India scored 202 runs in 20 overs losing 8 wickets: టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ లో…. సూర్య కుమార్ యాదవ్ సేన అదరగొడుతోంది. టాస్ ఓడి బరిలోకి దిగిన టీమిండియా… భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో… ఏకంగా 202 పరుగులు చేసింది. 8 వికెట్లు నష్టపోయి ఈ భారీ స్కోర్ చేయగలిగింది టీమిండియా.
Also Read: IPL 2025: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే…కేవలం వారికే రూ.90 కోట్లు పక్కా..!
Also Read: Sanju Samson: సంజు శాంసన్ సెంచరీ… 9 సిక్స్ లు, 7 ఫోర్లు…!
టీమిండియా బ్యాటింగ్ లో సంజు శాంసన్ సెంచరీ తో మెరిశాడు. 50 బంతుల్లో 107 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో ఏడు ఫోర్లు, 10 సిక్సులు కొట్టాడు. అటు సూర్య కుమార్ యాదవ్ 21 పరుగులు చేయగా తిలక్ వర్మ 33 పరుగులతో రాణించాడు. మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో 202 పరుగులు చేయగలిగింది టీమిండియా. ఇక ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలవాలంటే 203 పరుగులు చేయాల్సి ఉంది.