భారత సంతతికి చెందిన వ్యోమగామి సునితా విలియమ్స్ ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సునితా విలియమ్స్ బుచ్ విల్మోర్ తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లగా అక్కడే చిక్కుపోయారు. 8 రోజుల పర్యటన కోసం వెళ్లిన వీరు దాదాపు 5 నెలలు గడిచినా తిరిగి రాలేదు. సాంకేతిక కారణాల వల్ల సునితా విలియమ్స్ వెళ్లిన అంతరిక్ష నౌకను తిరిగి భూమి మీదకు పంపించారు. అయితే తాజాగా సునితా విలియమ్స్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోలో ఆమె చాలా సన్నగా కనిపిస్తున్నారు.
Also read: జగన్ నిర్ణయం.. వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?
అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఫోటోలో కేవలం చర్మం, ఎముకలు మాత్రమే కనిపిస్తుండటంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యంగా ఈ మిషన్ లో భాగస్వామిగా ఉన్న నాసా ఉద్యోగి ఒకరు స్పందించారు. సునితా విలియమ్స్ చాలా సన్నగా అయ్యిందని చెప్పారు. ఆమె శరీరంలో మాంసం కరిగిపోయి కేవలం చర్మం, ఎముకలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె సన్నగా అయ్యారు కాబట్టి ముందు బరువు పెరగడంపై దృష్టి పెట్టాలన్నారు. తిరిగి బరువు పెరిగేందుకు ఆమెకు సాయం చేస్తామని చెప్పారు.
ఇదిలా ఉంటే వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు జీవక్రియలో మార్పుల కారణంగా భూమిపై ఉన్నవారి కంటే రెండు రెట్లు ఎక్కువ కేలరీలు తినవలసి ఉంటుంది. ప్రతిరోజు 3,500 నుండి 4,000 కేలరీల ఆహారం తీసుకోవాలి. కానీ తినడం తగ్గిపోతే బరువు వేగంగా తగ్గిపోతారు. అంతే కాకుండా వీరు ఎక్కువ కాలం నిలువ ఉండేలా ఎండబెట్టిన చేపలు, చికెన్ లను ఆహారంగా తీసుకుంటారు. అదే విధంగా డ్రై ఫ్రూట్స్ మరియు బిస్కెట్లను కూడా వారి వెంట తీసుకువెళతారు. వీటితో పాటు ట్యాబ్లెట్ల రూపంలో శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చేవి, విటమిన్స్ తీసుకుంటారు.