TRAI : టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆన్‌లైన్ మోసాలు, సైబర్ క్రైమ్‌లను నిరోధించడానికి నిరంతరం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెసేజ్‌లను ట్రేస్‌బిలిటీని చేయాలని నిర్ణయించింది. ఈ ఫీచర్ తో సందేశాన్ని పంపినవారి నుండి చివరకు సందేశాన్ని స్వీకరించిన వ్యక్తి వ్యక్తి వరకూ ప్రతీ విషయాన్నీ ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఆ సంస్థకు చెందిన వ్యక్తి, సంస్థను కూడా ట్రాక్ చేయవచ్చు. అయితే ఈ విధానాన్ని నవంబర్ 1 నుంచే అమలు చేయాల్సి ఉంది కానీ పలు కారణాలతో గడువును మళ్లీ డిసెంబర్ 11 వరకు పొడిగించారు.
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం ఆపరేటర్లు ఈ రూల్స్ ను అమలు చేయాలని ట్రాయ్ తెలిపింది. ఇక యూజర్స్ డిమాండ్‌పై మెసేజ్ ట్రేస్‌బిలిటీ ఈ రూల్ ను అమలు చేయటానికి TRAI నిర్దేశించిన గడువు అక్టోబర్ 31, 2024. కొన్ని కారణాలతో ఈ గడువును నవంబర్ 30, 2024 వరకూ పొడిగించారు. అయితే ఇప్పుడు గడువు మళ్లీ డిసెంబర్ 11 వరకు పొడిగించినట్లు ట్రాయ్ తెలిపింది.
ఇక డిసెంబర్ 11, 2024 నుండి ఈ రూల్స్ అమలులోకి వస్తాయని ట్రాయ్ తెలిపింది. కొన్ని కారణాలతో వాయిదా పడిందని.. అనుకున్న విధంగా సందేశాల ట్రాకింగ్ నియమాలు లేకపోవటంతో తిరస్కరించామని తెలిపింది.
ALSO READ : రూ.8,499 స్మార్ట్ వాచ్ కేవలం రూ.1400కే.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే!
TRAI కొత్త ట్రేసబిలిటీ రూల్ అమలు తర్వాత, మొబైల్ వినియోగదారులకు వచ్చే OTP సందేశాలను సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఏదైనా సైబర్ నేరం జరిగినప్పుడు ఈ ట్రేస్బిలిటీ ఆప్షన్ పనికొస్తుంది. ఓటీపీతో జరిగే మోసాలను తేలికగా ఆపే అవకాశం ఉంటుంది. ఓటీపీ వల్ల ఒక ప్రమాదం జరిగినప్పుడు, అది ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని దాని మూలాలను సైతం తేలిగ్గా కనుక్కునే అవకాశం ఉంటుంది. దీంతో సైబర్ నేరాలు చాలా వరకు కట్టడి చేయవచ్చు అని ట్రాయ్ అంచనా వేస్తుంది
నకిలీ సందేశాలు -OTP ట్రేసిబిలిటీ రూల్ అమలులోకి వచ్చిన తర్వాత, మొబైల్ వినియోగదారులకు వచ్చే స్పామ్ కాల్‌లు లేదా నకిలీ సందేశాలను తేలికగా గుర్తించవచ్చు. TRAI ఈ కొత్త నియమం దేశవ్యాప్తంగా కోట్లాది మంది మొబైల్ వినియోగదారుల భద్రతను పెంచుతుంది. ఇక సైబర్ నేరాలతో ఉపశమనాన్ని అందిస్తుంది. కొత్త రూల్‌తో టెలికాం కంపెనీల రూట్ నుంచి మొబైల్‌కి వచ్చే మెసేజ్‌లన్నింటినీ సులభంగా ట్రాక్ చేయవచ్చు. మరి ఇప్పటికే ఈ రూల్స్ డిసెంబర్ 11 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పిన ట్రాయ్.. అప్పటి నుంచి ఏ ఏ రూల్స్ అమలుకానున్నాయనే విషయాన్ని పూర్తి స్థాయిలో తెలపలేదు.
అయితే ఏది ఏమైనా ఓటీపీ మోసాలకు చెక్ పెట్టవచ్చు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వినియోగదారులకు ఈ విషయం కాస్త నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఈ రోజుల్లో ఓటీపీలతో జరుగుతున్న మోసాలు రోజురోజుకీ పెరిగిపోవడంతో ట్రాయ్ తీసుకొస్తున్న రూల్స్.. సైబర్ నేరాలను అడ్డుకట్ట వేస్తాయని వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ : మీ జీమెయిల్ ను చివరగా ఎవరు ఉపయోగించారో తెలుసుకోండిలా..!