Xiaomi 18 Pro: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమీ మరోసారి తన సత్తా చాటింది. ఎంతో కాలంగా టెక్ ప్రియులు ఎదురుచూస్తున్న షావోమీ 18 ప్రో, షావోమీ 18 ప్రో మ్యాక్స్ ఫోన్లను కంపెనీ గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేసింది. వివో, ఒప్పో వంటి బ్రాండ్ల ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేలా వీటిని తీర్చిదిద్దారు. అయితే భారత్‌లోకి ఈ ఫోన్లు ఎప్పుడు వస్తాయనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. చైనా వెర్షన్‌లో ఉన్న ఫీచర్లనే ఎలాంటి మార్పులు లేకుండా గ్లోబల్ మార్కెట్లోకి తెచ్చారు.
ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణ వెనుకవైపు ఉండే సెకండరీ స్క్రీన్. షావోమీ 18 ప్రోలో 6.4 అంగుళాల, ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేలు ఉన్నాయి. ఇవి 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తున్నాయి. పక్కనున్న వారికి స్క్రీన్ కనిపించకుండా ఉండే ప్రైవసీ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇక ఫోన్ వెనుక భాగంలో ప్రో మోడల్‌కు 2.7 అంగుళాలు, ప్రో మ్యాక్స్‌కు 2.9 అంగుళాల చిన్న అమోలెడ్ టచ్ స్క్రీన్లు ఇచ్చారు.
Also Read: iPhone Duoకు అదిరిపోయే అప్‌డేట్.. ఫోన్ మడతపెట్టినా ఫేస్ అన్‌లాక్, ఆటో లాక్ ఫీచర్లు!
పెర్ఫార్మెన్స్ విషయంలో షావోమీ ఎక్కడా తగ్గలేదు. షావోమీ 18 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 7 ఎలైట్ జెన్ 6 చిప్ వాడగా, ప్రో మ్యాక్స్‌లో 2nm టెక్నాలజీతో కూడిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్‌ను అమర్చారు. బ్యాటరీ పరంగా ప్రో మోడల్‌లో 6000mAh, ప్రో మ్యాక్స్‌లో ఏకంగా 7050mAh భారీ బ్యాటరీ ఉంది. ఈ రెండింటికీ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
ఫోటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం ఈ సిరీస్‌లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 200MP మెయిన్ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, మరో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందువైపు 50MP కెమెరా అందించారు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
షావోమీ 18 ప్రో 12GB+256GB బేస్ వేరియంట్ ధర రూ.1,44,000 కాగా.. 12GB+512GB మోడల్ ధర రూ.1,64,000గా ఉంది. ఇక ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే.. 12GB+256GB ధర రూ.1,64,900, 12GB+512GB ధర రూ.1,85,000, టాప్ ఎండ్ 16GB+1TB వేరియంట్ ధరను రూ.2,16,000గా నిర్ణయించారు. ఈ ఫోన్లు బ్లాక్, కాస్మిక్ బ్లూ, వెల్వెట్ రెడ్, వైట్ రంగుల్లో షావోమీ ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.
Also Read: Wired vs Wireless: ఫోన్ బ్యాటరీ పాడవకుండా ఉండాలంటే ఏ ఛార్జింగ్ వాడితే బెటర్?