విధానంతో ఇది వస్తుంది. కేవలం 7.6 సెం.మీ ఎత్తు ఉండే.. ఈ రోబోట్ మంచాలు, సోఫాల కింద ఉన్న మ్యానువల్ క్లీనింగ్ కష్టమైన ప్రదేశాలలోకి కూడా ఈజీగా వెళ్తుంది. దీని బ్యాటరీ 150 నిమిషాల పాటు పని చేస్తుంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చుకోవడానికి బెస్ట్ టైం అని చెప్పొచ్చు. మీ బడ్జెట్ , అవసరాలకు తగిన రోబోట్ క్లీనర్‌ను ఎంచుకోవడం ద్వారా మీ పనిని మరింత ఈజీ చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే.. అందుబాటులో ఉంటాయి కాబట్టి వెంటనే ఆర్డర్ చేయండి!

Related News

టైటాన్ మీదకు మీ పేరు.. నాసా నుంచి బోర్డింగ్ పాస్ కూడా, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

జియో సెన్సేషనల్ ప్లాన్.. జస్ట్ రూ.84తో నెల మొత్తం సిమ్ యాక్టివ్.. బడ్జెట్ సేవ్ చేసుకోండిలా!

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్..నంబర్,తేదీపై ట్యాప్ చేస్తే చాలు షార్ట్‌కట్లు ఓపెన్!

కళ్లు చెదిరే ఫీచర్లతో..కొత్త గోబోల్ట్ ఇయర్ బడ్స్ లాంచ్

ప్రీమియం లెదర్ లుక్‌తో నాయిస్ బడ్స్..ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే!

వాచ్‌తో ECG తీసి డాక్టర్‌కు రిపోర్ట్ పంపొచ్చు.. భారత్‌లోకి వచ్చిన గార్మిన్ కొత్త ఫీచర్ ఇదే!

బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్

Big Stories

Advertisement
×