Best Sennheiser wireless headphones: ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఇయర్ ఫోన్స్ చెవుల్లో ఉండాల్సిందే! జర్నీలో బోర్ కొట్టినా, ఆఫీస్ డెడ్ లైన్ టెన్షన్ ఉన్నా, లేదా ప్రశాంతంగా రిలాక్స్ కావాలనుకున్నా.. మంచి మ్యూజిక్ ఉంటే.. ఆ మాయే వేరు. కానీ చాలా హెడ్ ఫోన్లు సాదాసీదా సౌండ్‌తో నిరాశ పరుస్తుంటాయి. ఆ మ్యూజిక్ లవర్స్ కోసమే.. ఆడియో వరల్డ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్న సెన్హైజర్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేసాయి. అల్టిమేట్ బేస్, క్రిస్టల్ క్లియర్ వాయిస్‌తో.. పాటు డేస్ టుగెదర్ బ్యాటరీ బ్యాకప్.. ఇచ్చే టాప్-5 ట్రెండీ హెడ్‌ఫోన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆడియో క్వాలిటీలో రారాజుగా నిలిచే ఈ హెడ్ ఫోన్ మార్కెట్లో.. ట్రెండింగ్ క్రియేట్ చేస్తోంది. దీని ధర మార్కెట్లో.. సుమారు రూ.29,990 నుంచి రూ.34,990 వరకు ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై.. ఏకంగా 60 గంటల అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. అంటే ..దాదాపు రెండు మూడు రోజులు ఛార్జ్ చేయాల్సిన పనే ఉండదు. అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, స్మార్ట్ పాజ్ ఫీచర్ , సిగ్నేచర్ సౌండ్ దీని ప్రత్యేకతలు. మ్యూజిక్ లవర్స్‌కి ఇది ఒక డ్రీమ్ గాడ్జెట్ అని చెప్పొచ్చు.
ప్రీమియం ఫీచర్లు కాస్త తక్కువ బడ్జెట్‌లో కోరుకునే.. వారి కోసం ఈ యాసెంటం మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ధర సుమారు రూ. 11,990 నుంచి రూ. 14,990 మధ్యలో లభిస్తుంది. ఇది హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో.. వస్తుంది. కేవలం ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. 50 గంటల పాటు నాన్‌స్టాప్ మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. అంతే కాదు.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే గంటల తరబడి దీనిని వాడొచ్చు.
హెడ్ ఫోన్ డిజైన్ ,కంఫర్ట్ పరంగా ఎంతో ఫేమస్ అయిన మోడల్ ఇది. దీని ధర సుమారు రూ. 8,990 నుంచి రూ.11,990 వరకు ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్.. ఉన్న ఈ హెడ్ ఫోన్ 30 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెంట్ యాక్సెస్ చేయడానికి ప్రత్యేకమైన బటన్ ఉంటుంది. మడతపెట్టడానికి వీలుగా ఉండే ఫోల్డబుల్ డిజైన్ దీన్ని ప్రయాణాలకు అనుకూలంగా మారుస్తుంది.
యాసెంటం సిరీస్‌లో మరింత అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో.. వచ్చిన మోడల్ ఇది. దీని ధర సుమారు రూ. 14,990 నుంచి రూ. 18,990 మధ్య ఉంటుంది. ఇది టచ్ కంట్రోల్ ప్యానెల్‌తో వస్తుంది. దీని ద్వారా వాల్యూమ్, కాల్స్ , ట్రాక్‌లను చాలా ఈజీగా కంట్రోల్ చేయెచ్చు. దీని బ్యాటరీ బ్యాకప్ కూడా 50 గంటల వరకు ఉంటుంది. అంతే కాకుండా దీనిలో విండ్ నాయిస్ రెడక్షన్ ఫీచర్ ఉండటం వల్ల బయట గాలిలో తిరుగుతున్నప్పుడు కూడా కాల్స్ క్లియర్‌గా మాట్లాడుకోవచ్చు.
Also Read: బడ్జెట్ ధరలో సూపర్ క్లీనింగ్ ఇచ్చే..టాప్ వాషింగ్ మెషీన్లు
టీవీ చూసేటప్పుడు లేదా హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే.. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన వైర్ లె స్ హెడ్ ఫోన్ ఇది. దీని ధర సుమారు రూ. 17,000 నుంచి రూ. 21,000 వరకు ఉంటుంది. ఇది బ్లూటూత్ కాకుండా.. ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీ డాక్‌తో వస్తుంది. దీని వల్ల ఎలాంటి ఆడియో లాగ్ లేకుండా నేరుగా టీవీ సౌండ్‌ని వినొచ్చు. ఇది రీఛార్జబుల్ బ్యాటరీలతో పని చేస్తుంది. కాబట్టి ఒక్క సారి ఛార్జ్ చేస్తే సుమారు 18 గంటల పాటు బ్యాకప్ ఇస్తుంది. బేస్ బూస్ట్ , సరౌండ్ సౌండ్ మోడ్స్ దీని ప్రత్యేక ఆకర్షణ.
ఫ్లాట్ ఆడియోతో విసిగి పోయి, నిజమైన మ్యూజిక్ ఫీల్ కోరుకునే వారికి సెన్హైజర్ బ్రాండ్ హెడ్‌ఫోన్లు అద్భుతమైన ఛాయిస్. మీ అవసరాలు ,బడ్జెట్‌ను బట్టి వీటిలో మీకు నచ్చిన మోడల్‌ను ఎంచుకుని, నాన్‌స్టాప్ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయండి!