E-Paper
Advertisement

రూ.20 వేల నుంచే బెస్ట్ పర్ఫార్మెన్స్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో టాప్-5 శాంసంగ్ ఫోన్లు ఇవే!

రూ.20 వేల నుంచే బెస్ట్ పర్ఫార్మెన్స్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో టాప్-5 శాంసంగ్ ఫోన్లు ఇవే!
Advertisement

Best Mid Range Smartphones: కొత్త శాంసంగ్ ఫోన్ కొనేటప్పుడు చాలామందికి వచ్చే మొదటి డౌట్.. ఇందులో ఏ ప్రాసెసర్ ఉంది అని. ఎందుకంటే.. శాంసంగ్ తమ మిడ్-రేంజ్ ఫోన్లలో సొంత ఎక్సినోస్ చిప్‌తో పాటు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లను కూడా వాడుతుంటుంది. ముఖ్యంగా గేమింగ్ బాగా ఆడేవాళ్లు, ఫోన్ వేడెక్కకుండా స్మూత్‌గా పనిచేయాలనుకునే వాళ్లు కచ్చితంగా స్నాప్‌డ్రాగన్ చిప్ ఉన్న ఫోన్లనే ఎంచుకుంటారు. మరి మన ఇండియన్ మార్కెట్లో రూ.19,999 నుంచి రూ.49,999 బడ్జెట్‌లో మంచి స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో దొరికే టాప్-5 శాంసంగ్ ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దామా..

Samsung Galaxy S24 (Snapdragon)

ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కావాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం రూ.49,999 ధరలో దొరుకుతున్న ఈ ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. 6.2 ఇంచుల కాంపాక్ట్ అమోలెడ్ డిస్‌ప్లే, 3x జూమ్‌తో కూడిన 50MP ట్రిపుల్ కెమెరా, IP68 వాటర్ రెసిస్టెన్స్ దీని ప్రత్యేకతలు. అయితే 4,000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ కాస్త తక్కువ అనిపించినా.. 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ దీనికి పెద్ద ప్లస్ పాయింట్.

Samsung Galaxy A36

Advertisement

వర్షంలో తడిచినా, నీళ్లలో పడినా ఏం కాకూడదు అనుకునే వాళ్లకు రూ.32,999 ధరలో ఉన్న గెలాక్సీ A36 బాగా సెట్ అవుతుంది. దీనికి IP67 రేటింగ్ ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌తో పాటు 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. వెనుక 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. దీనికి కూడా 6 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ వస్తాయి.

Samsung Galaxy M47

రోజంతా ఫోన్ ఎక్కువగా వాడేవాళ్లకు, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదు అనుకునే వాళ్లకు ఇది సూపర్ ఛాయిస్. రూ.25,999 ధరలో వచ్చే ఈ ఫోన్‌లో ఏకంగా 6,000mAh భారీ బ్యాటరీ, 45W ఛార్జింగ్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ వల్ల గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. దీనికి కూడా 6 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్ లభిస్తాయి.

Advertisement

Also Read: 2027లో యాపిల్ సంచలనం.. ఒకేసారి మార్కెట్లోకి రాబోతున్న 6 కొత్త గాడ్జెట్స్ ఇవే!

Samsung Galaxy A27

రూ.28,999 బడ్జెట్‌లో మంచి స్క్రీన్, స్టీరియో స్పీకర్లు కావాలనుకుంటే గెలాక్సీ A27 చూడొచ్చు. ఇందులో కూడా స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసరే ఉంది. 1,900 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, తెలుగు కాకుండా హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ భాషల్లో లైవ్ కాల్ ట్రాన్స్‌క్రిప్షన్ వంటి ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కాకపోతే ఛార్జింగ్ స్పీడ్ 25W మాత్రమే.

Samsung Galaxy M55s

తక్కువ బడ్జెట్‌లో మంచి సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కావాలంటే రూ.19,999 ధరలో ఉన్న M55s బెస్ట్. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్, 45W ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. దీని అసలు హైలైట్ ముందున్న 50MP సెల్ఫీ కెమెరా. దీనితో 4K వీడియోలు కూడా తీసుకోవచ్చు. పాత మోడల్ కావడం వల్ల దీనికి 4 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్ మాత్రమే వస్తాయి.

Also Read: హోటల్‌లో అడుగుపెట్టగానే ఈ పని చేయండి.. సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది!

Tags

Related News

2027లో యాపిల్ సంచలనం.. ఒకేసారి మార్కెట్లోకి రాబోతున్న 6 కొత్త గాడ్జెట్స్ ఇవే!

భూమికి కవల గ్రహం.. శుక్రుడిపై ఒక రోజు గడిపారో.. మీకు కనిపించే వింతలు ఇవే!

హోటల్‌లో అడుగుపెట్టగానే ఈ పని చేయండి.. సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది!

5G ఫోన్ వాడుతున్నా ఇంకా 4G సిగ్నలే వస్తోందా? ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఏంటీ.. అగ్నిపర్వత విస్ఫోటనాలు.. భూమిని కూల్‌గా ఉంచుతున్నాయా? ఎలాగో తెలిస్తే థ్రిల్ పక్కా!

గతేడాది 70 వేలు.. ఈసారి 54 లక్షలు! భారత్‌లో మెటా ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఇదే!

ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. యాపిల్, శాంసంగ్ ఫోన్లపై రూ.46,000 వరకు తగ్గింపు.. బ్లాక్ ఫ్రైడే సేల్ టాప్-10 డీల్స్ ఇవే!

Big Stories

Advertisement
×