BigTV English

Smart TV: రూ.30,000లో మంచి స్మార్ట్‌టీవీ కావాలా.. ఇదిగో లిస్ట్

Smart TV: రూ.30,000లో మంచి స్మార్ట్‌టీవీ కావాలా.. ఇదిగో లిస్ట్


Smart TV under Rs.30,000: బడ్జెట్ ధరలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే టీవీలను కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇక్కడ కొన్ని టీవీలు అందుబాటులో ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీ, గ్రేట్ డిజైన్‌తో సహా మరిన్ని అద్భుతమైన అనుభూతిని కలిగించే రూ.30వేలలోపు గల కొన్ని టీవీలను ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung 32-inch HD Ready LED Smart TV:


శాంసంగ్ కంపెనీకి చెందిన 32 ఇంచుల హెచ్ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ పర్‌కలర్ (PurColor)ని తక్కువ ధరకే కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్లొచ్చు. ఇది అద్భుతమైన డిస్‌ప్లేతో మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ ఎల్ఈడీ టీవీ పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీని ధర రూ.13,490గా ఉంది.

LG 32 inches HD Ready Smart LED TV: ఎల్‌జీ టీవీలకి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీకి చెందిన ఎలాంటి వస్తువు అయినా వినియోగాదారులను ఆకర్షిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కంపెనీకి చెందిన స్మార్ట్‌టీవీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మంచి క్వాలిటీతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించి వీక్షకులను ఆకట్టుకుంటోంది.

అంతేకాకుండా ఈ కంపెనీ టీవీలు డైనమిక్ కలర్, కాంట్రస్ట్‌ని ఉత్పత్తిచేస్తుంది. ఇందులో ఎల్‌జీ టీవీలను తక్కువ ధరకే కొనుక్కోవాలనుకుంటే ‘ఎల్‌జీ 32 ఇంచెస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ’ అందుబాటులో ఉంది. ఇది దాని సౌండింగ్‌తో వీక్షకులను ఉర్రూతలూగిస్తుంది. దీని ధర రూ.19,999గా ఉంది.

READ MORE: 6/128జీబీ వేరియంట్.. రూ.6 వేలకే..

Mi TV 5A 40-inch Android Smart LED TV:

Mi టీవీలకు కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇందులో ‘ఎంఐ టీవీ 5ఏ 40 ఇంచెస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ’ మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది 1920 x 1080 రిజల్యూషన్‌తో పూర్తి హెచ్‌డీ టీవీగా 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటుతో వచ్చింది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై, 2హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్ట్‌లు, బ్లూటూత్ 5.0, ఈథర్‌నెట్ వంటి ఫీచర్లతో సహా డాల్బీ ఆడియోతో 24 వాట్స్ అవుట్ పుట్ అందిస్తుంది.

1.5GB ర్యామ్ + 8GB స్టోరేజ్, ఆండ్రాయిడ్ టీవీ 11 ప్యాచ్‌వాల్, యూనివర్సల్ సెర్చ్, ఐఎండీబీ ఇంటిగ్రేషన్, 300కి పైగా ఫ్రీ లైవ్ ఛానల్స్, లాంగ్వేజ్ యూనివర్స్, ప్లేస్టోర్ నుండి 5000+ యాప్‌లు, క్వాడ్ కోర్ కార్టెక్స్ A55, ఓకే గూగుల్, క్రోమ్‌కాస్ట్ సపోర్టింగ్ యాప్‌లు, క్రోమ్‌కాస్ట్ ఇన్‌బిల్ట్ వంటి ఫీచర్లను కలిగివుంది. దీని ధర రూ.21,999.

Redmi 43-inches 4K Ultra HD Android Smart LEDTV:

రెడ్‌మీ 43 ఇంచుల 4K అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ మంచి పెర్ఫార్మన్స్ అందిస్తుంది. 4కె రెజుల్యూషన్‌ కలిగిన ఈ స్మార్ట్‌ టీవీ రూ.23,999గా ఉంది. ఇది భారీ 30 వాట్స్ స్పీకర్లను కలిగి ఉంది. దీని ద్వారా అదిరిపోయే సౌండ్‌‌ను అందిస్తుంది.

READ MORE: చౌక ధరలో కూలర్ కొనేయండి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు

OnePlus 43-inches Y Series 4K Ultra HD Smart Android LEDTV:

వన్‌ప్లస్ కంపెనీ ఓ వైపు స్మార్ట్‌ఫోన్లతో మరోవైపు స్మార్ట్‌టీవీలతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుంది. అయితే ఈ కంపెనీకి చెందిన స్మార్ట్‌టీవీలకి మంచి ఆదరణ లభిస్తోంది. కాగా వన్‌ప్లస్ 43 ఇంచెస్ వై సిరీస్ 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్‌ఈడీ టీవీలో సినిమాలు చూసే వీక్షకులకి మంచి అనుభూతి కలిగుతుంది.

ఈ స్మార్ట్ టీవీ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లతో వస్తుంది. అంతేకాకుండా వన్‌ప్లస్ కనెక్ట్ ఎకోసిస్టమ్, క్రోమ్‌కాస్ట్, మీరాకాస్ట్, డిఎల్‌ఎన్‌ఏ‌తో పాటు ఓటీటీ వంటి యాప్‌లను కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.26,999గా ఉంది.

Sony Bravia 32-inches HD Ready Smart LEDTV:

ప్రముఖ సోనీ బ్రాండ్ కంపెనీ నుంచి స్మార్ట్ టీవీని కొనాలని ప్లాన్ చేస్తుంటే.. సోనీ బ్రవియ్ 32 ఇంచుల హెచ్‌డీ రెడీ స్మార్ట్‌ఎల్‌ఈ టీవీ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌టీవీ తన సౌండింగ్‌తో అందరినీ ఆకర్షిస్తుంది. ఇందులో క్రోమ్‌కాస్ట్ ఇన్‌బిల్ట్‌గా ఉంది. కాగా ఇందులోని మోషన్‌ఫ్లో ఎక్స్‌ఆర్ ఫీచర్ కారణంగా ఇది భారతదేశంలోనే అత్యుత్తమ టీవీగా నిలిచింది. దీని ధర రూ.25,890.

READ MORE: 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్.. 8/256 జీబీ వేరియం‌ట్‌ రూ.8,999కే..

Xiaomi X Series 43-inch Android LEDTV:

షియోమి ఎక్స్ సిరీస్ అనేది 4K హెచ్‌డీఆర్ టీవీ. ఇది 3840 x 2160 రిజల్యూషన్‌ను కలిగి ఉండి.. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 3 హెచ్‌డీఎమ్ఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, 3.5mm ఇయర్‌ఫోన్ జాక్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 30 వాట్ అవుట్‌పుడ్ డాల్బీ ఆడియో, అలాగే ప్యాచ్‌వాల్ 4తో ఆండ్రాయిడ్ టీవీ 10, 300+ ఉచిత లైవ్ ఛానెల్‌లు, కిడ్స్ మోడ్, ఇండియాస్ టాప్ 10, మీరాకాస్ట్‌తో సహా ఓటీటీ నుంచి 10000+ యాప్‌లు -core A55 CPU ప్రాసెసర్, 2GB ర్యామ్+ 16GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.28,999.

Tags

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×