E-Paper
Advertisement

6000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో సరికొత్త 5G ఫోన్.. ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

6000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో సరికొత్త 5G ఫోన్.. ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!
Advertisement

Ai Plus Nova 2 Series: బడ్జెట్ ధరలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. Ai Plus కంపెనీ సరికొత్త Nova 2 Series మొదటి సేల్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా Nova 2 Neo 5G, Nova 2 Pro 5G అనే రెండు మోడళ్లను మార్కెట్లోకి దించారు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫర్ కింద బ్యాంక్ కార్డులపై రూ.1000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది.

Nova 2 Series ధరలు, ఆఫర్లు:

Nova 2 Neo 5G మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. దీని 4GB+128GB ధర రూ.12,999 కాగా, 6GB+128GB ధర రూ.13,999గా ఉంది. అలాగే కాస్త ప్రీమియం ఫీచర్లు ఉన్న Nova 2 Pro 5G విషయానికి వస్తే.. 6GB+128GB వేరియంట్ ధర రూ.15,999, అలాగే 8GB+128GB వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించారు. ప్రారంభ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుంటే ఈ ఫోన్లను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

రెండింటిలోనూ కామన్ ఫీచర్లు:

Advertisement

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో కొన్ని అదిరిపోయే కామన్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే బాధ లేకుండా రెండింటిలోనూ 6000mAh బ్యాటరీని ఇచ్చారు. అలాగే ఇవి ఆండ్రాయిడ్ 16 ఆధారిత NxtQuantum OS సాఫ్ట్‌వేర్‌పై నడుస్తాయి. ఫొటోల కోసం రెండింటిలోనూ 48 MP సోనీ ప్రైమరీ కెమెరాను అందించడం విశేషం.

Also Read: అబ్బా ఏం ఐడియా గురూ.. చీపురుకు అల్యూమినియం ఫాయిల్ చుడితే ఇన్ని బెనిఫిట్సా!

బడ్జెట్లో అదరగొట్టే Nova 2 Neo:

Advertisement

నోవా 2 నియో 5G ఫోన్ 6.74 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది స్మూత్ పెర్ఫార్మెన్స్ కోసం 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా మెమొరీని 2TB వరకు పెంచుకోవచ్చు. ఇక సెల్ఫీల కోసం 8MP కెమెరా, సెక్యూరిటీ కోసం సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ప్రీమియం లుక్‌తో Nova 2 Pro:

ఇక నోవా 2 ప్రో 5G మరింత అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఇది 6.9 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 144Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను అమర్చారు. దీని వెనుక భాగంలో 48MP కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ కెమెరా, ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీని ద్వారా 2K వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో వచ్చే కస్టమైజబుల్ ఎల్‌ఈడీ నోటిఫికేషన్ లైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది వేగంగా ఛార్జ్ అవ్వడానికి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Also Read: సామాన్యుల కోసం చౌకైన ధరకే OnePlus N6.. భారత మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే!

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×