E-Paper
Advertisement

ఉప్పు నీళ్లయినా సరే.. బట్టలు మెరిసిపోవాల్సిందే! మార్కెట్‌లో IFB 6kg వాషింగ్ మెషీన్ రచ్చ

ఉప్పు నీళ్లయినా సరే.. బట్టలు మెరిసిపోవాల్సిందే! మార్కెట్‌లో IFB 6kg వాషింగ్ మెషీన్ రచ్చ
Advertisement

IFB 6 kg front load washing machine: బట్టలు చేత్తో ఉతికి ఉతికి అలసిపోతున్నారా? వర్షాకాలంలో బట్టలు ఆరక విసుగు వస్తోందా? అయితే మీ హోమ్ అప్లయన్స్ లిస్ట్‌లో చేరాల్సిన బెస్ట్ గ్యాడ్జెట్ IFB 6 kg Fully Automatic Front Load Washing Machine (DIVA AQUA SX). చిన్న, మీడియం ఫ్యామిలీస్ కోసం ఐఎఫ్‌బీ (IFB) బ్రాండ్ నుంచి వచ్చిన ఒక పవర్‌ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ వాషింగ్ మెషీన్ ఇది. సరికొత్త ఫీచర్లు, తక్కువ కరెంట్, తక్కువ వాటర్ వాడకంతో మీ బట్టలను సరి కొత్తగా మెరిపించేందుకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

ఈ రోజుల్లో బిజీ లైఫ్ వల్ల బట్టలు ఉతకడం అనేది పెద్ద టాస్క్‌గా మారిపోయింది. మార్కెట్లో ఎన్నో రకాల టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు ఉన్నప్పటికీ, ‘ఫ్రంట్ లోడ్’ ఇచ్చే క్లీనింగ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. హోమ్ అప్లయన్సెస్ రంగంలో నమ్మకమైన బ్రాండ్ అయిన IFB నుంచి బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన IFB 6 kg Diva Aqua SX గురించి, ఇది మీ ఇంటికి ఎందుకు బెస్ట్ ఆప్షనో ఇప్పుడు తెలుసుకుందాం.

IFB 6 kg Diva Aqua SX ఫీచర్ల వివరాలు:  

Advertisement

1. లుక్ అండ్ డిజైన్:

ఈ వాషింగ్ మెషిన్ సిల్వర్ కలర్ బాడీతో చాలా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. 6 కేజీల కెపాసిటీ ఉండటం వల్ల బ్యాచిలర్స్, కపుల్స్ లేదా 3-4 గురు ఉన్న చిన్న కుటుంబాలకు ఇది పక్కాగా సరిపోతుంది. దీని కంట్రోల్ ప్యానెల్ చాలా సింపుల్‌గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు.

Advertisement

2.ఆక్వా ఎనర్జీ టెక్నాలజీ:
చాలా చోట్ల హార్డ్ వాటర్ (ఉప్పు నీరు) సమస్య ఎక్కువగా ఉంటుంది. ఉప్పు నీటి వల్ల డిటర్జెంట్ సరిగ్గా కరగదు. బట్టలు కూడా పాడవుతాయి. కానీ ఈ మెషిన్‌లో ఉన్న ‘Aqua Energie’ టెక్నాలజీ నీటిని సాఫ్ట్‌గా మార్చి, డిటర్జెంట్ పూర్తిగా కరిగేలా చేస్తుంది. దీని వల్ల బట్టల మురికి చాలా సులువుగా వదిలిపోతుంది. అంతే కాకుండా బట్టల లైఫ్ పెరుగుతుంది.

3.2D వాష్ సిస్టమ్ , క్రిసెంట్ మూన్ డ్రమ్:
ఇందులోని 2D వాష్ సిస్టమ్ నీటిని, డిటర్జెంట్‌ను డ్రమ్ లోపల అన్ని వైపులా సమానంగా సర్క్యులేట్ చేస్తుంది. అలాగే..దీని డ్రమ్ లోపలి భాగం ‘క్రిసెంట్ మూన్’ షేప్‌లో డిజైన్ చేశారు. ఇది బట్టలు డ్రమ్ గోడలకు బలంగా తగలకుండా.. చాలా సున్నితంగా ఉతికేలా ప్రొటెక్ట్ చేస్తుంది.

4. వాష్ ప్రోగ్రామ్స్:
బట్టల రకాన్ని బట్టి ఇందులో.. దాదాపు 15 వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాటన్, సింథటిక్స్, ఊల్ మాత్రమే కాకుండా.. కేవలం 15 నిమిషాల్లోనే.. అర్జంట్‌గా బట్టలు ఉతికే ‘ఎక్స్‌ప్రెస్ వాష్’ ఫీచర్ కూడా ఉంది. అంతేకాదు, ఇందులోని ‘యాంటీ-అలెర్జెన్’ మోడ్ బట్టల్లో ఉండే బ్యాక్టీరియా , అలర్జీ కారకాలను పూర్తిగా తొలగిస్తుంది. పిల్లల బట్టలు ఉతకడానికి ఇది సూపర్ ఫీచర్.

Also Read: రూ.549 కే సోనీ బ్రాండ్ హెడ్‌ఫోన్స్! ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు బాస్

5.కరెంట్ ఆదా , లాండ్రీ యాడ్ ఫీచర్:
ఇది 5-స్టార్ ఎనర్జీ రేటింగ్తో వస్తుంది. కాబట్టి కరెంట్ బిల్లు భారీగా వస్తుందనే.. టెన్షన్ అస్సలు వద్దు. మెషీన్ ఆన్ చేసిన తర్వాత ఏదైనా బట్ట వేయడం మర్చిపోతే..‘లాండ్రీ యాడ్’ ఫీచర్ ద్వారా సైకిల్ మధ్యలోనే.. మెషిన్ ఆపి మళ్లీ బట్టలు యాడ్ చేసుకోవచ్చు. వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు మెషిన్‌ను కాపాడే.. ‘స్మార్ట్ వోల్టేజ్ ప్రొటెక్షన్’ కూడా ఇందులో ఉంది.

ధరల వివరాలు :
ప్రీమియం బ్రాండ్ ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ధర అందుబాటులోనే ఉంటుంది. ఇది ఆన్‌లైన్ ఇ-కామర్స్ సైట్లు (Amazon, Flipkart), రిటైల్ స్టోర్లలో సుమారు రూ.23,000 నుంచి రూ. 25,500 మధ్య అందుబాటులో ఉంది. (బ్యాంక్ ఆఫర్స్, సేల్స్ సమయంలో మరింత తక్కువకే లభించవచ్చు). దీనిపై IFB కంపెనీ 4 సంవత్సరాల పూర్తి వారంటీని కూడా అందిస్తోంది.

Related News

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

పాత ఫోన్ మార్చేయడానికి ఇదే సరైన టైమ్.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ టాప్ 5G డీల్స్!

Big Stories

Advertisement
×