TGPSC Group 2: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో విడత గ్రూప్-2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి 24 వరకు గ్రూప్ 2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ తేదీల్లో ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు. సర్టిఫికెట్లలో ఏమైనా సమస్యలుంటే సెప్టెంబర్ 25న రిజర్వ్ డే ఉంటుందని టీజీపీఎస్సీ తెలిపింది.
అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌లో (https://www.tgpsc.gov.in) అందుబాటులో ఉన్న వెరిఫికేషన్ మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌లో ఈ నెల 22 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్‌లను ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్‌లను ఉపయోగించాలని టీజీపీఎస్సీ తెలిపింది. ఈ వెబ్ ఆప్షన్‌లను తుది ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకుంటారు. నిర్ణీత తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థులలో ఎవరైనా హాజరుకాకపోతే, వారి అభ్యర్థిత్వం తదుపరి ప్రక్రియ కోసం పరిగణించారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Also Read: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు