Best Mobiles Under 50K : ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి గత కొన్నాళ్లుగా టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ ఎన్నో వచ్చేసాయి. వీటిలో అదిరిపోయే ఫీచర్స్ తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇందులో యాపిల్, samsung, ఐక్యూ వంటి టాప్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మరి వీటిలో బెస్ట్ మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ లిస్ట్ పై ఓ లుక్కేసేయండి.
2024లో టాప్ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ బెస్ట్ ఫీచర్ మొబైల్స్ ను లాంఛ్ చేశాయి. ఈ ప్రీమియం మొబైల్స్ లో లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు అదిరే అప్డేట్స్ సైతం ఉన్నాయి. ఇక వీటి ధర సైతం అందుబాటులోనే ఉంది. ముఖ్యంగా ఈ సిరీస్ లో వన్ ప్లస్ 12R, ఐక్యూ 12 5G, గ్జియోమీ 14, యాపిల్ ఐఫోన్ 13 టాప్ లిస్టులో ఉన్నాయి. ఇక రూ. 50 వేలలోపే బెస్ట్ మొబైల్స్ కొనాలనుకుంటే వీటని కచ్చితంగా ట్రై చేసేయండి.
OnePlus 12R –
6.7 అంగుళాల Fluid AMOLED 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ తో పనిచేసే డిస్ ప్లే. Qualcomm Snapdragon 8 Gen 3 చిప్‌సెట్, 50MP Sony IMX890 సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 5000mAh, 100W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్, 12GB RAM + 256GB/512GB UFS 4.0 స్టోరేజ్, OxygenOS 14, 5G, Wi-Fi 6, Bluetooth 5.3, USB Type-C పోర్టల్ అందుబాటులో ఉన్నాయి.
iQOO 12 5G –
రూ. 50,000లోపు బెస్ట్ మెుబైల్ కొనాలనుకుంటే iQOO 12 5G బెస్ట్ ఛాయిస్. దీని ధర 12GB RAM+256GB స్టోరేజ్ కోసం రూ.45,999. ఇది Android 14 ఆధారంగా Funtouch OS 14పై నడుస్తుంది. LPDRR5X RAM & UFS 4.0 స్టోరేజ్‌తో 3.3 GHz స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డిస్ప్లే 3000 nit పీక్ బ్రైట్‌నెస్, 2160Hz PWMతో 6.78″ 144 Hz LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
Xiaomi 14 –
Xiaomi 14 స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 49,999. ఇది 3000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.36 అంగుళాల 1.5K 120Hz LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Xiaomi HyperOS అవుట్ ఆఫ్ బాక్స్‌లో నడుస్తుంది. Snapdragon 8 Gen 3, 4nm ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ LPDDR5X RAMతో జత చేయబడింది.
Apple iPhone 13 –
టెక్ దిగ్గజం యాపిల్ తన ఫ్లాట్ఫామ్ లో ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ ను నిలిపివేసింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఈ మొబైల్ అందుబాటులో ఉంది. ఇక అమెజాన్లో 128gb వేరియంట్ ధర రూ. 43,499కే అందుబాటులో ఉంది. ఇది 15 సెం.మీ (6.1-అంగుళాల) సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో పాటు సినిమాటిక్ మోడ్, 12MP వైడ్, అల్ట్రా వైడ్ కెమెరాలతో డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇది A15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది.
సో హై ఎండ్ మొబైల్స్ ను రూ. 50,000లోపే కొనాలనుకునే యూజర్స్ కు ఈ నాలుగు మొబైల్స్ బెస్ట్ ఛాయిస్. మరి ఇంకెందుకు ఆలస్యం కొనాలనుకుంటే మీరు ట్రై చేసేయండి.
ALSO READ : వాట్సాప్ లో టాప్ ఫీచర్స్ ఎన్నో!