E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోనా లేక ట్యాబ్లెటా? 7.5 ఇంచుల స్క్రీన్‌తో వచ్చిన Nubia Neo 5 Max.. బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

స్మార్ట్‌ఫోనా లేక ట్యాబ్లెటా? 7.5 ఇంచుల స్క్రీన్‌తో వచ్చిన Nubia Neo 5 Max.. బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?
Advertisement

Nubia Neo 5 Max: మొబైల్‌లో ఎక్కువగా గేమ్స్ ఆడేవారికి, సినిమాలు తరచూ చూసేవారి కోసం ప్రముఖ నుబియా సంస్థ ట్యాబ్లెట్‌ను తలపించేలా ఒక భారీ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లోకి తీసుకొచ్చింది. Nubia Neo 5 Max పేరుతో వచ్చిన ఈ ఫోన్ ఆధునిక స్మార్ట్‌ఫోన్లన్నింటిలోకి అత్యంత పెద్ద స్క్రీన్ కలిగినది కావడం విశేషం. ముఖ్యంగా గేమర్స్, మల్టీమీడియా ప్రియులను దృష్టిలో పెట్టుకుని కంపెనీ దీనిని రూపొందించింది.

మంచి థ్రిల్ ఇచ్చే బిగ్ స్క్రీన్:

ఈ Nubia Neo 5 Maxలో ఏకంగా 7.5 ఇంచుల భారీ ఎల్‌సీడీ (LCD) డిస్‌ప్లేను అందించారు. ఇది 1.5K రెజ్యూలేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇంత పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల గేమ్స్ ఆడుతున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు యూజర్లకు సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.

అద్భుతమైన గేమింగ్ ఫీచర్లు:

Advertisement

నుబియా నియో 5 మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది మిడ్‌రేంజ్ చిప్‌సెట్ అయినప్పటికీ.. గేమింగ్‌ను చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేయగలదు. గేమర్స్ కోసం ప్రత్యేకంగా దీనిలో షోల్డర్ ట్రిగర్లను కూడా అమర్చారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.

Also Read: గోల్డెన్ ఛాన్స్ భయ్యా.. ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై మతిపోయే డిస్కౌంట్స్.. సేల్ ఎప్పటి నుంచో తెలుసా?

పవర్‌ఫుల్ బ్యాటరీ:

Advertisement

పెద్ద స్క్రీన్ ఉన్నప్పుడు ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇందులో ఏకంగా 7000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది వేగంగా ఛార్జ్ కావడానికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే పవర్‌ఫుల్ బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.

మొబైల్ గేమర్లే టార్గెట్:

షాంఘైలో జరిగిన MWC 2026 ఈవెంట్‌లో నుబియా ఈ ఫోన్‌ను ప్రదర్శించింది. అయితే దీని ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ఫోన్‌ను చైనా మార్కెట్లో కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల మార్కెట్లలో విడుదల చేయడానికి నుబియా ప్లాన్ చేస్తోంది. యువతను, ముఖ్యంగా మొబైల్ గేమర్లను ఈ ఫోన్ బాగా ఆకట్టుకోనుంది.

Also Read: 6000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో సరికొత్త 5G ఫోన్.. ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×