Big Stories

Covid -19:- కోవిడ్ కనుక్కోవడానికి మెరుగైన టెస్ట్…

- Advertisement -

Covid -19:- ఈరోజుల్లో గాలి కాలుష్యం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. అందుకే దానిని అదుపు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాని మితిమీరిన శాతానికి గాలి కాలుష్యం పెరిగిన కారణంగా వారి ప్రయత్నాలు పూర్తిస్థాయిలో కాలుష్యాన్ని అదుపు చేయలేకపోతున్నాయి. అందుకే ఎవరి పీల్చుకునే గాలికి వారే బాధ్యులు అన్నట్టుగా బ్రీతలైజర్లు కమర్షియల్ మార్కెట్లో సైతం ట్రెండ్ అవుతున్నాయి. ఈ బ్రీతలైజర్ల వల్ల మరికొన్ని ప్రయోజనాలను కూడా శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

- Advertisement -

ప్రతీ శ్వాసకు మనిషి ఎన్నో వేల మాలిక్యూల్స్‌ను వదులుతాడు. దీని నుండి ప్రొడ్యూస్ అయ్యే కెమికల్ ఫింగర్‌ప్రింట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. దానినే బ్రీత్ ప్రింట్ అంటారు. ఈ బ్రీత్ ప్రింట్‌ను స్టడీ చేయడం ద్వారా శరీరంలో ఏం జరుగుతుంది అనే విషయాలను తెలుసుకోవచ్చు. ఇప్పటికే బ్రీత్ ప్రింట్ ద్వారా కుక్కల్లో, ఎలుకలలో క్యాన్సర్, డయాబెటీస్, టీబీ లాంటి వ్యాధులను కనుక్కోగలిగారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఈ ప్రయోగాలను మనుషులపై ఉపయోగించాలి అని నిర్ణయించుకున్నారు.

బయటికి వదిలే శ్వాసను స్టడీ చేయడానికి శాస్త్రవేత్తలు కొత్త రకమైన బ్రీతలైజర్‌ను తయారు చేశారు. వీటి తయారీలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సాయం చేసిందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఈ బ్రీతలైజర్ కోవిడ్‌ను క్షణాల్లో కనుక్కుంటుందని తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రయోగాలు సక్సెస్ అయ్యాయని వారు తెలిపారు. బ్రీతలైజర్ అనేది కోవిడ్‌ను కనుక్కోవడం ఇదే మొదటిసారి అని, ఇప్పటివరకు మెడికల్ రంగంలో ఉన్న కోవిడ్ టెస్టుల్లో దీని లాగా మెరుగైన ప్రక్రియ ఏదీ లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

బ్రీతలైజర్‌కు సంబంధించిన పరిశోధనలను 2008లోనే మొదలుపెట్టామని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. కోవడ్ అనేది వచ్చిన తర్వాత దీనిని మరింత అడ్వాన్స్ పద్ధతిలో ప్రజలకు అందించాలని వారు అభిప్రాయపడ్డారు. అందుకే కోవిడ్‌ను కనిపెట్టే యంత్రంగా దీనిని మార్చాలనుకున్నారు. మార్చి సక్సెస్‌ఫుల్‌గా నిపుణుల ముందు పెట్టారు. ఇప్పటికీ కోవిడ్ అనేది పూర్తిగా అంతరించకపోవడంతో బ్రీతలైజర్ ద్వారా కోవిడ్ టెస్టులు చేయడం మెరుగైన మార్గమని శాస్త్రవేత్తలు సూచించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News