బంగారం అత్యంత విలువైన లోహం. భారతీయులు బంగారాన్ని ఎంతగా ఇష్టపడుతారో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆభరణాలుగా ఉపయోగించడంతో పాటు సంపద, శక్తికి చిహ్నంగా భావిస్తారు. డిజిటల్ చెల్లింపులు, క్రిప్టోకరెన్సీ యుగంలోనూ బంగారానికి ఎంతో విలువ ఉంది. ఇక తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన డేటా ప్రకారం ఎనిమిది దేశాల దగ్గర పెద్దమొత్తంలో బంగారు నిల్వలు ఉన్నాయి. ఇంతకీ ఆదేశాలు ఏవంటే..
ప్రస్తుతం అమెరికా దగ్గర బంగారు నిల్వలు 8,133.46 టన్నులుగా ఉన్నాయి. 2000 నుండి 2025 వరకు, అమెరికా బంగారు నిల్వలు సగటున 8,134.78 టన్నులుగా ఉన్నాయి. 2001 మూడవ త్రైమాసికంలో ఈ నిల్వలు 8,149.05 టన్నుల గరిష్ట స్థాయికి చేరుకోగా, 2005 మూడవ త్రైమాసికంలో అత్యల్పంగా 8,133.46 టన్నులుగా నమోదయ్యాయి. ప్రభుత్వ బంగారు నిల్వల పరంగా అమెరికా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.
ప్రస్తుతం జర్మనీ దగ్గర 3,350.25 టన్నుల బంగారం ఉంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 3,351.28 టన్నులు ఉండగా, ఇప్పుడు కాస్త తగ్గింది. జర్మనీ నిల్వలు 2000 మరియు 2025 మధ్య సగటున 3,398.28 టన్నులుగా ఉన్నాయి. 2000 రెండవ త్రైమాసికంలో 3,468.60 టన్నుల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కువ బంగారం ఉన్న దేశాల్లో జర్మనీ రెండో స్థానంలో ఉంది.
ఇటలీ తన బంగారు నిల్వలను స్థిరంగా ఉంచుతుంది. ఈ ఏడాది 2,451.84 టన్నులుగా ఉంది. 2000 నుంచి 2025 వరకు ఇటలీ సగటు నిల్వలు 2,451.84 టన్నులుగా ఉన్నాయి. 2000 రెండవ త్రైమాసికంలో 2,451.84 టన్నులు ఉండగా, 2023 మొదటి త్రైమాసికంలోనూ 2,451.84 టన్నులుగానే ఉంది. ఎక్కువ బంగారం ఉన్న మూడో దేశంగా కొనసాగుతుంది.
ఫ్రాన్స్ దగ్గర ప్రస్తుతం బంగారం నిల్వలు 2,437 టన్నులు ఉన్నాయి. 2012లో దేశ నిల్వలు 2,435.38 టన్నులకు పడిపోయాయి. 2002లో 3,000 టన్నులను అధిగమించాయి.
రష్యాలో బంగారు నిల్వలు 2,329.63 టన్నులుగా ఉన్నాయి. 2024 రెండవ త్రైమాసికంలో 2,335.85 టన్నుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 2000 రెండవ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 343.41 టన్నులకు చేరుకున్నాయి.
Read Also: EPFO కీలక నిర్ణయం, ఒకే క్లిక్ తో పీఎఫ్ సెటిల్మెంట్!
చైనాలో బంగారం నిల్వలలో దాదాపు 2,279.6 టన్నులు ఉన్నాయి.
చిన్న దేశం అయినా స్విట్జర్లాండ్ దగ్గర దాదాపు 1,040 టన్నుల బంగారు నిల్వలను కలిగి ఉంది. ఎక్కువ బంగారం ఉన్న దేశాల లిస్టులో ఏడవ స్థానంలో ఉంది.
మన దగ్గర బంగారం నిల్వలు 880 టన్నులకు చేరుకున్నాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 879.60 టన్నులతో ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి.
Read Also: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!