E-Paper
Advertisement

లవర్స్ ను రిస్క్ లో పడేసే కరువు రక్కసి… కడుపుబ్బా నవ్వించే యోగి బాబు కొత్త సిరీస్

లవర్స్ ను రిస్క్ లో పడేసే కరువు రక్కసి… కడుపుబ్బా నవ్వించే యోగి బాబు కొత్త సిరీస్
Advertisement

Comedy Movie: ఈ వీకెండ్ ఒక మంచు ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ను చూడాలని అనుకుంటున్నారా ? ఇంట్లో కూర్చునే మనసారా నవ్వుకోవాలి అనుకుంటున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. తమిళ ప్రముఖ కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ సెటైరికల్ కామెడీ సినిమా ‘కెనతా కనోమ్’. తమిళ సినిమాల్లో యోగి బాబు కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక గ్రామీణ నేపథ్యంలో నీటి సమస్య, రాజకీయాలు, ప్రేమ, డైనోసార్ ఫాసిల్ వంటి ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌తో నిండిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఆలోచింపజేస్తుంది. మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? తెలుగులో అందుబాటులో ఉందా లేదా ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో కథ సాగుతుంది. ఆ ఊళ్ళో తీవ్రమైన కరవు, తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతారు. ఆ ఊరి గుడి పూజారి మణివాసగర్ (యోగి బాబు) మన హీరో. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి తండ్రి మాత్రం పెళ్ళికి ఒప్పుకోడు. చివరికి తన కూతురుకు కూడా ఇష్టమని తెలుసుకుని పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ ఒక విచిత్రమైన కండీషన్ పెడతాడు. ఊరిలో నీటి సమస్యను తీర్చితేనే పెళ్లి చేస్తానని అంటాడు. తన ప్రేమ కోసం, ఊరి ప్రజల కోసం మణివాసగర్ వాటర్ డివైనర్ సహాయంతో తన ఇంటి ముందే బావి తవ్వడం మొదలుపెడతాడు.

Advertisement

కానీ భూమిలో నీరు పడటానికి బదులుగా… 66 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ అస్థిపంజరం బయట పడుతుంది. ఈ విషయం బయటకు తెలియడంతో ఊరంతా రచ్చ అవుతుంది. సైంటిస్టులు, మీడియా, ప్రభుత్వ అధికారులు, పోలీసులు… అందరూ ఆ అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ, చట్టాలు… అన్నీ ఆ ఊరి సాధారణ జీవితాన్ని తలక్రిందులు చేస్తాయి. మణివాసగర్ తన ప్రేమను దక్కించుకున్నాడా ? ఊరి నీటి సమస్య తీరిందా లేదా ? డైనోసార్ అస్థిపంజరం అతన్ని ఎలాంటి సమస్యల్లో పడేసింది ? చివరికి ఆ ఊరి ప్రజల సమస్యలు తీరాయా ? అనేది ఈ మూవీ స్టోరీ. యోగి బాబు సహజమైన కామెడీ టైమింగ్, గ్రామీణ సమస్యలు, డైనోసార్ ట్విస్ట్‌తో ఈ మూవీ కొత్త ఫీల్ ఇస్తుంది. అలాగే ఇది సురేష్ సంగయ్య చివరి చిత్రం కావడం ఈ మూవీ ప్రత్యేకత. ‘కెనతా కనోమ్’ ప్రస్తుతం JioHotstarలో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియోలో కూడా చూడవచ్చు. తెలుగులో మాత్రమే కాదు తమిళ, కన్నడ, మలయాళం… ఇలా మొత్తం ఏడు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కావాల్సిన భాషలో ఈ మూవీని సరదాగా ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి.

Read Also : రీసార్ట్ లో రేవ్ పార్టీలు… అమ్మాయి మిస్సింగ్ తో అడ్డంగా బుక్కయ్యే ధనవంతులు

Related News

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

ఓటీటీలోకి మమిత బైజు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

17 ఏళ్ల తర్వాత కిల్లర్ కి విడుదల… అమాయకులను ఇరికించే లాయర్లను వేటాడే కిల్లర్… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

మనుషుల్ని వేటాడే కోటీశ్వరులు… వేటలో చిక్కుకున్న అమ్మాయే వేటగాళ్లను వేటాడితే ? బ్లడీ సర్వైవల్ థ్రిల్లర్

బిగ్ బాస్ తరహాలో మరో రియాలిటీ షో.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

Big Stories

Advertisement
×