Gajula Galagala Song:ఒకటి రెండు కాదు అక్షరాల రెండు వారాల్లోనే ఏకంగా 19మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది గాజులు గల గల అనే పాట.ఇక ఒక్క పాటతో ఎక్కడలేని క్రేజ్ కొట్టేసింది రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య.ఇలా రాత్రిలోనే వన్ మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి ఓవర్ నైట్ స్టార్ అవ్వడంతో ఎంతో మంది నెటిజన్లు ఆకాశానికి ఎత్తేశారు.ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేని ఒక అమ్మాయి చేసిన వీడియో ఇలా ఒక్క రాత్రిలోనే వన్ మిలియన్ వ్యూస్ కొల్లగొట్టింది లేదని తెగ మెచ్చేసుకున్నారు.అయితే ఎంత మెచ్చుకున్నారో దానికి రెట్టింపు సంఖ్యలో ఈ అమ్మాయి విమర్శల జడివాన లో తడిసింది.
సుననయ నుండి మాధవీ లత వరకు
రాధమ్మ కల్యాణితో మొదలై సినిమా ఆర్టిస్ట్ కం యూట్యూబర్ సుననయ ,సినీ ఆర్టిస్ట్ మాధవీ లత నుండి ఎంతో మంది ఈ రాధమ్మ కూతురిని తమదైన ట్రోలింగ్ తో చెడుగుడు ఆడేశారు.అసలు ఆ పాట వింటూనే చిరాకు ఎత్తుతుందని,కేవలం రీల్స్ కోసం తప్ప భక్తితో మాల వేసుకోలేదని, అసలు ప్లాస్టిక్ పూలు పెట్టుకుని అమ్మవారి సన్న్డిలో అలా పాటలు పాడటం ఎంటని,సింపుల్ గా ఒక భక్తురాలిగా ఉండాల్సిన అమ్మాయి ఇలా పెదాలపై లిప్ స్టిక్ రుద్దుకోవడం ఏంటని ఇలా ఒక రేంజ్ లో విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.
నాకు నచ్చినట్టుగానే రీల్స్ చేసుకుంటా
ఇక వీటన్నింటికి తనదైన స్టైల్ లోనే సమాధానం చెప్పింది రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య.తనకు నచ్చినట్టుగా ఉంటానని,ఎప్పటి నుండో ఫీల్డ్ లో ఉన్నప్పటికీ కేవలం నా పాట సెన్సేషన్ క్రియేట్ చేసిందన్న ఒకే కారణంతో ఇలా తనని ట్రోల్ చేస్తున్నారని మండిపడింది.ఎవరేమనుకున్నా నాకు నచ్చినట్టుగానే రీల్స్ చేసుకుంటానంటూ కుండబద్దలు కొట్టేసింది.ఇదిగో అలా చెప్పెసిందో లేదో మళ్ళీ వరుస రీల్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంది.
అయ్యప్ప పాటతో మరోసారి హాట్ టాపిక్
ఆ క్రమంలోనే ఇప్పటికే పలు ఫోక్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ రీల్స్ వదిలిన ఈ అమ్మాయి తాజాగా అయ్యప్ప పాట ఇరుముడి కట్టు శబరి మలైకీ అంటూ మరో పాటని పాడి సోషల్ మీడియాలో వదిలింది.ఇక ఆ పాట ఇలా వచ్చిందో లేదో తమ కామెంట్లకి పని పెట్టారు నెటిజన్లు .అసలు నీకు ఆ పాట సూట్ కాలేదు,దయచేసి పాడవద్దు అంటూ కొందరు అంటే మొన్నటి వరకు భావాని మాత మీద పడ్డావు, ఇక ఇపుడు అయ్యప్ప స్వామి మీద పడ్డవా తల్లీ అంటూ మండి పడుతున్నారు.
ఇంకొంతమంది అసలు నువ్వు ఏ పాటలు పాడినా చాలా చిరాగ్గా ఉంది దయచేసి పాటలు పాడకుండా కొన్ని రోజులు నువ్వు ఇంట్లో ఉండొచ్చుగా అంటూ సెటైర్స్ వేస్తున్నారు.అయితే ఒకవైపు విమర్శలు వస్తుంటే మరికొంత మంది చాలా అద్భుతంగా పాడావు, సూపర్ బంగారం అంటే మరికొంతమంది నీ గొంతు బాగా సూట్ అయింది ,ఇంకా బాగా నేర్చుకుంటే రాణిస్తావు అంటూ ఆకాశానికి ఎతేస్తున్నారు.
ఏది ఏమైనా ఎన్ని విమర్శల జడివానలు కురిసినా ఎక్కడా తగ్గనంటున్న ఈ రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్యని నిజంగా మెచ్చుకొని తీరాల్సిందే.చూడాలి మరి ముందు ముందు ఈ అమ్మాయి ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !
also read :కనకవ్వ నుంచి మంగ్లీ వరకు.. ఒక్కో పాటకు ఎంత తీసుకుంటున్నారంటే?