E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో సూపర్ క్లీనింగ్ ఇచ్చే..టాప్ వాషింగ్ మెషీన్లు

బడ్జెట్ ధరలో సూపర్ క్లీనింగ్ ఇచ్చే..టాప్ వాషింగ్ మెషీన్లు
Advertisement

Top load washing machines under 18000: ఈ రోజుల్లో ప్రతి ఇంటికి వాషింగ్ మెషీన్ ఒక అత్యవసరమైన వస్తువుగా మారిపోయింది. ఆఫీస్ ఒత్తిడి, బిజీ లైఫ్ మధ్య బట్టలు ఉతకడం అంటే ప్రస్తుతం.. పెద్ద ప్రయాసతో కూడుకున్న పనే. అందుకే చాలా మంది ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అందుబాటులో ఉండేలా.. రూ.18,000 లోపు ధరలో.. లభించే టాప్-5 టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి తక్కువ ధరలో ఎక్కువ లైఫ్, పర్ఫెక్ట్ క్లీనింగ్ ఇస్తాయి.

పూర్తి ఫీచర్లు:

1. Haier 6 Kg 5 Star Fully Automatic Washing Machine:

Advertisement

హైయర్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ 6 కేజీ వాషింగ్ మెషిన్ చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు వారికి పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ధర మార్కెట్లో సుమారు రూ. 14,500 నుంచి రూ. 16,000 వరకు ఉంటుంది. ఇందులో ఉండే.. ఓషియానస్ వేవ్ డ్రమ్ డిజైన్ బట్టలను ఎలాంటి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా ఉతుకుతుంది. అలాగే.. దీనిలోని మ్యాజిక్ ఫిల్టర్ బట్టలపై ఉండే నార, మురికిని ఇట్టే పీల్చుకుంటుంది. ఇది 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో రావడం వల్ల కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువ వస్తుంది.

2. IFB 7 Kg 5 Star Fully Washing Machine:

ఐఎఫ్‌బి బ్రాండ్ అనగానే క్వాలిటీ గుర్తుకొస్తుంది. ఇది 3 నుంచి 4 మంది సభ్యులున్న మీడియం ఫ్యామిలీకి ఈ 7 కేజీ మోడల్ చాలా బాగుంటుంది. దీని ధర సుమారు రూ. 17,500 నుంచి రూ.18,000 మధ్యలో లభిస్తుంది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్‌తో పని చేస్తుంది. బట్టల బరువును బట్టి వాటర్ లెవెల్ , వాష్ సైకిల్‌ను అదే సెట్ చేసుకుంటుంది. హార్డ్ వాటర్ (ఉప్పు నీరు) సమస్య ఉన్న ప్రాంతాలకు ఇది బెస్ట్ ఆప్షన్. సాఫ్ట్ క్లోజింగ్ డోర్ , ఆక్వా ఎనర్జీ ఫీచర్ దీని ప్రత్యేకత.

3. Whirlpool 6 Kg Washing Machine:

Advertisement

నమ్మకమైన బ్రాండ్లలో ఒకటైన వర్ల్‌పూల్ నుంచి వస్తున్న ఈ మ్యాజిక్ క్లీన్ మెషీన్ బడ్జెట్ ధరలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ. 13,800 నుంచి రూ. 15,000 వరకు ఉంటుంది. దీని లోని ఆటో రీస్టార్ట్ ఫీచర్ వల్ల కరెంట్ పోయి వస్తే మళ్ళీ మొదటి నుంచి సెట్ చేయాల్సిన పని లేదు, ఎక్కడైతే ఆగిందో.. అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. ఇది హై-స్పీడ్ రొటేషన్ కలిగి ఉండటంతో.. బట్టలు త్వరగా ఆరడానికి వీలుగా నీటిని పూర్తిగా పిండేస్తుంది.

4. Bosch 7 Kg 5 Star Washing Machine:

జర్మన్ టెక్నాలజీతో తయారైన బాష్ బ్రాండ్ వాషింగ్ మెషీన్లు క్వాలిటీకి పేరుగాంచాయి. ఈ 7 కేజీ మోడల్ ధర సుమారు రూ. 17,000 నుంచి రూ. 18,000లోపు లభిస్తుంది. ఇది డ్యూయల్ లింట్ ఫిల్టర్‌ను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది బట్టలపై ఉన్న చిన్న చిన్న దారపు పోగులను ఈజీగా తొలగిస్తుంది. టెంపర్డ్ గ్లాస్ టాప్, ఫ్లెక్స్ డ్రైన్ అవుట్‌లెట్ దీని ప్రత్యేక ఆకర్షణ. దీన్ని ఆపరేట్ చేయడం చాలా ఈజీ అంతే కాకుండా దీని సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుంది.

Also Read: రూ.699కే బ్లూటూత్ హెడ్‌ఫోన్..స్టూడెంట్స్ కోసం పర్ఫెక్ట్

5. Godrej 7 Kg 5 StarWashing Machine:

గోద్రెజ్ బ్రాండ్‌కు ఎంతో ఆదరణ ఉంది. ఈ 7 కేజీ ఫైవ్ స్టార్ వాషింగ్ మెషీన్ ధర సుమారు రూ. 14,500 నుంచి రూ. 16,500 వరకు ఉంటుంది. టర్బో 6 పల్సేటర్ టెక్నాలజీ వల్ల నీటి ప్రవాహం డైనమిక్‌గా పని చేసి మురికిని వదిలి స్తుంది. చైల్డ్ లాక్, వాటర్ రెసిస్టెంట్ టచ్ ప్యానెల్ , సైకిల్ ఎండ్ బజ్జర్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది బట్టల రంగు పోకుండా సేఫ్‌గా ఉతుకుతుంది.

రూ.18,000 బడ్జెట్‌లో ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ కొనాలనుకునే వారికి ఈ ఐదు ఆప్షన్లు అద్భుతంగా పని చేస్తాయి.ఇంకెందుకాలస్యం మీ కుటుంబ సభ్యుల సంఖ్య, అవసరాలను బట్టి వీటిలో తగిన దాన్ని ఎంచుకోండి.

Related News

రీఛార్జ్ ఖర్చు తగ్గించుకోవాలా? జియోలో రూ.147కే 22 రోజుల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ కాల్స్!

ముందు, వెనుక రెండు డిస్‌ప్లేలతో అదరగొడుతున్న షావోమీ కొత్త ఫ్లాగ్‌షిప్స్.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఫోన్లు ఎలా హ్యాక్ అవుతాయి? మన సమాచారాన్ని ఎలా దొంగిలిస్తారు?

iPhone Duoకు అదిరిపోయే అప్‌డేట్.. ఫోన్ మడతపెట్టినా ఫేస్ అన్‌లాక్, ఆటో లాక్ ఫీచర్లు!

Wired vs Wireless: ఫోన్ బ్యాటరీ పాడవకుండా ఉండాలంటే ఏ ఛార్జింగ్ వాడితే బెటర్?

ఫ్రీ Wi-Fi వెనుక ఇంత పెద్ద ప్రమాదం ఉందా? కనెక్ట్ అయ్యే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

మీకు వచ్చే ఫోన్ కాల్ బ్యాంక్ నుంచా లేక సైబర్ నేరగాళ్ల నుంచా? నంబర్ చూసి ఇలా కనిపెట్టేయొచ్చు!

Big Stories

Advertisement
×