E-Paper
Advertisement

జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. కేవలం రూ.15లకే అన్‌లిమిటెడ్ 5G డేటా!

జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. కేవలం రూ.15లకే అన్‌లిమిటెడ్ 5G డేటా!
Advertisement

Jio Rs 15 Recharge Plan: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మరో సరికొత్త ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ లిమిట్ అయిపోయి అత్యవసర సమయాల్లో హై-స్పీడ్ డేటా కావాలనుకునే వారికి ఈ కొత్త రీఛార్జ్ ప్యాక్ అద్భుతంగా ఉపయోగపడనుంది. కేవలం రూ. 15 ధరతో వస్తున్న ఈ ప్యాక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రూ. 15 ప్యాక్ ప్రత్యేకతలు

ఈ కొత్త రూ. 15 డేటా ప్యాక్ లో అన్ లిమిటెడ్ 5G ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగా తక్కువ ధర ఉండే యాడ్-ఆన్ ప్యాక్‌లలో 1 లేదా 2 జీబీ డేటా మాత్రమే ఇస్తుంటారు. కానీ జియో ఈ రూ. 15 ప్యాక్‌లో ఎలాంటి డేటా పరిమితి లేకుండా.. 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్‌ను ఆఫర్ చేస్తోంది. అయితే ఇది యాడ్ ఆన్ బూస్టర్ ప్యాక్ మాత్రమే. దీన్ని ఉపయోగించుకోవాలంటే ఏదైనా యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ కలిగి ఉండాలని జియో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే 5G సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండటంతోపాటు జియో ట్రూ 5G నెట్‌వర్క్ పరిధిలో యూజర్లు ఉండాలని పేర్కొన్నాయి.

రూ.15 ప్యాక్‌తో ఎవరికి బెనిఫిట్

Advertisement

అనుకోని పరిస్థితుల్లో అత్యధిక డేటా అవసరైనవారికి ఈ రూ.15 డేటా ప్యాక్ ఉపయోగరంగా ఉండనుంది. మరీ ముఖ్యంగా అల్ట్రా హెచ్‌డీ (Ultra HD), 4K రిజల్యూషన్‌లో సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ చూసేవారు ఎలాంటి బఫరింగ్ లేకుండా సాఫీగా స్ట్రీమింగ్ చేసుకునేందుకు ఈ ప్యాక్ వీలు కల్పిస్తుంది. అలాగే మొబైల్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడే గేమర్స్‌కు సైతం ఈ సరికొత్త డేటా ప్యాక్ పర్ఫెక్ట్ గా సెట్ కానుంది. ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాకుండా ఉద్యోగులు, విద్యార్థులకు కూడా ఈ ప్యాక్ ఎంతో ఉపయోగపడనుంది. ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్‌లు, భారీ సైజులోని సాఫ్ట్‌వేర్ ఫైల్స్ డౌన్‌లోడ్, హై-రెస్ వీడియోలు, వర్క్ ఫైల్స్‌ను క్లౌడ్‌లో బ్యాకప్ చేయడానికి ఇది చక్కటి ఆప్షన్.

Also Read: దీపావళికి అదిరిపోయే స్టైలిష్ డ్రెస్ కావాలా.. ఈ ట్రెండీ అవుట్‌ఫిట్స్ ట్రై చేయండి

రూ. 15 ప్యాక్‌ను ఎలా పొందాలి?

Advertisement

ఈ కొత్త అన్‌లిమిటెడ్ 5G డేటా ప్యాక్ దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ‘మైజియో’ (MyJio) యాప్, అధికారిక జియో వెబ్‌సైట్, గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి థర్డ్-పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా ఈ ప్యాక్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ కాకుండా నేరుగా తీసుకోవాలనుకునే వారు రిలయన్స్ రిటైల్ స్టోర్లు, మొబైల్ రీఛార్జ్ షాపుల్లో కూడా ఈ రూ. 15 ప్యాక్‌ను పొందవచ్చని జియో వర్గాలు వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: దీపావళికి మీ ఇంటి చిన్న పూజ గదిని అందంగా అలంకరించాలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరి

Tags

Related News

రూ.30kలోపు బెస్ట్ అంటే ఇదే భయ్యా! తోషిబా టీవీతో సినిమా హాల్ ఇంట్లోనే

తక్కువ ధరలో స్మార్ట్ ల్యాప్‌టాప్ కావాలా? ఈ మోడల్ పై ఓ లుక్కేయండి

వీవో యూజర్లకు డబుల్ ధమాకా.. X500 ఫోన్‌తో పాటే Vivo Watch GT 2 కూడా వచ్చేస్తోంది!

iOS 27.3 బీటా రిలీజ్ చేసిన యాపిల్.. కొత్త హెల్త్ యాప్, సిరి ఏఐతో పాటు మరిన్ని ఫీచర్లు!

ఆరోగ్యకరమైన స్నాక్స్ కోసం..బడ్జెట్ ధరలోనే ఎయిర్ ఫ్రైయర్స్

ఇల్లు మెరిసిపోవడానికి..టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఇవే!

టైటాన్ మీదకు మీ పేరు.. నాసా నుంచి బోర్డింగ్ పాస్ కూడా, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

Big Stories

Advertisement
×