Best Smart Watches in November : గత కొంత కాలంగా మార్కెట్లో స్మార్ట్ వాచ్‌లకు విపరీతమైన గిరాకీ పెరిగిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ స్మార్ట్ వాచెస్‌లో స్పోర్ట్స్ ట్రాకింగ్ ఫీచర్స్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉండటమే కారణం. వినియోగదారులకు ఫిట్‌నెస్ గురించి, ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ వాచెస్ బాగా ఉపయోగపడతాయి. పైగా ఇవి ఎంతో స్టైలిష్‌గానూ ఉంటూ మనకు మరింత అందాన్ని కూడా తెచ్చిపెడతాయి. అందుకే యూజర్స్ వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
స్మార్ట్ వాచెస్ కు ఉన్న గిరాకీతో టాప్ బ్రాండ్ కంపెనీలు దూసుకుపోతున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్‌తో ఎప్పటికప్పుడు పలు ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థలు స్మార్ట్ వాచ్‌లను విడుదల చేస్తూనే ఉన్నాయి. అయితే వినియోగదారులకు ఈ స్మార్ట్ వాచెస్‌లో ది బెస్ట్ ఏదీ అని తెలుసుకోలేక అయోమయంలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో రూ.5వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్ వివరాలు మీ కోసం తీసుకొచ్చాం. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
CMF Watch Pro 2 Smart Watch – రూ.5వేలలోపు ఉన్న స్మార్ట్ వాచెస్ లో ఇది బెస్ట్. 1.32 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, స్విచబుల్ బెజెల్స్, జీపీఎస్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.4,999 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇది అందుబాటులో ఉంది.
Noise Color Fit Pro 5 Max Smart Watch – ఇది అమెజాన్‌లో రూ.4,799కు అందుబాటులో ఉంది. 1.96 ఇంచ్ అమోలెడ్ డిస్ ప్లే. బ్లూ టూత్ కాలింగ్, spO2 మానిటర్‌తో పాటు 100కుపైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. జీపీఎస్ సపోర్ట్ కూడా ఉంది.
Redmi Watch 5 Lite Smart Watch – ఇది అమెజాన్‌లో దొరుకుతుంది. 1.96 ఇంచ్ అమోలెడ్ డిస్ ప్లే. ఇన్ బుల్ట్ జీపీఎస్, బ్లూ టూత్ కాలింగ్, spO2 మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Samsung Galaxy Fit 3 Smart Watch – ఈ గెలాక్సీ ఫిట్ 3 స్మార్ట్ వాచ్ 1.6 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లేతో వచ్చింది. ఇందులో 100కు పైగా ఎక్సర్సైజ్ మోడ్స్ ఉన్నాయి. 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ సామర్థ్యం ఉంది. ఇంకా ఇందులో బ్లూ టూత్ కాలింగ్ సపోర్ట్, ఇన్ బుల్ట్ జీపీఎస్ సపోర్ట్ ఉంది.
Crossbeats Nexus Smart Watch – ఈ క్రాస్ బీట్స్ నెక్సస్ 2.01 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, ఇన్ బుల్ట్ జీపీఎస్, బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్స్‌తో వచ్చింది. 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ కెపాసిటీ ఉంది. యాపిల్ వాచ్ డిజైన్ తరహాలో ఉంటుంది. ఇంకా ఇది డైనమిక్ ఐలాండ్‌ను సపోర్ట్ చేస్తుంది.
సో.. చూశారుగా బడ్జెట్ లో దొరికే బెస్ట్ స్మార్ట్ వాచెస్ లిస్ట్ ఇదే.. ఇంకెందుకు ఆలస్యం మరి అతి తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ తో స్మార్ట్ వాచ్ కొనాలి అనుకుంటే ట్రై చేసేయండి.