Gideon Haigh On Jay Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ రెండోసారి నియామకం అయ్యారు. 2027 వరకు అతని పదవీకాలం ఉన్నప్పటికీ ఏడాది ముందుగానే ఏక గ్రీవంగా సభ్య దేశాలు అతన్ని ఎన్నుకున్నాయి. అయితే ఐసీసీ చైర్మన్ గా జై షా రెండోసారి నియామకం కావడంపై ఆస్ట్రేలియాకు సంబంధించిన ఓ ప్రముఖ జర్నలిస్ట్ గిడియన్ హైగ్ (Gideon Haigh On Jay Shah ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఎలాంటి టాలెంట్ లేని జై షాకు అనవసరంగా రెండోసారి పదవి కట్టబెట్టారని గిడియన్ హైగ్ ఫైర్ అయ్యాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొడుకు అన్న ఒక్క కారణంతో జై షాను రెండోసారి ఎన్నుకున్నారని సీరియస్ అయ్యాడు. క్రికెట్ అంటేనే అతనికి తెలియదని.. ఎలాంటి టాలెంట్ లేకున్నా అతనికి సింహాసనం అప్పగించారని ఫైర్ అయ్యాడు. ఏం తెలియని జై షాకు సభ్య దేశాలు మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యాడు. అటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా ఇదే తరహాలో రియాక్ట్ అవుతున్నారు. మొహ్సిన్ నఖ్వీ ఇలాంటి గొప్ప వాళ్లకు ఆ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఐసీసీ చైర్మన్‌గా జై షాను (ICC Jah shah ) వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగిన ఐసీసీ సమావేశంలో చైర్మన్‌గా జై షా పేరు ప్రతిపాదించగా బోర్డు సభ్య దేశాల డైరెక్టర్లు, సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో జై షా కు పోటీగా ఎవరూ లేకపోవడంతో ఎన్నిక ఏక గ్రీవమైంది. 38 ఏళ్లలోనే ఐసీసీ బాస్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్న వ్యక్తిగా షా ( Jah shah) చరిత్ర సృష్టించాడు. 2024 డిసెంబర్ 1వ తేదీన తొలిసారిగా ఐసీసీ చైర్మన్ బాధ్యతలను జై షా చేపట్టాడు. రూల్స్ ప్రకారం, ఆ పదవిలో 2027 డిసెంబర్ వరకు కొనసాగుతాడు. ఇక రెండోసారి ఏకగ్రీవం కావడంతో 2030 వరకు షానే క్రికెట్ బాస్ అన్న మాట. అటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ గా ( Asian Cricket Council) ఉన్న మొహ్సిన్ నఖ్వీ పదవి కూడా త్వరలోనే ముగియనుంది. 2027లో అతని పదవి కాలం ముగియగానే బంగ్లాదేశ్ క్రికెటో బోర్డు ప్రెసిడెంట్ తమీమ్ ఇక్బాల్ ను నఖ్వీ స్థానంలో కూర్చోబెడతారని అంటున్నారు. ఈ మేరకు జై షా కసరత్తులు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.