Aishwarya Rai: సినీ పరిశ్రమలో విడాకులు అనేవి చాలా కామన్. అందుకే హీరో, హీరోయిన్లు విడాకులు తీసుకోవడం అనేది ప్రేక్షకులకు పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయదు. అయితే అలా రూమర్స్ వస్తున్నా కూడా వాటిని పట్టించుకోకుండా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న కపుల్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) కూడా అలాంటి కపులే అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ గత కొన్నిరోజులుగా వీరి విడాకులపై వస్తున్న రూమర్స్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్‌లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఇదిలా ఉండగా.. తనకేమీ సంబంధం లేదు అన్నట్టుగా ఐశ్వర్య రాయ్ తన పని తాను చూసుకుంటోంది.
డిశాస్టర్ ఇచ్చిన అభిషేక్
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల గురించి గత కొంతకాలంగా రూమర్స్ విపరీతంగా వైరల్ అవుతున్నా కూడా వీరిద్దరూ ఈ రూమర్స్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. వీటిపై స్పందించాలని అనుకోవడం లేదు. అందుకే వారి కెరీర్‌లో మళ్లీ బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అభిషేక్ బచ్చన్.. ‘ఐ వాంట్ టు టాక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అస్సలు ప్రమోషన్స్ లేకపోవడం వల్ల పెద్దగా ప్రేక్షకులకు రీచ్ అవ్వలేకపోయింది. థియేటర్లలో విడుదయిన మొదటి రోజే అతి తక్కువ కలెక్షన్స్‌తో డిశాస్టర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఐశ్వర్య రాయ్ కూడా తన అప్‌కమింగ్ మూవీపై ఫోకస్ పెడుతూ మరోసారి బిజీ అవ్వాలని అనుకుంటోంది.
Also Read: అలా చేస్తేనే మార్పు వస్తుంది.. ఇండస్ట్రీలో మహిళలకు తమన్నా సలహా
మళ్లీ సెట్‌లో
ఐశ్వర్య రాయ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు.. ఎప్పుడో ఒకసారి తన కూతురితో కలిసి ఫోటోలు షేర్ చేస్తుంది కానీ అంతకు మించి తన పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి విషయాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడానికి తను ఇష్టపడదు. అందుకే తను మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయిన విషయం కూడా ఐశ్వర్య బయటపెట్టలేదు. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అయిన ఆడ్రియన్ జాకోబ్స్.. ఐశ్వర్య రాయ్‌తో ఒక సెల్ఫీ దిగి.. దానిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ‘ఈరోజు ఐశ్వర్య రాయ్‌తో పనిచేయడంతో రోజంతా సంతోషంగా గడిచింది’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఐశ్వర్య మళ్లీ మూవీ సెట్‌లో అడుగుపెట్టిందనే విషయం బయటికొచ్చింది.
స్పందించడం లేదు
ఆడ్రియన్ షేర్ చేసిన ఈ సెల్ఫీ మూవీ సెట్ నుండి కాకపోయినా ఏదో ఒక షూటింగ్‌కు సంబంధించిందే అని అర్థమవుతోంది. సినిమాల్లో ఐశ్వర్య అంత యాక్టివ్ కాకపోయినా ఇప్పటికీ పలు బ్రాండ్స్‌కు ప్రమోషన్స్ చేస్తూనే ఉంటుంది. అలాగే ఇది కూడా అలాంటి ఒక షూట్ నుండి అయ్యిండవచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఏదైనా కూడా విడాకుల గురించి ఇంత దారుణంగా రూమర్స్ వస్తున్నా కూడా ఐశ్వర్య, అభిషేక్ మాత్రం వీటిపై ఎలాంటి స్పందన ఇవ్వకుండా ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్లిపోవడం కూడా ప్రేక్షకుల్లో అనుమానాలు కలిగేలా చేస్తోంది.