Brain Robot:- బ్రెయిన్‌లోకి రోబో.. యాక్టివిటీని కనిపెట్టడం కోసం..ఇప్పటికే రోబోటిక్స్ అనేవి ప్రతీ రంగంలో మనుషులకు సాయం చేస్తూ ముందుకెళ్తున్నాయి. ఫుడ్, బిజినెస్, మెడికల్.. ఇలా ప్రతీ రంగంలో రోబోలు మనుషులకు సాయం చేసే విధంగా కూడా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ రంగంలో రోబోల సాయం మెచ్చుకోదగిందిగా ఉందని ఇప్పటికే పలువురు వైద్యులు బయటపెట్టారు. తాజాగా బ్రెయిన్‌ను స్టడీ చేయడం కోసం ఒక కొత్త రకమైన చిన్న రోబోను శాస్త్రవేత్తలు తయారు చేశారు.
బ్రెయిన్ యాక్టివిటీని కనిపెట్టడానికి వైద్యుల దగ్గర పలు టెక్నాలజీలు అందుబాటులోకి ఉన్నాయి. కానీ అడ్వాన్స్‌డ్‌గా బ్రెయిన్ యాక్టివిటీని కనుక్కోవాలంటే మాత్రం మెదడులో చొరబడాల్సిన అవసరం ఉందని వారు చెప్తున్నారు. అలా కాకుండా ఇప్పటినుండి ఒక చిన్న రోబోను బ్రెయిన్‌లోకి పంపిస్తే చాలని, అనవరసమైన టెక్నాలజీలను ఉపయోగించాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా ఈ రోబో సీజర్స్‌ను ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
తలపై కేవలం 1 లేదా 2 సెంటీమీటర్ల రంధ్రం చేసి అందులో నుండి ఈ రోబోను లోపలికి పంపించాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది చూడడానికి ఒక పువ్వులాగా ఉంటుంది. ఇందులోనే సెన్సార్లు కూడా ఉంటాయి. ఇప్పటివరకు బ్రెయిన్‌ను పూర్తిగా స్టడీ చేయాలంటే అందులోకి సెన్సార్లను పంపించాల్సి ఉంటుంది. దానికంటే సెన్సార్లతో ఉండే ఈ రోబో చాలా ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఈ రోబోలను ఇంకా డెవలప్ చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇప్పటికే పలు ఆపరేషన్లలో, క్లిష్టమైన చికిత్సలలో పాల్గొన్న రోబోలు సక్సెస్‌ఫుల్‌గా మెడికల్ ఇండస్ట్రీలో తమ ముద్రను వేశాయి. ఇప్పుడు బ్రెయిన్ యాక్టివిటీని స్టడీ చేసే ఈ రోబోకు సంబంధించిన ప్రయోగాలు సక్సెస్ అయితే ఇది మెడికల్ రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్టు అవుతోంది. ఎంత టెక్నాలజీ పెరిగినా కొన్ని బ్రెయిన్ సమస్యలు మనిషికి ప్రాణహాని తెచ్చిపెట్టేవరకు బయటపడడం లేదు. అలాంటి వారికి ఈ రోబో కొత్త ఆశను ఇస్తుంది.