Jio Voice Only Plans: మొబైల్‌లో ఇంటర్నెట్ పెద్దగా ఉపయోగించకపోయినా.. కాల్స్ కోసం మాత్రం ప్రతి నెలా రీఛార్జ్ చేసేవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి వారి కోసం రిలయన్స్ జియో కొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. కేవలం కాల్స్, ఎంఎమ్‌ఎస్‌లు మాత్రమే కావాలనుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి. రూ.147 నుంచి మొదలయ్యే ఈ ప్లాన్స్‌లో రోజువారీ డేటా ఉండదు. ముఖ్యంగా ఎయిర్‌టెల్, వీఐ ప్లాన్స్‌తో పోలిస్తే జియో ధరలు తక్కువగా ఉన్నాయి. మరి ఏ ప్లాన్‌లో ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉందో చూద్దామా..
జియో మొత్తం ఆరు వాయిస్ ఓన్లీ ప్లాన్స్‌ను అందిస్తోంది. రూ.147 ప్లాన్‌తో 22 రోజుల వ్యాలిడిటీ, 300 SMS లభిస్తాయి. రూ.177 రీఛార్జ్‌తో 28 రోజులు, రూ.196 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఇక ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి రూ.197 క్యాలెండర్ మంత్ ప్లాన్ ఉంది. ఈ నాలుగు ప్లాన్స్‌లో 300 SMS అందిస్తారు. ఎక్కువ రోజులు రీఛార్జ్ అవసరం లేకుండా ఉండాలనుకునే వారికి రూ.448 ప్లాన్‌తో 84 రోజులు, 1,000 SMS లభిస్తాయి. రూ.1,748 ప్లాన్‌తో 336 రోజుల వ్యాలిడిటీ, 3,600 SMS వస్తాయి. అన్నింటిలోనూ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి.
Also Read: ముందు, వెనుక రెండు డిస్‌ప్లేలతో అదరగొడుతున్న షావోమీ కొత్త ఫ్లాగ్‌షిప్స్.. భారత్‌లోకి ఎప్పుడంటే?
ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే జియో ధరల్లో కొంత ఆదా కనిపిస్తోంది. 28 రోజుల ప్లాన్‌కు ఎయిర్‌టెల్, వీఐ రూ.185 వసూలు చేస్తుండగా.. జియోలో రూ.177కే రీఛార్జ్ చేసుకోవచ్చు. 30 రోజుల ప్లాన్‌లో కూడా రూ.203కు బదులుగా రూ.196 చెల్లిస్తే సరిపోతుంది. క్యాలెండర్ మంత్ ప్లాన్‌కు జియో రూ.197 తీసుకుంటే, ఎయిర్‌టెల్, వీఐ ధర రూ.206గా ఉంది. 84 రోజుల ప్లాన్‌లో జియో రూ.448కే అందిస్తుండగా, ఎయిర్‌టెల్ రూ.469, వీఐ రూ.470 వసూలు చేస్తున్నాయి. అయితే వార్షిక ప్లాన్లలో వ్యాలిడిటీని కూడా గమనించాలి.
ఈ ప్లాన్స్‌లో ఇంటర్నెట్ డేటా ఉండదు. అయితే అవసరమైనప్పుడు ప్రత్యేక డేటా ప్యాక్ తీసుకోవచ్చు. జియోలో రూ.55కు 3GB, రూ.100కు 6GB, రూ.195కు 15GB డేటా ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. అంటే రోజూ ఉపయోగించని డేటా కోసం అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.
ఫీచర్ ఫోన్లు వాడేవారు, సెకండరీ సిమ్ ఉంచుకునేవారు, ఇంట్లో వైఫై ఉపయోగించే ఉద్యోగులకు ఈ ప్లాన్స్ మంచి ఎంపిక. కాల్స్, బ్యాంక్ ఓటీపీల కోసం మాత్రమే సిమ్ వాడేవారికి కూడా ఇవి ఉపయోగపడతాయి. రీఛార్జ్ చేసే ముందు మీ అవసరానికి సరిపోయే వ్యాలిడిటీని ఎంచుకుంటే డబ్బు ఆదా చేసుకోవచ్చు.
Also Read: iPhone Duoకు అదిరిపోయే అప్‌డేట్.. ఫోన్ మడతపెట్టినా ఫేస్ అన్‌లాక్, ఆటో లాక్ ఫీచర్లు!