Best Mobiles Under 15K : స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తారా? లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలా? బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ మెుబైల్ కొనాలా? అది కూడా రూ.15వేలలోపే కొనాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ లిస్ట్ పై ఓ లుక్కేసేయండి.
రూ. 15000 లోపు 6000mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే.
Samsung Galaxy M34 5G – Samsung Galaxy M34 5G Full-HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వచ్చేసింది. 50MP ప్రధాన కెమెరాతో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 13MP ఫ్రంట్ కెమెరాతో పాటు 8MP, 2MP సెకండరీ కెమెరాతో వచ్చేసింది. ఇక 4 జనరేషన్స్ OS అప్‌గ్రేడ్‌లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో వచ్చేసిన ఈ మెుబైల్ ధర రూ. 14,999.
Vivo T3x 5G – Vivo T3x 5G మెుబైల్ 6 GB RAM+128 GB స్టోరేజ్ ధర రూ.14,040. ఈ స్మార్ట్‌ఫోన్ 17.07 cm (6.72 అంగుళాల) ఫుల్ HD+ డిస్‌ప్లే, 50MP + 2MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 6 Gen 1 ప్రాసెసర్‌తో వచ్చేసింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIపై రూ. 1000 వరకు 10% తక్షణ తగ్గింపును అందిస్తుంది.
Samsung Galaxy M15 5G – Samsung Galaxy M15 5G ధర రూ.12,999. ఇది 19.5:9 యాస్పెక్ట్ రేషియోతో 16.39 సెంటీమీటర్ల (6.5 ఇంచ్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సెల్‌లతో FHD+ రిజల్యూషన్, 50MP మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా + 5MP మాక్రో యాంగిల్ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్, 6000mAh లిథియం అయాన్ బ్యాటరీతో వచ్చేసింది.
Samsung Galaxy F15 5G – Samsung Galaxy F15 5G 16.39 సెంటీమీటర్లు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సెల్‌తో FHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ తో వచ్చేసింది ఇక ఈ మెుబైల్ ధర రూ.11,999.
Samsung Galaxy F54 5G – Samsung Galaxy F54 5G మెుబైల్ 8GB RAM + 256GB స్టోరేజ్ తో వచ్చేసింది. దీనిని 1TB వరకు విస్తరించవచ్చు. ఇందులో 6.7-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉన్నాయి. Samsung Galaxy F54 5G రూ. 22,999 ఉంది. అయితే డిస్కౌంట్లు, ఆఫర్‌లతో రూ. 15000లోపు పొందవచ్చు.
Motorola Moto G64 5G – Motorola Moto G64 5G ధర రూ. 15000. ఇది 16.51 cm (6.5 inch) Full HD + డిస్‌ప్లే, 12 GB RAM, 256 GB ROM, 50MP (OIS) + 8MP ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 16MP ఫ్రంట్ Camera, 60 MP బ్యాటరీ, డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ ఆక్టా-కోర్ తో వచ్చేసింది. ఇక టర్బోపవర్ 33 W ఛార్జర్ తో పనిచేస్తుంది.
Samsung Galaxy F14 5G – Samsung Galaxy F14 5G రూ. 8,999కే అందుబాటులో ఉంది. ఇది Exynos 1330 చిప్‌సెట్, 6000 mAh బ్యాటరీ, 128 GB స్టోరేజ్, 6 GB ర్యామ్‌తో వచ్చేసింది. ఇది 6000mAh బ్యాటరీతో గొరిల్లా గ్లాస్ 5 డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13, 4 సంవత్సరాల వరకు భద్రతా అప్‌డేట్‌లు, 50MP (f/1.8) వెనుక కెమెరా. 13MP ఫ్రంట్ కెమెరా.
Moto G54 5G – Moto G54 5G మెుబైల్ 6.50 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో రూ. 12,145కే అందుబాటులో ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్, 8GB + 128 GB RAM, 120GB పవర్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ, 50MP + 8MP + 16MP కెమెరాతో వచ్చేసింది.
ALSO READ : అప్పు చేసైనా ఒప్పో కొనాల్సిందే! రాబోయో “Reno 13” ఫీచర్స్ ఏమున్నాయ్ బాస్