Realme Diwali Sale 2026: ఈ దీపావళి పండుగను మరింత స్పెషల్‌గా మార్చేందుకు రియల్‌మీ తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు తీసుకొచ్చింది. Real Wali Diwali Sale 2026 పేరుతో ప్రకటించిన ఈ సేల్‌లో Realme P4 సిరీస్‌తో పాటు Narzo సిరీస్ స్మార్ట్‌ఫోన్‌పైనా భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. అంతేకాదు.. ఎంపిక చేసిన ఫోన్లను కొనుగోలు చేస్తే ఖరీదైన ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా పొందే అవకాశం కూడా కల్పిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఈ ఆఫర్లకు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా తోడవుతున్నాయి. ఏ ఫోన్‌పై ఎంత తగ్గింపు ఉంది? ఏ మోడల్‌తో ఎలాంటి ఇయర్‌బడ్స్ ఉచితంగా వస్తాయి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సేల్‌లో Realme P4s 5Gతో Buds T200 Lite, P4 Lite 4Gతో Buds Wireless 5 Lite, Narzo 100 Lite 5Gతో Buds T200x ఉచితంగా లభిస్తాయి. దీంతోపాటు అర్హత పొందిన పాత ఫోన్లపై రూ.2,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. మొత్తం రూ.500 కోట్ల విలువైన ఆఫర్లు అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.
Also Read: కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి.. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఆధార్ అప్డేట్ నిమిషాల్లో!
Realme P4 Power 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.32,999. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.3,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు, అర్హత కలిగిన బ్యాంక్ కార్డుపై రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ధర రూ.27,999కి తగ్గుతుంది. ఇక P4 Lite 4G 4GB RAM, 64GB స్టోరేజ్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,999కి అందుబాటులో ఉంది. రియల్‌మీ వెబ్‌సైట్‌లో దీని ధర రూ.16,499. Buds Wireless 5 Liteతో కలిపి రూ.14,198కే కొనొచ్చు.
Realme P4s 5G 8GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.34,999. రూ.1,999 విలువైన Buds T200 Liteతో కలిపి ఈ ఫోన్‌ను రూ.31,198కే కొనొచ్చు. రెండింటి మొత్తం ధరతో పోలిస్తే సుమారు రూ.5,800 ఆదా అవుతుంది. Narzo 100 Lite 5G కొనేవారికి Buds T200x ఉచితంగా లభిస్తుంది. ఈ జోడీ ధర రూ.19,198గా ఉంది.
Realme P4x 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.27,999. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.23,999కే లభిస్తోంది. అంటే నేరుగా రూ.4,000 తగ్గింపు. అర్హత కలిగిన బ్యాంక్ ఆఫర్లతో ధర ఇంకా తగ్గొచ్చు. కొనేముందు రెండు వెబ్‌సైట్లలో ధరలు, బ్యాంక్ ఆఫర్లు, ఇయర్‌బడ్స్ అర్హతను చెక్ చేయండి. చివరగా చెక్‌అవుట్‌లో కనిపించే ధరను చూసి ఆర్డర్ చేయండి.
Also Read: iOS 27.3 బీటా రిలీజ్ చేసిన యాపిల్.. కొత్త హెల్త్ యాప్, సిరి ఏఐతో పాటు మరిన్ని ఫీచర్లు!