E-Paper
Advertisement

75 గంటల బ్యాటరీతో..గోబౌల్ట్ టెనెట్ ప్రో ఇయర్‌బడ్స్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోతుంది

75 గంటల బ్యాటరీతో..గోబౌల్ట్ టెనెట్ ప్రో ఇయర్‌బడ్స్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోతుంది
Advertisement

Boult Tenet Pro: టెక్ ప్రపంచంలో బడ్జెట్ ధరలో.. హై-ఎండ్ ఫీచర్లను అందించడంలో ముందుండే గోబౌల్ట్ సంస్థ ఇప్పుడు మరో సంచలన ప్రొడక్ట్‌తో మన ముందుకు వచ్చింది. అదే గోబౌల్ట్ టెనెట్ ప్రో ఇయర్‌బడ్స్. కేవలం రూ. 1499ధరకే లభిస్తున్న ఈ ఇయర్‌బడ్స్, మార్కెట్‌లో ఉన్న ఖరీదైన బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఫారెస్ట్ వైట్ కలర్ ఆప్షన్‌లో ఇవి చూడటానికి చాలా స్టైలిష్‌గా, ట్రెండ్‌గా కనిపిస్తున్నాయి. మరి ఈ ఇయర్‌బడ్స్‌లో.. ఏయే ఫీచర్లు ఉన్నాయి, రూ. 1500 లోపు బడ్జెట్‌కి ఇవి ఎంతవరకు న్యాయం చేస్తాయనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, లుక్:

ఈ ఇయర్‌బడ్స్ డిజైన్ విషయానికి వస్తే, చాలా ప్రీమియం లుక్‌ని కలిగి ఉన్నాయి. ఫారెస్ట్ వైట్ ఫినిషింగ్ దీనికి ఒక మోడర్న్ టచ్‌ని ఇస్తుంది. చెవులలో పెట్టుకున్నప్పుడు సౌకర్యవంతంగా ఉండేలా ఎర్గోనామిక్ డిజైన్‌తో వీటిని తయారు చేసారు. ఎక్కువ సేపు.. వాడినప్పటికీ ఇవి చెవులకు ఎలాంటి నొప్పి కలిగించకుండా లైట్‌ వెయిట్‌గా ఉంటాయి.రోజు వారీ ప్రయాణాలు చేసే వారికి, జిమ్‌కి వెళ్లేవారికి ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా సరి పోతుంది.

బ్లూటూత్ 6.0, కనెక్టివిటీ:

Advertisement

ఈ ప్రైస్ రేంజ్‌లో బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో రావడం నిజంగా విశేషం. ఇది మునుపటి వెర్షన్ల కంటే.. చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది. అంతేకాకుండా.. ఇందులో డ్యుయల్ డివైస్ పేరింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే.. మీ ల్యాప్‌టాప్ , ఫోన్ రెండింటికీ ఒకేసారి ఇయర్‌ బడ్స్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆఫీస్ కాల్స్ మాట్లాడుతూనే.. సడన్‌గా ఫోన్‌లో సాంగ్స్ వినేలా ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది.

సౌండ్ క్వాలిటీ, డ్రైవర్లు:

సౌండ్ పరంగా.. గోబౌల్ట్ ఎప్పుడూ రాజీపడదు. ఈ టెనెట్ ప్రో ఇయర్‌బడ్స్‌లో 13mm లార్జ్ డ్రైవర్లను అందించారు. దీని వల్ల బేస్ చాలా డీప్‌గా, క్రిస్టల్ క్లియర్ వోకల్స్‌తో మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. మీరు బీట్ ఉన్న సాంగ్స్ వింటున్నా.. లేదా క్లాసికల్ మ్యూజిక్ వింటున్నా మంచి ఆడియో ఫీల్ కలుగుతుంది.

Advertisement

Also Read: తక్కువ ధరలో స్మార్ట్ ల్యాప్‌టాప్ కావాలా? ఈ మోడల్ పై ఓ లుక్కేయండి

ANC, కాలింగ్ అనుభవం:

ఈ బడ్జెట్‌లో 32dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండటం అతి పెద్ద ప్లస్ పాయింట్. బయటి.. అనవసరమైన సౌండ్స్‌ను ఇది బాగా తగ్గిస్తుంది. అలాగే.. కాలింగ్ కోసం ఇందులో.. క్వాడ్ మైక్ EN టెక్నాలజీని వాడారు. రద్దీగా ఉండే రోడ్లపై లేదా మెట్రో ట్రైన్లలో.. ప్రయాణిస్తున్నప్పుడు కూడా అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపిస్తుంది.

బ్యాటరీ బ్యాకప్, యాప్ సపోర్ట్:

బ్యాటరీ లైఫ్ గురించి చెప్పాలంటే..ఇది కేవలం ఒక్క ఛార్జ్‌పై భారీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి.. మొత్తం 75 గంటల ప్లేటైమ్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. అంటే ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజంతా హ్యాపీగా వాడొచ్చు. అంతేకాకుండా.. ఇందులో అంప్ యాప్ సపోర్ట్ కూడా ఉంది. ఈ యాప్ ద్వారా ఈక్వలైజర్ మోడ్స్‌ను మార్చుకోవడం, టచ్ కంట్రోల్స్ కస్టమైజ్ చేసుకోవడం వంటివి ఈజీగా చేసుకోవచ్చు.

రూ. 1499 ధరలో బ్లూటూత్ 6.0, 32dB ANC, 75H బ్యాటరీ, డ్యుయల్ డివైస్ పేరింగ్ వంటి ఫీచర్లు అంటే ఇది నిజంగా ఒక గ్రేట్ డీల్ అనే చెప్పాలి. మీరు స్టైలిష్ లుక్‌తో పాటు మంచి ఫీచర్లు ఉన్న బడ్జెట్ ఇయర్‌ బడ్స్ కోసం చూస్తున్నట్లయితే.. గోబౌల్ట్ టెనెట్ ప్రో నిస్సందేహంగా ఒక మంచి ఛాయిస్ అవుతుంది.

Related News

ఒకటి కొంటే ఇంకోటి ఉచితం.. రియల్‌మీ దీపావళి సేల్‌లో మతిపోయే ఆఫర్లు భయ్యా!

కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి.. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఆధార్‌ అప్డేట్ నిమిషాల్లో!

ఈవినింగ్ స్నాక్స్ కోసం కరకరలాడే కుర్కురే పాస్తా..ఈజీ రెసిపీ ఇదే!

జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. కేవలం రూ.15లకే అన్‌లిమిటెడ్ 5G డేటా!

రూ.30kలోపు బెస్ట్ అంటే ఇదే భయ్యా! తోషిబా టీవీతో సినిమా హాల్ ఇంట్లోనే

తక్కువ ధరలో స్మార్ట్ ల్యాప్‌టాప్ కావాలా? ఈ మోడల్ పై ఓ లుక్కేయండి

వీవో యూజర్లకు డబుల్ ధమాకా.. X500 ఫోన్‌తో పాటే Vivo Watch GT 2 కూడా వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×