Gas Cylinder Customers Alert: మరో రెండు రోజుల్లో జూలై నెల వచ్చేస్తోంది. దేశంలోని గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు బిగ్ అలర్ట్. గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఇంతకీ కొత్త రూల్స్ ఏంటి? వినియోగదారులపై ఏ మాత్రం భారం పడబోతోంది? 30 రోజుల నుంచి 90 రోజుల నిబంధనలు ఏమిటి? అన్నదానిపై ఓ లుక్కేద్దాం.
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్
ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. గల్ఫ్ నుంచి ముడి చమురు యథావిధిగా సరఫరా అవుతోంది. యుద్ధం మొదలైన తర్వాత హోటల్లు, పరిశ్రమలపై విధించిన నిబంధనలు ఎత్తేసింది కూడా. ఈ క్రమంలో జూలై ఒకటి నుంచి అనగా బుధవారం నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి.
దేశంలో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లు, పిఎన్‌జికి సంబంధించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. జూలై ఒకటి నుంచి ఇండేన్, భారత్, హెచ్‌పి గ్యాస్ ధరలు తగ్గుతాయనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఎల్‌పిజి బుకింగ్ వ్యవధి, గ్యాస్ సిలిండర్లు తిరిగి ఇచ్చే గడువును సవరించే అవకాశం ఉంది. దీనికితోడు గృహాలకు వంటగ్యాస్‌లో ఒక పెద్ద మార్పు పిఎన్‌జికి మారడం వంటివి ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. గడిచిన నెలరోజులుగా యూఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్, బ్రెంట్ క్రూడ్ రెండూ 20 నుంచి 22 శాతం వరకు ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం 70, 72 డాలర్ల మధ్య ట్రేడవుతున్నాయి. దీనికితోడు గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు సరఫరా సాధారణ స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ ధరలు తగ్గుతాయనే అంచనాలు జోరందుకున్నాయి.
బుధవారం నుంచి కొత్త రూల్స్, ధరల మాటేంటి?
2026 మార్చి ఒకటి నుండి జూన్ 30 వరకు 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ ధరలను ఐదుసార్లు పెంచింది కేంద్రం. ఈనెలలో ఎల్పీజీ ధరను సిలిండర్‌కు రూ. 43.50 నుండి రూ. 53.50 కు పెంచింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ఢిల్లీలో రూ. 3,113.50 పలుకుతోంది. ఇక ముంబైలో రూ. 3,067.50, చెన్నై- రూ. 3,283, కోల్‌కతా-ఒక్కో సిలిండర్‌కు రూ. 3,255.5 ధరలు పలుకుతున్నాయి.
జూలై 1 నుంచి 14.2 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరల మాటేంటి? 19 కేజీల సిలిండర్లతో పోల్చితే.. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపు తక్కువ. వీటి ధరలను రెండుసార్లు పెంచింది కేంద్రం. ఒక్కో సిలిండర్‌పై రూ. 29 చొప్పున పెంచుతూ జూన్ 7 ప్రకటన చేసింది. మరి 14.2 కేజీల ధర తగ్గిస్తారా? లేదా అన్నదానిపై సామాన్యుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇరాన్ యుద్ధం సమయంలో 5 కేజీ గ్యాస్ సిలిండర్‌కు డిమాండ్ అమాంతంగా పెరిగింది. జూన్ నెలలో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.11 పెంచాయి కంపెనీలు. ఈ నెలలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.11 పెరిగింది. మే లో రూ.261, ఏప్రిల్ 2026లో రూ.51 పెంచాయి గ్యాస్ కంపెనీలు. ఈ క్రమంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వరుసగా ధరలు పెరిగాయి. ఇవి కూడా తగ్గు ముఖం పట్టవచ్చని సామాన్యుడు భావిస్తున్నాడు.
ALSO READ: పెళ్లి వద్దని చెప్పడం కంటే.. హత్య చేయడమే తేలిక.. విచారణలో సియా గోయల్ వెల్లడి
పశ్చిమాసియా సంక్షోభానికి ముందు గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది కేంద్రం. సంక్షోభం ప్రారంభంలో నిలిపివేసిన బల్క్ ఎల్‌పిజి సరఫరాను రీసెంట్‌గా 50 శాతం సడలించింది. దీంతో వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు బిగ్ రిలీఫ్ లభించింది. ఎల్‌పిజి సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, పారిశ్రమలకు సాధారణ కేటాయింపులు మొదలయ్యాయి.
ఎల్‌పిజి వినియోగదారులు తమ పిఎన్‌జి కనెక్షన్లు పొందిన 30 రోజుల్లోపు ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసుకోవడం తప్పనిసరి చేసింది. ఒకే సమయంలో రెండు కనెక్షన్‌లను కలిగి ఉండటానికి వీలులేదని తేల్చిచెప్పింది కేంద్రం. కొత్త నిబంధనల ప్రకారం ఇది నిషేధించబడింది.
ఇండేన్, హెచ్‌పి, భారత్ గ్యాస్ పంపిణీదారులకు సరెండర్ లేదా క్లోజింగ్ అభ్యర్థనను సమర్పించాలి. ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే భవిష్యత్తులో సిలిండర్ రీఫిల్‌ను నివారించడానికి ఎల్‌పిజి ఖాతా బ్లాక్ చేయబడుతుంది. PNG పైప్‌లైన్‌లు పూర్తిగా వేసిన ప్రాంతాల్లో LPG సిలిండర్లనే వాడాలని నిర్ణయించుకున్న వారికి 90 రోజుల కాలపరిమితి వర్తిస్తుంది.
ఎల్పీజీ రీఫిల్లింగ్ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లాక్-ఇన్ పీరియడ్‌ని విధించింది. పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు ఉంది. వీటిని సవరిస్తారని సామాన్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతకుముందు ఈ వ్యవధి 21 రోజులు ఉండేది. గ్యాస్ వినియోగదారులకు జూన్ 30 లోపు తమ e-KYCని పూర్తి చేసుకోవాలి. గడువులోపు పూర్తి చేయని పక్షంలో ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ సబ్సిడీని నిలిపి వేయడం తప్పనిసరి చేసింది. ఇదివరకు e- KYC చేసి ఉంటే LPG బయో మెట్రిక్ ఆధార్ ధృవీకరణ చేయవలసిన అవసరం లేదు. లేని పక్షంలో e-KYC తప్పనిసరి చేయించుకోవాలి.