E-Paper
Advertisement

తక్కువ ధరలో స్మార్ట్ ల్యాప్‌టాప్ కావాలా? ఈ మోడల్ పై ఓ లుక్కేయండి

తక్కువ ధరలో స్మార్ట్ ల్యాప్‌టాప్ కావాలా? ఈ మోడల్ పై ఓ లుక్కేయండి
Advertisement

Primebook Wifi 2026: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. ప్రతి ఒక్కరికీ ల్యాప్‌టాప్ అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు చదువుకోవడానికి, కోడింగ్ నేర్చుకోవడానికి లేదా ప్రాజెక్ట్‌లు చేయడానికి ఎక్కువ ధర పెట్టి పెద్ద ల్యాప్‌టాప్‌లు కొనలేరు. ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అద్భుతమైన డివైసే ప్రైమ్‌బుక్ వైఫై . యూజర్లు తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ , స్మూత్ ఆపరేటింగ్ సిస్టమ్ అందించే.. ల్యాప్‌టాప్‌ల కోసం ఎక్కువగా వెతుకుతున్నారు. సరిగ్గా ఈ అవసరాలను తీరుస్తూ .. మార్కెట్లోకి వచ్చిన ఈ ల్యాప్‌టాప్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

అద్భుతమైన డిజైన్, పోర్టబిలిటీ:

ఈ ల్యాప్‌టాప్ రాయల్ బ్లాక్ కలర్‌లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని.. బరువు కేవలం 1.065 కిలోలు మాత్రమే ఉండటం దీని ప్రధాన ప్లస్ పాయింట్. స్కూల్ బ్యాగ్‌లో లేదా చేతిలో పట్టుకుని ఎక్కడికైనా చాలా ఈజీగా మోసుకెళ్లొచ్చు. విద్యార్థులు , తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ లైట్‌వెయిట్ డిజైన్ ఎంతగానో ఉపయోగ పడుతుంది.

ప్రాసెసర్ :

Advertisement

ఈ ప్రైమ్‌బుక్ వైఫై ల్యాప్‌టాప్ పవర్ ఫుల్ మీడియాటెక్ ఎంటీ8183 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. దీనితో పాటు ఇందులో 4 జీబీ ఎల్‌పీడీడీఆర్4, రామ్ , 64 జీబీ ఈఎంఎంసీ స్టోరేజ్ అందించారు. ఈ స్టోరేజ్‌ను అవసరమైతే.. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఆన్‌లైన్ క్లాసులు వినడం, డాక్యుమెంట్లు తయారు చేయడం, బ్రౌజింగ్ చేయడం వంటి పనులకు ఈ కాన్ఫిగరేషన్ సరిగ్గా సరి పోతుంది.

ప్రత్యేకమైన ప్రైమ్ ఓఎస్:

ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత ఏంటంటే ఇది ‘ప్రైమ్ ఓఎస్’పై పని చేస్తుంది. దీని వల్ల మీ స్మార్ట్‌ ఫోన్‌లో వాడే అనేక రకాల అప్లికేషన్లను నేరుగా ఈ ల్యాప్‌ టాప్‌లో రన్ చేసుకోవచ్చు. విద్యార్థులు చదువుకోవడానికి.. నోట్స్ తయారు చేసుకోవడానికి, ప్రెజెంటేషన్లు , స్ప్రెడ్‌షీట్లు రూపొందించుకోవడానికి ఇది డెస్క్‌టాప్ లాగానే అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే.. ఇందులో ఉన్న కీ-మ్యాపింగ్ ఫీచర్ ద్వారా కీబోర్డ్ , టచ్‌ప్యాడ్ సపోర్ట్‌ను మరింత ఈజీగా నియంత్రించవచ్చు.

Advertisement

Also Read: ఇల్లు మెరిసిపోవడానికి..టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఇవే!

డిస్‌ప్లే, బ్యాటరీ లైఫ్:

ఇది 11.6 ఇంచుల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వీడియోలు చూసేటప్పుడు.. చదువుకునేటప్పుడు క్లియర్ విజువల్స్ అందిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే .. సుమారు 6 గంటల పాటు నిరంతరం పనిచేసే పవర్ ఫుల్ బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందిస్తుంది. దీని వల్ల విద్యార్థులు కరెంట్ సమస్యల గురించి టెన్షన్ పడకుండా.. ఎక్కడైనా ప్రశాంతంగా చదువుకోవచ్చు.

ధర:

ప్రైమ్‌బుక్ వైఫై అసలు ధర మార్కెట్లో.. ఎక్కువగా ఉన్నప్పటికీ..ప్రస్తుతం ప్రత్యేక ఆఫర్ కింద ఇది కేవలం రూ.14,990 ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో పిల్లలకు.. ఒక మంచి లెర్నింగ్ ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా బెస్ట్ ఆప్షన్.

అధిక ధరలు పెట్టలేక ఇబ్బంది పడే.. విద్యార్థులకు, బేసిక్ యూజర్లకు ఈ ప్రైమ్‌బుక్ వైఫై ల్యాప్‌టాప్ బెస్ట్ అని చెప్పొచ్చు. తక్కువ ధరలో ట్రెండీ ఫీచర్లు కోరుకునే.. వారు ఈ ల్యాప్‌టాప్‌ను నిరభ్యంతరంగా కొనొచ్చు.

Related News

వీవో యూజర్లకు డబుల్ ధమాకా.. X500 ఫోన్‌తో పాటే Vivo Watch GT 2 కూడా వచ్చేస్తోంది!

iOS 27.3 బీటా రిలీజ్ చేసిన యాపిల్.. కొత్త హెల్త్ యాప్, సిరి ఏఐతో పాటు మరిన్ని ఫీచర్లు!

ఆరోగ్యకరమైన స్నాక్స్ కోసం..బడ్జెట్ ధరలోనే ఎయిర్ ఫ్రైయర్స్

ఇల్లు మెరిసిపోవడానికి..టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఇవే!

టైటాన్ మీదకు మీ పేరు.. నాసా నుంచి బోర్డింగ్ పాస్ కూడా, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

జియో సెన్సేషనల్ ప్లాన్.. జస్ట్ రూ.84తో నెల మొత్తం సిమ్ యాక్టివ్.. బడ్జెట్ సేవ్ చేసుకోండిలా!

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్..నంబర్,తేదీపై ట్యాప్ చేస్తే చాలు షార్ట్‌కట్లు ఓపెన్!

Big Stories

Advertisement
×