E-Paper
Advertisement

ఇక సౌండ్‌తో రచ్చ రచ్చే! boAt Stone 650 బేస్ చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ఇక సౌండ్‌తో రచ్చ రచ్చే! boAt Stone 650  బేస్ చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Advertisement

Best Stone 650 price in India: మీరు ఎక్కడికెళ్లినా మ్యూజిక్ మిమ్మల్ని వదిలిపెట్టకూడదా? పార్టీ మూడ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలని ఉందా? అయితే మీ కోసమే వచ్చింది boAt Stone 650 10W Portable Bluetooth Speaker. అదిరిపోయే డైమండ్ గ్రిడ్ డిజైన్, గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పంచ్ బేస్, అల్ట్రా-పోర్టబుల్ బాడీతో ఈ స్పీకర్ మార్కెట్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఆడియో ఫీల్ పొందాలనుకునే ప్రతి ఒక్క మ్యూజిక్ లవర్స్ కోసం ఇదొక బెస్ట్ ఆప్షన్.

ఈ రోజుల్లో.. స్మార్ట్‌ ఫోన్ ఎంత ముఖ్యం అయిపోయిందో.. వీకెండ్ వస్తే చాలు ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవ్వడానికి ఒక మంచి బ్లూటూత్ స్పీకర్ కూడా అంతే అవసరమైపోయింది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో స్పీకర్లు ఉన్నా, బోట్ (boAt) బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ వేరు. అందులోనూ boAt Stone 650 మోడల్ ఇప్పుడు కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటోంది. దీని లుక్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Best Stone 650 ఫీచర్లు: 

1.డిజైన్:

Advertisement

మొదటి చూపులోనే.. ఇంప్రెస్ చేసే లుక్ ఈ స్పీకర్ సొంతం. దీనికి చుట్టూ ఉన్న సిలికాన్ కోటింగ్, ‘డాటెడ్ డైమండ్ షేప్డ్’ మెటల్ గ్రిడ్ డిజైన్ దీనికి చాలా ప్రీమియం, రగ్గడ్ లుక్‌ని ఇస్తాయి. ఇది కేవలం 655 గ్రాముల బరువు మాత్రమే ఉండటం వల్ల, మీ బ్యాగులో ఈజీగా సర్దేసి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. చేతిలో పట్టుకుంటే కూడా చాలా గ్రిప్ దొరుకుతుంది.

2.సౌండ్ క్వాలిటీ:

ఇందులో 2-ఇంచ్ ల డ్యూయల్ డ్రైవర్స్ ఉన్నాయి. ఇవి 10W RMS పవర్‌ఫుల్ ఆడియోను అవుట్‌పుట్ ఇస్తాయి. బోట్ వారి సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీతో.. క్రిస్టల్ క్లియర్ వాయిస్ మాత్రమే కాదు, మీ కాళ్లకు డ్యాన్స్ నేర్పించే రేంజ్ లో ‘డీప్ బేస్’ లభిస్తుంది. ఇండోర్ రూమ్ లో అయినా.. అవుట్‌డోర్ గార్డెన్ పార్టీలో అయినా దీని సౌండ్ హోరెత్తిపోతుంది.

3.బ్యాటరీ లైఫ్:

Advertisement

ఈ చిన్న స్పీకర్‌లో 1800mAh పవర్‌ఫుల్ బ్యాటరీని అమర్చారు. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు, దాదాపు 7 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ టైమ్‌ని ఇస్తుంది. దీని ఛార్జింగ్ టైమ్ సుమారు 3.5 గంటలు. లాంగ్ జర్నీలు చేసే వారికి, క్యాంపింగ్ వెళ్లే వారికి ఇది పర్ఫెక్ట్ పార్ట్నర్.

4.నీళ్లు పడినా నో టెన్షన్:

స్విమ్మింగ్ పూల్ దగ్గర పార్టీ చేసుకుంటున్నారా? లేదా అకస్మాత్తుగా వర్షం పడిందా? ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే.. boAt Stone 650 కి IPX5 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్ ఉంది. చిన్న చిన్న నీటి తుంపరలు, చెమట, దుమ్ము నుంచి దీనికి పూర్తి రక్షణ లభిస్తుంది.

5. కనెక్టివిటీ ఆప్షన్స్ :

ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ v5.0 కనెక్టివిటీ ఉంది. అంతే కాకుండా దీని ద్వారా 10 మీటర్ల పరిధిలో మీ ఫోన్, టాబ్లెట్ లేదా లాప్‌టాప్‌తో వేగంగా కనెక్ట్ అయిపోతుంది. బ్లూటూత్ మాత్రమే కాదు.. ఇందులో AUX ఇన్ మోడ్ , SD/TF కార్డ్ స్లాట్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా.. మెమరీ కార్డ్ పెట్టి పాటలు వినేయొచ్చు. అంతేకాదు..ఇందులోని ఇన్-బిల్ట్ మైక్ ద్వారా మీరు హ్యాండ్స్-ఫ్రీ కాల్స్ కూడా చాలా స్పష్టంగా మాట్లాడుకోవచ్చు.

Also Read: రూ.వెయ్యి బడ్జెట్‌లో.. మీ ఇల్లు థియేటర్ అయిపోవాల్సిందే!

ధర:

ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ స్పీకర్ ధర మీ బడ్జెట్ లోనే ఉంటుంది. దీని అసలు రూ. 4,990 అయినప్పటికీ.. ఆన్‌లైన్ ఇ-కామర్స్ సైట్లలో (Flipkart, Amazon, boAt Website) ఇది భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ప్రస్తుత ఆన్‌లైన్ ఆఫర్ ధర.. సుమారు రూ.1,396 నుంచి రూ. 1,699 మధ్యలో లభిస్తుంది. (కలర్ వేరియంట్, సేల్స్ బట్టి ధరలు మారవచ్చు).

బడ్జెట్ ధరలో సూపర్ బిల్డ్ క్వాలిటీ, అదిరిపోయే బేస్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉన్న బెస్ట్ బ్రాండెడ్ స్పీకర్ కావాలనుకుంటే boAt Stone 650 కి కళ్ళు మూసుకుని ఓకే చెప్పేయొచ్చు.

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×