E-Paper
Advertisement

ఫోన్లు ఎలా హ్యాక్ అవుతాయి? మన సమాచారాన్ని ఎలా దొంగిలిస్తారు?

ఫోన్లు ఎలా హ్యాక్ అవుతాయి? మన సమాచారాన్ని ఎలా దొంగిలిస్తారు?
Advertisement

స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు మన శరీరంలో ఒక భాగం అయిపోయాయి. అంతేకాదు.. ఆ ఫోన్లకు మన గుట్టు కూడా తెలుసు. మన రహస్యాలన్నీ అందులోనే ఉంటాయి. చివరికి బ్యాంకు ఖాతాల వివరాలు నుంచి పాస్‌వర్డ్‌ల వరకు ప్రతి ఒక్కటీ అందులోనే ఉంటాయి. అయితే అవి చాలా పదిలంగా ఉంటాయనే భ్రమలో మనం ఉంటాం. ఇంటర్నెట్‌లో ఇష్టానుసారం బ్రౌజింగ్ చేస్తూ.. ఏవేవో లింకులు క్లిక్ చేసేస్తూ ఉంటాం. ఆ అలవాటు.. మీ కొంప ముంచే ప్రమాదం ఉంది. గుర్తుతెలియని కొన్ని లింకులు క్లిక్ చేయడం అంటే మన గొయ్యి మనం తవ్వుకున్నట్లే. ఆ లింకులు.. సైబర్ నేరగాళ్లు మనకు వేసే వల లాంటివి. కేవలం లింకులే కాదు.. ఇంకా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. మీరు ఆ వలలో చిక్కుకోకూడదంటే.. దీని గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

నిజంగానే ఫోన్లు హ్యాక్ అవుతాయా?

ఫోన్లు మన చేతుల్లోనే కదా ఉంటాయి? ఎవరికి మన డేటా చిక్కుతుందని అనుకుంటాం. కానీ, ఇది ఇంటర్నెట్ యుగం. ఆన్‌లైన్‌లో వల్ల మొత్తం ప్రపంచమే మన చేతుల్లో ఉంది. అలాగే మనం కూడా ప్రపంచం చేతుల్లో ఉన్నాయి. ఆ ప్రపంచంలో ఫోన్ సర్వీస్ ఆపరేటర్లే కాదు.. సైబర్ నేరగాళ్లు కూడా ఉంటారు. మనం అప్రమత్తంగా లేకపోతే మన వ్యక్తిగత సమాచారం అంతా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. చిన్న పొరపాటు చేసిన ఫోన్ హ్యాక్ అవుతుంది. మరి, ఇలాంటి సైబర్ దాడుల నుంచి మన డేటాను ఎలా కాపాడుకోవాలి?

ఫోన్లను ఇలా హ్యాక్ చేస్తారు

Advertisement

ఫోన్లు హ్యాక్ చేయడానికి సైబర్ నేరగాళ్లు అనేక పద్ధతులు పాటిస్తుంటారు. వాటిలో ముఖ్యమైనది ఫిషింగ్. అంటే మనల్ని నమ్మించి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం. ఉదాహరణకు మనం నీటిలో చేపలం అనుకోండి. మనల్ని పట్టుకోడానికి సైబర్ నేరాళ్లు వసే వలే ఈ ఫిషింగ్. ఇందుకు వారు చాలా మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని, మీకు లాటరీ తగిలిందని లేదా బహుమతి వచ్చిందని కొన్ని మెసేజులు పంపుతారు. వాటిలో ఉండే లింకులు క్లిక్ చేసి.. మీ వివరాలు నమోదు చేస్తే.. మీ పాస్ వర్డ్‌లు, బ్యాంక్ సమాచారం వంటి వివరాలన్నీ సైబర్ నేరగాళ్లకు చిక్కే అవకాశం ఉంది. అలాగే.. కొందరు పెద్ద కంపెనీల వార్షికోత్సవ ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు అని ఆశ చూపుతూ కూడా లింకులు ఇస్తారు. క్లిక్ చేశారో మీ పని అంతే. మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్లు, పిల్లలకు ఇలాంటి లింక్స్ క్లిక్ చేయకూడదని చెప్పే బాధ్యత పూర్తిగా మీదే.

నకిలీ యాప్స్‌తో జాగ్రత్త

మీ ఫోన్లు ఉండే యాప్స్ అన్నీ సురక్షితం అనుకోవద్దు. వాటి ద్వారా కూడా మీకు వల వేయొచ్చు. కొన్ని వెబ్ సైట్లో ఉచితంగా సినిమాలు చూడొచ్చని, లేదా స్పెషల్ ఫీచర్స్ అంటూ APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయిస్తారు. వీటిలో మాల్‌వేర్ ఉండే ప్రమాదం ఉంది. వాటిని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే.. మీరు కూడా ప్రమాదంలో పడొచ్చు.

పబ్లిక్ Wi-Fi కూడా డేంజరే..

Advertisement

పబ్లిక్ Wi-Fi‌లు ఫ్రీగా వాడేయొచ్చని భావిస్తే తప్పులో కాలేసినట్లే. వాటి ద్వారా కూడా సైబర్ దాడులు జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సెక్యూరిటీ సెట్‌అప్ సరిగ్గాలేని నెట్ వర్క్‌లలో బ్యాంకింగ్ లావాదేవీలు చేయడం మంచిది కాదు. సైబర్ నేరగాళ్లు నకిలీ Wi-Fi నెట్ వర్క్‌లు ఏర్పాటు చేసి.. వినియోగదారుల సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తారు.

కస్టమర్ కేర్ కాల్స్..

సైబర్ నేరగాళ్ల నెట్ వర్క్ చాలా పెద్దది. వాళ్లకు ప్రత్యేకంగా కస్టమర్ కేర్స్ కూడా ఉంటాయి. అయితే, కస్టమర్లు వారిని సంప్రదించారు. వాళ్లే కస్టమర్లకు కాల్ చేస్తారు. బ్యాంక్ అధికారులమని చెబుతారు. టెక్నికల్ సపోర్ట్ అంటూ మీ ఓటీపీలు, పిన్‌లు అడుగుతారు. అప్పటికే వారి దగ్గర మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉంటాయి. మీరు గానీ పొరపాటున ఓటీపీ చెప్పారో.. మీ ఖాతా మొత్తం ఖాళీ. కొన్నిసార్లు ఫోన్‌లో స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేయాలని చెబుతారు. మీరు ఫోన్లో చేసే ప్రతి ఒక్కటీ చూస్తారు.

ఫోన్ హ్యాక్ అయ్యిందని ఎలా గుర్తిస్తారు?

ఫోన్ హ్యాక్ అయినప్పుడు స్పష్టమైన హెచ్చరికలేవీ కనిపించవు. కానీ, కొన్ని మార్పులు అనుమానం కలిగిస్తాయి. మనకు తెలియకుండానే యాప్స్ కనిపించడం, సోషల్ మీడియా అకౌంట్లలో అనుమానస్పద లాగిల్ అలర్ట్స్ రావడం, మనం ఏ మెసేజులు పంపకుండానే.. ఇతరులకు మన పేరుతో మెసేజులు వెళ్లడం వంటివి జరుగుతాయి. ఫోన్ డేటా వాడకం కూడా సడన్‌గా పెరిగిపోతుంది. బ్యాటరీ సాధారణం కంటే వేగంగా ఛార్జింగ్ తగ్గిపోతుంది. అనవసరమైన పాప్-అప్ ప్రకటనలు వస్తాయి.

ఫోన్ హ్యాక్ కాకూడదంటే ఏం చెయ్యాలి?

మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ కాకుండా, మీరు సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. ముందు మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్స్‌కు ఇచ్చిన పర్మిషన్లు పరిశీలించాలి. కొన్ని యాక్స్‌కు కాంటాక్ట్స్, మైక్రోఫోన్, లొకేషన్ యాక్సెస్ అవసరం ఉండదు. కానీ, అలాంటి అనుమతులు అడిగితే జాగ్రత్తపడాలి. యాప్‌‌లను ఎప్పుడూ అధికారిక గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. తెలియని వెబ్ సైట్ల నుంచి APK ఫైల్స్ ఇన్‌స్టాల్ చేయకూడదు. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఫీచర్‌ను ఆన్‌లో ఉంచడం మంచిది. ఇది ప్రమాదకర యాప్స్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది.

ఈ సెటప్స్ చేసుకోండి

ఈ మధ్య ఫోన్లలో Two-Factor Authentication (2FA) వంటివి అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా మనం ఏదైనా అకౌంట్‌లోకి లాగిన్ కావాలంటే పాస్‌వర్డ్ ఉపయోగిస్తాం. కానీ, 2FA ఆన్‌చేస్తే పాస్‌వర్డ్‌తో పాటు మరో అదనపు ధ్రువీకరణ కూడా అడుగుతుంది. దీనివల్ల ఇతరులు మీ ఫోన్ అకౌంట్లలోకి అంత ఈజీగా ప్రవేశించలేరు. ముఖ్యంగా జీమెయిల్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అకౌంట్లలో ఈ ఫీచర్‌ను ఉపయోగించాలి.

సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ తప్పనిసరి

ఫోన్లో డేటా అయిపోతుందనో లేదా మరేదైనా కారణాల వల్ల మీరు ఫోన్ సాఫ్ వేర్‌ను అప్‌డేట్ చేసుయడానికి బద్దకిస్తే.. తర్వాత పరుగులు పెట్టాలి. ఈ విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. ఎందుకంటే అప్‌డేట్స్‌లో పాత సెక్యూరిటీ లోపాలను సరిచేసే మార్పులుంటాయి. అన్ని అకౌంట్లకు ఒకే పాస్ వర్డ్ వాడకుండా వేర్వేరు పాస్ వర్డ్స్ పెట్టుకోవాలి. మీ పాస్ వర్డ్స్ ఎంత బలంగా ఉంటే అంత సురక్షితం.

ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఏది సురక్షితం

చాలామంది ఐఫోన్లు సురక్షితం అనుకుంటారు. కానీ, ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా సురక్షితమే. అవి చైనా పీసులైతే మాత్రం.. సెక్యూరిటీకి న్యో గ్యారంటీ. ఐఫోన్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ. కాబట్టి.. హ్యాకింగ్స్ కేసుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లే ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టులు సూచిస్తున్నాయి. చెప్పాలంటే ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా ఈ మధ్య ఐఫోన్లతో సమానంగా పనిచేస్తున్నాయి. ఆపిల్ ఐఫోన్‌లో యాప్‌ అనుమతులు, ప్రైవసీ నియంత్రణలు, సెక్యూరిటీ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా గూగుల్ ప్లే ప్రొటెక్ట్, యాప్ పర్మిషన్ కంట్రోల్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అయితే, కొన్ని పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో సెక్యూరిటీ ఫీచర్స్ బాగా తక్కువ. అలాగే కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు సరైన సెక్యూరిటీ అప్ డేట్స్ చేయడం లేదు. ఇది కూడా హ్యాకర్లకు సానుకూలంగా మారింది.

Also Read: గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలుకు బ్రేకులు పడకపోతే.. ఎలా ఆపుతారో తెలుసా?

ఫోన్ హ్యాక్ అయ్యిందనే అనుమానం వస్తే వెంటనే ఏం చెయ్యాలి?

మీకు తెలియని యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చెయ్యాలి. వాటిలో ఏమైనా ప్రమాదకరమైనవి గుర్తిస్తే.. వేరొక ఫోన్ లేదా లాప్ టాప్ ద్వారా మీ ముఖ్యమైన ఈమెయిల్స్, ఇతర అకౌంట్ల పాస్ వర్డ్‌లను మార్చాలి. అలాగే మీ గూగుల్, ఆపిల్, సోషల్ మీడియా అకౌంట్లలోకి లాగిన్ అయిన డివైస్‌లను గుర్తించాలి. వాట్సాప్ లింక్డ్ డివైస్ సెక్షన్ పరిశీలించాలి. మీకు తెలియకుండా ఏదైనా డివైస్ కనెక్ట్ అయ్యి ఉంటే.. వెంటనే లాగౌట్ చేసేయండి. బ్యాంక్ ఖాతాలో అనుమానస్పద లావాదేవీలు ఏమైనా కనిపిస్తే వెంటనే బ్యాంక్‌ను సంప్రదించాలి. 1930కి కాల్ చేసి ఆర్థిక మోసాల గురించి కంప్లైయింట్ చేయొచ్చు. సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు.

Tags

Related News

iPhone Duoకు అదిరిపోయే అప్‌డేట్.. ఫోన్ మడతపెట్టినా ఫేస్ అన్‌లాక్, ఆటో లాక్ ఫీచర్లు!

Wired vs Wireless: ఫోన్ బ్యాటరీ పాడవకుండా ఉండాలంటే ఏ ఛార్జింగ్ వాడితే బెటర్?

ఫ్రీ Wi-Fi వెనుక ఇంత పెద్ద ప్రమాదం ఉందా? కనెక్ట్ అయ్యే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

మీకు వచ్చే ఫోన్ కాల్ బ్యాంక్ నుంచా లేక సైబర్ నేరగాళ్ల నుంచా? నంబర్ చూసి ఇలా కనిపెట్టేయొచ్చు!

ఎయిర్‌టెల్ రూ.598 సూపర్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ఫ్రీ!

BSNL దిమ్మతిరిగే ఆఫర్.. జస్ట్ రూ.1కే కొత్త సిమ్.. 24 రోజులు ఫ్రీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

భారత్‌లోకి Motorola Edge 70 Neo 5G.. ఈ ఫోన్ కోసం ఎదురుచూడటానికి ముఖ్య కారణాలివే!

Big Stories

Advertisement
×