E-Paper
Advertisement

ఏడాదిలో 2 కంపెనీలు మూతపడ్డాయి.. అప్పులిచ్చినవాళ్లు నా వెంటబడ్డారు: మురళీ మోహన్

ఏడాదిలో 2 కంపెనీలు మూతపడ్డాయి.. అప్పులిచ్చినవాళ్లు నా వెంటబడ్డారు: మురళీ మోహన్
Advertisement

Kissik Talks: చిత్ర సీమలో నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న సీనియర్ నటులు మురళీమోహన్ తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమానికి విచ్చేశారు. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా నవంబర్ 8వ తేదీన రాత్రి 8 గంటలకు బిగ్ టీవీ వేదికగా ప్రసారమయ్యే ఈ ఫుల్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో గెస్ట్ గా పాల్గొన్న మురళీమోహన్ (Murali Mohan) ఒకే ఏడాది తన రెండు నిర్మాణ సంస్థలు మూతపడ్డాయని, ఆ సమయంలో అప్పులోళ్ళు వెంటపడ్డారు అంటూ ఆయన చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

ఒకే ఏడాది రెండు కంపెనీలు మూతపడ్డాయి – మురళీమోహన్

“జయభేరి సంస్థలో ఫ్లాట్ కొన్నాము.. నష్టపోయాము.. మోసపోయాము.. అనే మాటలు మేము ఎక్కడా వినలేదు.. అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు?” అని వర్షా ప్రశ్నించగా..” నేను రెండు డిస్ట్రిబ్యూట్ కంపెనీలలో డబ్బులు పెట్టాను. జయభేరి బ్యానర్ పెట్టుకొని సినిమాలు చేశాను. సంవత్సరం తిరక్కుండానే రెండు కంపెనీలు మూతపడ్డాయి.. అప్పులు ఇచ్చిన వాళ్లంతా నా మీద పడ్డారు అంటూ చెప్పుకొచ్చారు.

నా సక్సెస్ రహస్యం అదే – మురళీమోహన్

Advertisement

“ప్రపంచంలో 3 వంతుల నీరు ఉంది. ఒక వంతు మాత్రమే నేల ఉంది . రాబోయే రోజుల్లో ప్రపంచమంతా కూడా విపరీతమైన జనాభా పెరిగిపోతుంది. అందుకే దీనిని నేను మనసులో పెట్టుకొని, నాకు వచ్చిన ప్రతి రూపాయిని కూడా నేను భూమి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను” అంటూ తన బిజినెస్ రహస్యాలను బయటపెట్టారు మురళీమోహన్. మొత్తానికైతే మురళీమోహన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:ఇష్టం లేకపోయినా పొలిటికల్ ఎంట్రీ.. ఆ నెగెటివిటీ తప్పలేదన్న మురళీమోహన్!

బిజినెస్ లో నష్టాలు రావడానికి కారణాలు చెప్పిన మురళీమోహన్..

Advertisement

హోస్ట్గా వ్యవహరిస్తున్న వర్ష మాట్లాడుతూ.. “ఒక పది లక్షలు నా దగ్గర ఉంటే.. బంగారం కొని దాచి పెడతాను. అదే పది లక్షలు మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు?’ అని ప్రశ్నించింది.. బిజినెస్ లో పెడతానని ఆయన సమాధానం ఇచ్చారు. బిజినెస్ లో నష్టాలు జరగడానికి కారణాలు ఏంటి ? అని మళ్లీ వర్షా ప్రశ్నించారు. దీనికి మురళీమోహన్ మాట్లాడుతూ.. “అసలు దానిమీద కాన్సెంట్రేట్ చేయకుండా, పట్టించుకోకుండా ఉంటే కచ్చితంగా నష్టాలే వస్తాయి” అంటూ ఆయన తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. మీ బిజినెస్ పవర్ మరింత గట్టిగా ఉండాలని షో చేయడం, కార్లలో తిరగడం లాంటివి కూడా ఒక కారణం అంటూ పలు విషయాలను ఆయన చెప్పారు. అయితే ఈ విషయాలు పూర్తిగా తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

Related News

జీవితసత్యం చెప్పిన మురళీమోహన్.. మరి ఎందుకు ఈ పాకులాట!

అప్పుడు గాజులు గల గల ..ఇప్పుడు ఇరుముడి కట్టు ..అస్సలు తగ్గట్లేదుగా !

ఇష్టం లేకపోయినా పొలిటికల్ ఎంట్రీ.. ఆ నెగెటివిటీ తప్పలేదన్న మురళీమోహన్!

చావు అంచుల వరకు వెళ్లొచ్చిన సీరియల్ నటి?

దొంగ గేమ్ ఆడొద్దు.. కర్మ అనుభవిస్తావ్.. త్రిగుణ్ పై నీతూ మాస్టర్ ఫైర్..

శైలు ఎంత క్యూట్ గా ఉందో.. కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే..!

వంశీ నీకు మానవత్వమే లేదా..అందరూ చూస్తున్నారు!

Big Stories

Advertisement
×