Indian Railways: రైల్లో తరచుగా ప్రయాణీకులు మధ్య గొడవలు జరగడం చూస్తుంటాం. సీటు విషయంలోనో, మరేదైన విషయంలోనో ప్రయాణీకుల నడుమ కొట్లాటలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఈ తగాదాలు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లిన సందర్భాలున్నాయి. తాజాగా యూపీలోని ఓ రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులు విధ్వంసానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టేషన్ లో ఆగిన రైలు అద్దాలను బండరాళ్లతో పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రైల్లోని ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మంకాపూర్ రైల్వే స్టేషన్ లో రెచ్చిపోయిన ప్రయాణీకులు
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మంకాపూర్ రైల్వే స్టేషన్ లో జరిగింది. తాజాగా చఫ్రా నుంచి ముంబైకి వెళ్లే 15101 అంత్యోదయ ఎక్స్ ప్రెస్ మంకాపూర్ లో ఆగింది. అప్పటికే ఈ రైల్లో ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో బయటి వాళ్లు లోనికి రాకుండా రైలు డోర్లు లాక్ చేశారు. ఈ నేపథ్యంలో రైలు ఎక్కాలనుకున్న ప్రయాణీకులకు ఓ రేంజిలో కోపం వచ్చింది. రైలు డోర్లు ఓపెన్ చేసేందుకు ప్రయత్నించినా తెరుచుకోకపోవడంతో కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రయాణీకులు బండరాళ్లు తీసుకొచ్చి రైలు అద్దాలు పగులగొట్టారు. మరికొంత మంది కిటికీలను ధ్వంసం చేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. గట్టిగా అరుస్తూ రైలును డ్యామేజ్ చేశారు. మంకాపూర్ స్టేషన్ లోని ప్రయాణీకుల విధ్వంసాన్ని చూసి రైల్లో ఉన్న ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. చాలా మంది రైలు డోర్లను పెట్టుకోవడంతో పాటు కిటికీలను కూడా మూసివేశారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
यात्रियों ने अंत्योदय एक्सप्रेस के दरवाजे को तोड़ दिया, मामला बस इतना था कि गेट नहीं
खोला गया था। pic.twitter.com/BO1ksgdTmF— Priya singh (@priyarajputlive) December 20, 2024
నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న రైల్వే పోలీసులు
మంకాపూర్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. “రైలు మంకాపూర్ రైల్వే స్టేషన్ కు వచ్చేసరికి పూర్తి స్థాయిలో ప్రయాణీకులతో నిండిపోయింది. లోపల కాలు పెట్టేందుకు కూడా స్థలం లేదు. అందుకే, లోపల ఉన్న ప్రయాణీకులు, బయటి వాళ్లు ఎక్కకుండా లాక్ చేశారు. దీంతో బయట ఉన్నవారికి కోపం తెప్పించింది. పెద్ద రాళ్లతో రైలు అద్దాలను, కిటికీలను ధ్వంసం చేశారు. ఈ డ్యామేజీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ మా దగ్గర ఉన్నది. రైల్వే పోలీసులు ఆ ఫీడ్ చూస్తున్నారు. ఈ విధ్వంసానికి కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. త్వరలోనే వారిని పట్టుకుని చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం” అని ఈశాన్య రైల్వే సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చంద్ర మోహన్ తెలిపారు.
అటు ఈ ఘటన మంగళవారం రాత్రి మిశ్ శ్రా అవుట్‌లెట్‌తో మాట్లాడుతూ, “విధ్వంసానికి సంబంధించిన ఫుటేజీ మా వద్ద ఉంది మరియు మా బృందాలు ఈ విషయంలో పాల్గొన్న వ్యక్తుల గుర్తింపును స్థాపించడానికి ప్రయత్నిస్తున్నాయి.” ఈ ఘటన మంగళవారం నైట్ 10:30 గంటలకు జరిగినట్లు తెలుస్తున్నది. అయితే, ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు.
Read Also: ప్రయాణీకులకు అదిరిపోయే న్యూస్, ఒకేసారి 10 వందేభారత్ స్లీపర్ రైళ్లు ఎంట్రీ!