Sai Kiran Engagement: స్టార్ నటుడు సాయికిరణ్ (Sai Kiran)ఒకప్పుడు ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, మంచి పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా “అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది”.. అనే పాటతో ఆ క్రేజ్ ను రెట్టింపు చేసుకున్నారు అని చెప్పవచ్చు. ఇక తర్వాత ప్రేమించి చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సాయికిరణ్ మళ్లీ ఎందుకో హీరోగా నటించలేదు కానీ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
నిశ్చితార్థం చేసుకున్న హీరో సాయికిరణ్..
అయితే మరోవైపు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన సాయికిరణ్ పడమటి సంధ్యారాగం, కోయిలమ్మ వంటి సీరియల్స్ లో నటించి ఇప్పుడు గుప్పెడెంత మనసు సీరియల్ తో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. ఇందులో హీరో రిషికి తండ్రిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయికిరణ్ , సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈయన ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ ఫోటోలు షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సీరియల్ నటితో నిశ్చితార్థం..
కోయిలమ్మ సీరియల్ లో నటించిన స్రవంతితో ఈయన నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ కూడా పెట్టారు. అలాగే ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇకపోతే ఈ ఫోటోలు చూసిన కొంత మంది నెటిజన్స్ కంగ్రాట్స్ చెబుతుంటే.. ఇంకొంతమంది ఈ పరిణామం మేము అసలు ఊహించడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇక నిశ్చితార్థం చేసుకుని త్వరలో ఒక ఇంటి వారు కాబోతున్నారు సాయికిరణ్. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
ఆధ్యాత్మిక సీరియల్స్ లో కూడా..
సాయికిరణ్ విషయానికి వస్తే.. తెలుగు నటుడిగా పేరు దక్కించుకున్న ఈయన.. ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడైన రామకృష్ణ కుమారుడు. ఈటీవీలో ప్రసారమైన శివ లీలలు అనే సీరియల్ లో విష్ణువు గా కనిపించి , మరికొన్ని ఆధ్యాత్మిక సీరియల్స్ లో కృష్ణుడిగా, వెంకటేశ్వరుడిగా కూడా ఆకట్టుకున్నారు. నటుడు గానే కాకుండా హైదరాబాద్ బ్లూ క్రాస్ సంస్థలో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంతే కాదు కొన్ని ఆధ్యాత్మిక సంస్థలలో సభ్యుడు కూడా శివుడి పై శ్రీవత్సన్ అనే ఆల్బమ్స్ కూడా సాయికిరణ్ రూపొందించారు.
సాయి కిరణ్ నటించిన చిత్రాలు..
ఇక సాయికిరణ్ నటించిన చిత్రాల విషయానికొస్తే.. నువ్వే కావాలి , ప్రేమించు , మనసుంటే చాలు, సత్తా, డార్లింగ్ డార్లింగ్, రావే నా చెలియా, హైటెక్ స్టూడెంట్స్, వెంగమాంబ, ఇంకా అంతా శుభమే పెళ్లి జరిపించండి, దేవీ అభయం, జగపతి, ఉత్సాహం, మనసా, బుల్లెబ్బాయి ఇలా ఎన్నో చిత్రాలలో నటించి ఈయన .. 2014లో చివరిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్రలో కనిపించి, ఆ తర్వాత సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టారు. 46 సంవత్సరాల వయసులో ఇప్పుడు వివాహానికి సిద్ధం అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.