E-Paper
Advertisement

కిచెన్‌కి ఏ మిక్సర్ గ్రైండర్ బెటర్? 500W, 750W లేదా 1000Wలలో ఏది కొనాలి!

కిచెన్‌కి ఏ మిక్సర్ గ్రైండర్ బెటర్? 500W, 750W లేదా 1000Wలలో ఏది కొనాలి!
Advertisement

Kitchen mixer grinder buying guide: ఇంటికి కొత్త మిక్సర్ గ్రైండర్ కొనుగోలు చేద్దామని షాపుకెళ్లినా లేదా ఆన్‌లైన్‌లో వెతికినా.. వాట్స్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. 500 వాట్ల మిక్సీ సరిపోతుందా? లేక 750 వాట్లు తీసుకోవాలా? లేదా భారీగా 1000 వాట్లు ఉండాలా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇంతకీ మీ అవసరాలను బట్టి ఎలాంటి మిక్సీ కొంటే బెటర్ ఓ ఇప్పుడు తెలుసుకుందాం.

1.500W మిక్సర్ గ్రైండర్: చిన్న కుటుంబాలకు పర్ఫెక్ట్:

Advertisement

మీది చిన్న ఫ్యామిలీ (1 నుంచి 3 మంది సభ్యులు) అయితే.. రోజు వారీ వంటలో కేవలం అల్లం-వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ, చట్నీలు వంటి చిన్న చిన్న పనులు మాత్రమే ఉంటే 500W మిక్సర్ గ్రైండర్ సరిపోతుంది. ఇవి కాంపాక్ట్ సైజులో ఉంటాయి. అంతే కాకుండా వీటిని వాడటం వల్ల కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇదిలా ఉంటే.. మార్కెట్లో బ్రాండెడ్ 500W మిక్సర్లు సుమారు రూ. 2,000 నుంచి రూ. 3,500 వరకు లభిస్తాయి. బ్యాచిలర్లు , మిక్సీ ఉపయోగం తక్కువగా ఉండే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. వీటిలో మైనస్ ఏంటంటే..గట్టి పదార్థాలు, పచ్చి కొబ్బరి లాంటివి రుబ్బేటప్పుడు ఇది కాస్త నెమ్మదిగా పని చేస్తుంది.

2. 750W మిక్సర్ గ్రైండర్: మోస్ట్ పాపులర్ అండ్ ఆల్ రౌండర్:

ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న, అందరూ మెచ్చే మోడల్ 750W మిక్సర్ గ్రైండర్. 4 నుంచి 5 మంది సభ్యులున్న సరాసరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది చాలా బాగా సరిపోతుంది. ఇది పచ్చి కొబ్బరి, గట్టి పప్పులు, ఇడ్లీ-దోశ పిండి కోసం పప్పు రుబ్బడం వంటి పనులను సైతం చిటికెలో చేసేస్తుంది. సాధారణంగా.. ఇందులో 3 నుంచి 4 జార్‌లు వస్తాయి. ప్రముఖ బ్రాండ్ల 750W మిక్సర్లు సుమారు రూ. 3,500 నుంచి రూ. 6,500 మధ్య ధరలో లభిస్తాయి. రోజూ రకరకాల మసాలాలు, గ్రేవీలు చేసే వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. దీనిలోని మరో ప్రత్యేకత ఏంటంటే.. మోటార్ త్వరగా వేడెక్కకుండా ఎక్కువ సేపు పనిచేస్తుంది.

Related News

సాదాసీదా సౌండ్‌కి గుడ్‌బై చెప్పండి..ఈ హెడ్‌ఫోన్స్‌తో మ్యూజిక్ ఫీల్ నెక్స్ట్ లెవెల్ అంతే!

బడ్జెట్ ధరలో సూపర్ క్లీనింగ్ ఇచ్చే..టాప్ వాషింగ్ మెషీన్లు

రీఛార్జ్ ఖర్చు తగ్గించుకోవాలా? జియోలో రూ.147కే 22 రోజుల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ కాల్స్!

ముందు, వెనుక రెండు డిస్‌ప్లేలతో అదరగొడుతున్న షావోమీ కొత్త ఫ్లాగ్‌షిప్స్.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఫోన్లు ఎలా హ్యాక్ అవుతాయి? మన సమాచారాన్ని ఎలా దొంగిలిస్తారు?

iPhone Duoకు అదిరిపోయే అప్‌డేట్.. ఫోన్ మడతపెట్టినా ఫేస్ అన్‌లాక్, ఆటో లాక్ ఫీచర్లు!

Wired vs Wireless: ఫోన్ బ్యాటరీ పాడవకుండా ఉండాలంటే ఏ ఛార్జింగ్ వాడితే బెటర్?

Big Stories

Advertisement
×