E-Paper
Advertisement

ఆర్టీసీ సంచలన నిర్ణయం.. తలుపులు మూశాకే బస్సు స్టార్ట్.. ప్రవళిక ఘటనతో మేల్కొలుపు!

ఆర్టీసీ సంచలన నిర్ణయం.. తలుపులు మూశాకే బస్సు స్టార్ట్.. ప్రవళిక ఘటనతో మేల్కొలుపు!
Advertisement

TGSRTC New Rules: ప్రయాణికులు, తమ సిబ్బంది ప్రాణాల భద్రతే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డిపో నుంచి బయలుదేరే ప్రతి బస్సుకూ తలుపులు ఉండటంతో పాటు, డోర్లు పూర్తిగా మూసిన తర్వాతే వాహనాన్ని ముందుకు కదపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మణుగూరు ఘటనతో మేల్కొన్న యంత్రాంగం

ఇటీవల మణుగూరు డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్ ప్రవళిక.. డోర్లు తెరిచి ఉండటంతో రన్నింగ్ బస్సు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. ప్రయాణికురాలితో వాగ్వాదం సందర్భంగా జరిగిన తోపులాటలో ఆమె కిందపడిపోగా.. బస్సు వెనుక టైర్లు ఆమె కాళ్ల మీద నుంచి పోయాయి. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత సమీపంలోని ఆస్పత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రవళిక కోలుకుంటుందని అందరూ భావించగా.. ఆమె అనూహ్యంగా బుధవారం ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

పునరావృతం కాకూడదనే..

ఆమె మరణం.. ఆర్టీసీ యాజమాన్యాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ ఊహించని నష్టం ఆర్టీసీ యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేయడమే కాకుండా.. బస్సుల్లో భద్రతా ప్రమాణాల పునఃసమీక్షకు దారితీసింది. భవిష్యత్తులో ఇలాంటి విచారకరమైన ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే పాలకవర్గం వెంటనే రంగంలోకి దిగి ఈ కొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది.

అన్ని బస్సులకూ డోర్ల అమరిక తప్పనిసరి

Advertisement

ప్రస్తుతం సర్వీసులో ఉన్న అన్ని రకాల ఆర్టీసీ బస్సులను సమగ్రంగా పరిశీలించాలని ఆయా డిపో అధికారులకు ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు అందినట్లు తెలుస్తోంది. దీంతో డోర్లు లేని లేదా తలుపులు పాడైన బస్సులను తక్షణమే గుర్తించి, వాటికి కొత్తగా తలుపులు అమర్చే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నారు. డోర్లు సరిగ్గా మూతపడని బస్సులను రోడ్లపైకి అనుమతించేది లేదని అధికారులు తేల్చిచెప్పారు.

Also Read: కొత్తపట్నం తీరానికి కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం.. స్పందించిన మంత్రి డోలా!

సురక్షిత ప్రయాణమే లక్ష్యం

కాగా, పెరుగుతున్న రద్దీ, ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు, డోర్ల వద్ద ప్రయాణికులు నిలబడటం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డోర్లు క్లోజ్ చేశాకే బస్సు కదలాలనే నిబంధన కచ్చితంగా అమలులోకి వస్తే ఈ తరహా ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు, కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: ఢిల్లీలో కూలిన మూడు అంతస్థుల భవనం.. స్పాట్‌లో ఇద్దరు మృతి, శిథిలాల కింద మరో రెండు డజన్ల మంది

Tags

Related News

రైల్లో మీ వస్తువులు లేదా లగేజీ మర్చిపోతే ఏం చేయాలి? తిరిగి పొందడానికి వెంటనే ఇలా చేయండి

రైలు టికెట్ రంధ్రాల వెనుక ఇంత కథ ఉందా? చాలామందికి తెలియని ఆసక్తికర నిజం!

తనకు ఎవరూలేరని బాధపడిన వరుడు.. పెళ్లికి 10 వేల మంది అతిథులు సర్‌ప్రైజ్!

రైళ్లలో స్లీపర్ కోచ్ ప్రయాణికులకు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు!

ఈశాన్య భారతానికి బుల్లెట్ రైలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

భారత్-పాక్ సరిహద్దులో రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. పలు రైళ్లు రద్దు!

జస్ట్ 100 మీటర్ల లింక్ రోడ్డు కోసం.. రోడ్డెక్కిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×