E-Paper
Advertisement

పవర్‌ఫుల్ పార్టీ స్పీకర్ వచ్చేసింది! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

పవర్‌ఫుల్ పార్టీ స్పీకర్ వచ్చేసింది! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

Blaupunkt Atomik Knightz: మ్యూజిక్ లవర్స్‌కు పూనకాలు తెప్పించేలా ప్రముఖ జర్మన్ ఆడియో బ్రాండ్ ‘బ్లాపంక్ట్’ ఇండియన్ మార్కెట్లోకి.. మరో కొత్త ప్రొడక్ట్‌ను తీసుకువచ్చింది. కంపెనీ.. తాజాగా విడుదల చేసిన ‘బ్లాపంక్ట్ అటోమిక్ నైట్జ్ 25K’బూమ్‌బాక్స్ ఇప్పుడు టెక్ అండ్ మ్యూజిక్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హై-ఎండ్ సౌండ్, ట్రెండీ లుక్స్ , నాన్‌ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే జెన్ జీ అండ్ పార్టీ లవర్స్ కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

Advertisement

1.120W మాన్‌స్టర్ సౌండ్ & ఆడియో పర్ఫార్మెన్స్:

ఈ బూమ్‌ బాక్స్‌లో అసలు సిసలు హైలైట్ దీని ఆడియో అవుట్‌పుట్. ఇది ఏకంగా 120W పవర్‌ ఫుల్ సౌండ్ అవుట్‌ పుట్‌ను డెలివరీ చేస్తుంది. ఇందులో.. డ్యూయల్ 3-ఇంచ్ ఫుల్-రెంజ్ డ్రైవర్లతో పాటు, గుండెల్లో బేస్ మోత మోగించేలా ఒక ప్రత్యేకమైన 4-ఇంచ్ వూఫర్‌ను అమర్చారు. దీనివల్ల వోకల్స్ స్పష్టంగా వినిపించడంతో పాటు, రాక్ సాంగ్స్ అయినా, డీజే బీట్స్ అయినా సరే ఒక మినీ లైవ్ కన్సర్ట్ వైబ్ కచ్చితంగా వస్తుంది.

2.వైర్‌లెస్ మైక్ & అన్‌లిమిటెడ్ కారావోకే క్రేజ్:

Advertisement

ఇంటి దగ్గర జరిగే గెట్‌టెగ్‌జెదర్స్, బర్త్‌డే పార్టీల్లో మీ టాలెంట్‌ను బయట పెట్టడానికి కంపెనీ ఇందులో ఒక వైర్‌లెస్ కారావోకే మైక్రో ఫోన్‌ను బోనస్‌గా ఇస్తోంది. ఎలాంటి వైర్స్ అడ్డంకులు లేకుండా.. ఈ మైక్‌తో ఫ్రెండ్స్‌తో కలిసి పాటలు పాడుతూ రచ్చ రచ్చ చేయెచ్చు.

3.12 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్:

ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసేలా డిజైన్ చేసిన ఈ స్పీకర్, ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. దాదాపు 12 గంటల వరకు నిరంతరం మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇస్తుంది. అంతే కాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో ..బ్యాటరీ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. (మీరు వాల్యూమ్ పెంచే కొద్దీ, లైటింగ్ ఆన్ ఉంచే కొద్దీ బ్యాటరీ లైఫ్‌లో కొద్దిగా మార్పు ఉండొచ్చు).

Also Read: కిచెన్‌కి ఏ మిక్సర్ గ్రైండర్ బెటర్? 500W, 750W లేదా 1000Wలలో ఏది కొనాలి!

4.ట్రెండీ డిజైన్ & వాటర్ రెసిస్టెన్స్:

ఈ బూమ్‌బాక్స్ చూడటానికి.. చాలా మోడ్రన్‌గా,క్లాసీ లుక్‌తో కనిపిస్తుంది. దీని పైభాగంలో.. ఇచ్చిన స్ట్రాంగ్ క్యారీ హ్యాండిల్ వల్ల దీన్ని ఎక్కడికైనా ఈజీగా పట్టుకెళ్లొచ్చు. ఇక అవుట్‌ డోర్ పార్టీల్లో నీటి చుక్కలు పడినా బెంగ లేకుండా.. ఉండేందుకు ఇది IPX6 వాటర్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. వీటికి తోడు మ్యూజిక్ బీట్స్‌కు తగ్గట్టుగా కదులుతూ.. బ్లో చేసే పార్టీ ఆరా లైట్స్ ఈ స్పీకర్‌కు మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు.

ఇండియన్ మార్కెట్లో ఈ ట్రెండీ బ్లాపంక్ట్ అటోమిక్ నైట్జ్ 25K బూమ్‌బాక్స్ ధర కేవలం రూ. 14,990 మాత్రమే! ఇది ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ ఫామ్స్‌తో పాటు.. బ్లాపంక్ట్ అఫీషియల్ వెబ్‌ సైట్‌లో కొనడానికి అందు బాటులో ఉంది. మీరు గనక ఒక పవర్‌ ఫుల్ పార్టీ స్పీకర్ కొనాలని చూస్తుంటే..ఇది మీ బడ్జెట్‌కి  బెస్ట్ అని చెప్పొచ్చు.

Related News

మీ కిచెన్‌కి ఏ మిక్సర్ గ్రైండర్ బెటర్? 500W, 750W లేదా 1000Wలలో ఏది కొనాలి!

సాదాసీదా సౌండ్‌కి గుడ్‌బై చెప్పండి..ఈ హెడ్‌ఫోన్స్‌తో మ్యూజిక్ ఫీల్ నెక్స్ట్ లెవెల్ అంతే!

బడ్జెట్ ధరలో సూపర్ క్లీనింగ్ ఇచ్చే..టాప్ వాషింగ్ మెషీన్లు

రీఛార్జ్ ఖర్చు తగ్గించుకోవాలా? జియోలో రూ.147కే 22 రోజుల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ కాల్స్!

ముందు, వెనుక రెండు డిస్‌ప్లేలతో అదరగొడుతున్న షావోమీ కొత్త ఫ్లాగ్‌షిప్స్.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఫోన్లు ఎలా హ్యాక్ అవుతాయి? మన సమాచారాన్ని ఎలా దొంగిలిస్తారు?

iPhone Duoకు అదిరిపోయే అప్‌డేట్.. ఫోన్ మడతపెట్టినా ఫేస్ అన్‌లాక్, ఆటో లాక్ ఫీచర్లు!

Big Stories

Advertisement
×