BigTV English

Jio 5G : అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాతో పాటు 12 OTT సబ్‌స్క్రిప్షన్‌లను – అతి తక్కువకే ప్రీపెయిడ్‌ ప్లాన్‌!

Jio 5G : అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాతో పాటు 12 OTT సబ్‌స్క్రిప్షన్‌లను – అతి తక్కువకే  ప్రీపెయిడ్‌ ప్లాన్‌!

Jio 5G : ప్రముఖ టెలికాం సంస్థ జియో తమ వినియోగదారులను ఆకర్షించేందుకు , అలాగే ఇతర సిమ్ యూజర్స్​ను తమ వైపు తిప్పుకునేందుకు ఎప్పటి కప్పుడు కొత్త ప్లాన్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. Unlimited 5G డేటాను అందించేందుకు అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. కానీ ఆ సంస్థ తీసుకుచ్చే ప్లాన్లు వినియోగదారులకు కష్టంగా మారింది. అంత డబ్బులు చెల్లించి ప్లాన్లను రిచార్జ్​లు చేసేందుకు కష్టపడుతున్నారు. అయినప్పటికీ తప్పని సరి పరిస్థితుల్లో రిచార్జ్​లు చేసుకుంటున్నారు.


ALSO READ: అమేజింగ్ ఆఫర్.. రూ. 10,999కే 50MP కెమెరా, 128GB స్టోరేజ్ తో సూపర్ స్మార్ట్ ఫోన్

అయితే Unlimited 5G డేటాను అందించే రూ. 500 లోపు ఉన్న Jio ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలను ఓ సారి మళ్లీ మీ ముందుకు తీసుకొచ్చాం. అదనంగా, వినియోగదారులు అపరిమిత కాల్‌లు, ఇతర ప్రయోజనాలను పొందే ప్లాన్ల వివరాలను ఇక్కడ పొందు పరుస్తున్నాం.


జియో రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్ – ఈ ప్రీపెయిడ్ జియో ప్లాన్ అపరిమిత 5G డేటాతో వస్తుంది. అలానే 2GB 4G డేటా/రోజు, 100 ఎస్సెమ్మెస్‌లు, 14 రోజుల పాటు వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఇంకా JioTV, JioCinema, JioCloudకు ఉచిత సభ్యత్వాలను కూడా అందిస్తోంది.

జియో రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ – ఈ రిచార్జ్ ప్లాన్ 28 రోజుల పాటు అపరిమిత 5G డేటాతో లభిస్తోంది. 2GB 4G డేటా/రోజు, 100 SMS/రోజు, అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. JioTV, JioCinema, JioCloudకు ఉచిత సభ్యత్వాలను పొందొచ్చు.

జియో రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ – ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత 5G డేటా, 2.5GB 4G డేటా/రోజు, 100 SMS/రోజు, అపరిమిత వాయిస్ కాల్‌లతో వస్తుంది. 28 రోజుల పాటు వ్యాలిడిటీ. అదనంగా, వినియోగదారులకు JioTV, JioCinema, JioCloudకు ఉచిత సభ్యత్వాలను అందిస్తోంది.

జియో రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ – ఈ ప్లాన్ ద్వారా అపరిమిత 5G డేటా, 2GB 4G డేటా/రోజు, 100 SMS/రోజు, అపరిమిత వాయిస్ కాల్‌లను పొందవచ్చు. అలాగే 28 రోజుల పాటు జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. Jio TV యాప్ ద్వారా సోనీ లివ్, జీ5, లయన్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్ట్స్​, కంచ్చా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపల్, ఫ్యాన్ కోడ్, Hoichoi వంటి 12 ఓటీటీ యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఇంకా

జియో రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్ – ఈ Jio రూ. 449 ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్‌లను 28 రోజుల పాటు అందిస్తుంది. JioTV, JioCinema, JioCloud ఉచిత సభ్యత్వాలను అందిస్తుంది. ఇంకా అపరిమిత 5G డేటా, 3GB 4G డేటా/రోజు, 100 SMS/రోజు అందిస్తుంది.

మొత్తంగా ఈ ప్లాన్‌లతో, యూజర్స్​ తమ బడ్జెట్‌ను మించకుండా అపరిమిత 5G డేటాను పొందొచ్చు. మరింత డేటా కావాలంటే, రూ. 399 లేదా రూ. 449 ప్లాన్​లను ఓ సారి చూడండి. ఫైనల్​గా అపరిమిత 5G డేటా, ఎక్కువ OTT సబ్‌స్క్రిప్షన్‌లను కోరుకునే వారికి, రూ. 448 ప్లాన్ బెస్ట్ ఛాయిస్.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×