Realme Mobiles Under 15000 : ఎప్పటికప్పుడు అతి తక్కువ ధరలోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ను లాంఛ్ చేస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ… ఇప్పటికే లో బడ్జెట్ లో బెస్ట్ ఫోన్స్ ను తీసుకొచ్చింది. ఈ మెుబైల్స్ ధరతో పాటు ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. మరి అతి తక్కువ ధరలోనే దొరకే టాప్ మెుబైల్స్ పై ఓ లుక్కేయండి.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ.. అతి తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ స్మార్ట్ ఫోన్స్ ను తీసుకువచ్చింది. ఈ మొబైల్స్ లో ప్రాసెసర్, డిస్ ప్లే, కెమెరా ఫీచర్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. బ్యాటరీ సదుపాయం సైతం హై క్వాలిటీతో వచ్చేసింది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీని హై స్టోరేజ్ తో రూ. 15 వేలలోపే రియల్ మీ అందిస్తుంది. ఇక ఈ జాబితాలో టాప్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే.
1. Realme Narzo 70 5G – రియల్ మీ నార్జో 70 5G.. రియల్ మీ లాంఛ్ చేసిన ఈ మెుబైల్ డైమెన్సిటీ 7050 5G చిప్ సెట్ తో వస్తుంది. 6.67 అంగుళాల డిస్ ప్లే, 50MP మెయిన్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో వచ్చేసింది. ఇక 5000mah బ్యాటరీ సదుపాయం కలదు. తక్కువ ధరలోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
2. Realme 13 5G – రియల్ మీ 13 5G… ఈ మెుబైల్ 6300 5G చిప్ సెట్, 6.73 అంగుళాల డిస్ ప్లేతో లాంఛ్ అయింది. ఇక 50MP మెయిన్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో వచ్చేసింది. ఇందులో 5000mah బ్యాటరీ సదుపాయం కలదు.
3. Realme Narzo N65 5G – రియల్ మీ నార్జో N65 5G… ఈ మెుబైల్ 6300 5G చిప్ సెట్ ప్రాసెసర్, 5000mah బ్యాటరీతో లాంఛ్ అయింది. ఇక 50MP మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో వచ్చేసింది. ధర రూ. 11,498
4. Realme Narzo 70x 5G – రియల్ మీ నార్జో 70X 5G.. రియల్ మీ లాంఛ్ చేసిన ఈ మెుబైల్ 6.72 అంగుళాల డిస్ ప్లేతో వచ్చేసింది. ఇక ఇందులో 6100 + 5G చిప్ సెట్ ప్రాసెసర్, 5000mah బ్యాటరీ సదుపాయం కలదు. ఇక 50MP మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో వచ్చేసింది. ధర రూ. 12,544
5. Realme Narzo 60x 5G – రియల్ మీ నార్జో 60X 5G.. ఈ మెుబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + 5G చిప్ సెట్ తో వచ్చేసింది. ఇక 6.72 అంగుళాల డిస్ ప్లే, 5000mah బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో లాంఛ్ అయింది. ధర రూ.14,990
మరి ఇంకెందుకు ఆలస్యం రూ. 15వేలలోపే అదిరే ఫీచర్స్ తో వచ్చేసిన బెస్ట్ రియల్ మీ స్మార్ట్ ఫోన్స్ ఇవే. ఎప్పటినుంచో తక్కువ ధరలోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకునే కస్టమర్స్ కు ఇవి బెస్ట్ ఆప్షన్. ట్రై చేసేయండి.
ALSO READ : బక్క చిక్కిపోయిన సునితా విలియమ్స్.. ఆరోగ్యం విషమిస్తుందా? నాసా కీలక ప్రకటన!