Matka Karuna Kumar : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో కరుణకుమార్ ఒకరు. పలాస (Palasa) సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు కరుణ కుమార్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఈ సినిమా విషయంలో చాలా తప్పిదాలు జరిగిపోయాయి. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లాంటివాళ్ళు దళితుల కోసం ఈ సినిమా చేసాం వాళ్లే చూడకపోతే ఎలా అంటూ కొన్ని కామెంట్స్ కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. వాస్తవానికి ఆ సినిమాను చాలామంది ప్రేక్షకులు చూసి బానే తీశారు అని ప్రశంసలు కూడా కురిపించారు. అయితే కమర్షియల్ గా సక్సెస్ అందుకొని తరుణంలో తమ్మారెడ్డి భరద్వాజ అలా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అప్పట్లో కరోనా ప్రభావం మొదలవడంతో కూడా సినిమా కలెక్షన్ల పైన ప్రభావం పడింది.
ఆ సినిమా తర్వాత సుధీర్ బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమాను తీశాడు కరుణకుమార్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ఎట్టకేలకు వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా మట్కా అనే సినిమాను చేశాడు. ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా మరో డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా గురించి వెతికి చూసినా కూడా పాజిటివ్ టాక్ కనిపించడం లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు దర్శకుడు కరుణ్ కుమార్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కరుణ కుమార్ ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ మరీ ఓవర్ గా ఉన్నాయని కూడా చెప్పాలి.
Also Read : Kanguva Disaster: రూ. 2000 కోట్లు అంటివి కదరా.. ఎక్కడ ఉన్నావ్ రాజా
ఒక సందర్భంలో కరుణకుమార్ మాట్లాడుతూ “వరుణ్ తేజ్ నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది అంటే, కథ చెప్పిన దర్శకుడు దానిని సరిగ్గా తీయలేకపోవడం. లేదంటే నిర్మాత సరిగ్గా డబ్బులు పెట్టకపోవడం వలన ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి” అని చెబుతూ వచ్చాడు. మొత్తానికి కథలను ఎన్నుకున్న వరుణ్ తేజ్ ని ఏమి అనలేకపోయాడు. ఇక ఇప్పుడు మట్కా సినిమా విషయానికి వస్తే.. అప్పుడు దర్శకులను తప్పు పట్టిన దర్శకుడు కరుణకుమార్ ఇప్పుడు తన తప్పును ఒప్పుకుంటాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం మొదలయ్యాయి. ఏదైనా ఒక సినిమాకి కథ అనేది ప్రాముఖ్యం. ఆ కథను చూపించే విధానం బట్టి ప్రేక్షకుడిని ఆ సినిమా ఆకర్షించుకుంటుంది. ఏదేమైనా హీరోని పొగడటం కోసం అవతల వాళ్ళని తక్కువ చేయటం అనేది అనవసరం అనేది కొంతమంది అభిప్రాయం.ఇప్పుడు కరుణ కుమార్ సరిగ్గా సినిమా తీయలేకపోయాడా.? లేదంటే ప్రొడ్యూసర్ సరిగా డబ్బులు పెట్టలేదా.? అంటూ కొంతమంది సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు.