OTT Movie : అమ్మాయిలపై జరిగే దారుణాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఏళ్ళ తరబడి అమ్మాయిల మిస్సింగ్ కేసులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళు ఏమయ్యారో కూడా ఇంతవరకూ కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో రియల్ స్టోరీతో వచ్చిన ఒక హిందీ సినిమా, ఆడియన్స్ ని ఆలోచింపజేసేలా చేస్తోంది. ఈ సినిమా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో 17 ఏళ్ల సియా అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె కొంతమంది వ్యక్తుల చేతిలో రోజుల తరబడి అఘాయిత్యానికి గురవుతుంది. ఆ తరువాత ఆమె న్యాయం కోసం శక్తివంతమైన వ్యక్తులతో పోరాడే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. ఈ సినిమా కుల వివక్ష, రాజకీయ పలుకుబడి, న్యాయవ్యవస్థలో అవినీతిని హైలైట్ చేస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘సియా’ (Siya) 2022లో విడుదలైన హిందీ క్రైమ్ డ్రామా ఫిల్మ్. మనీష్ ముంద్రా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో పూజా పాండే, వినీత్ కుమార్ సింగ్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా 2022 సెప్టెంబర్ 16న థియేట్రికల్ రిలీజ్ అయింది. 2023 జూన్ 16 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 57 నిమిషాల నిడివితో IMDbలో 7.4/10 రేటింగ్ పొందింది.
సియా అనే 17 ఏళ్ల అమ్మాయి, ఉత్తర్ ప్రదేశ్‌లోని దేవ్‌గంజ్ అనే చిన్న గ్రామంలో ఉంటుంది. ఆమె జీవితం సింపుల్‌గా, ఇంటిలో పనులు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆమె ఢిల్లీకి వెళ్లి జాబ్ చేయాలని కలలు కంటుంది. కానీ ఒక రోజు స్థానిక నేత అరుణోదయ్ సింగ్ సోదరుడు, మరికొందరు శక్తివంతమైన వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి, రోజుల తరబడి అఘాయిత్యం చేస్తారు. ఆ తరువాత సియాని చైన్స్‌తో బంధించి, ఆకలితో, బ్లడ్ డ్రై అయిన బాడీతో వదిలేస్తారు. ఆమె ఇంటికి తిరిగి వచ్చినా, పోలీసులు ఆమె కంప్లైంట్ తీసుకోరు. ఎందుకంటే నిందితులు పవర్‌ఫుల్. సియా తండ్రి శేఖర్, తల్లి, అమ్మమ్మ ఈ సమయంలో ఆమెకు సపోర్ట్ చేస్తారు. కానీ ఊరిలో ఆమె ఒంటరిగా మిగిలిపోతుంది. ఈ టైమ్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన మహేందర్ అనే లాయర్ సియాకు హెల్ప్ చేయడానికి ముందుకొస్తాడు.
సియా, మహేందర్ సహాయంతో న్యాయం కోసం పోరాడుతుంది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తారు. కానీ వాళ్లు బెయిల్ మీద విడుదలవుతారు. సియా ఒక CBI తో ఫైట్ చేస్తుంది. అది అరుణోదయ్ సింగ్‌ని కూడా గిల్ట్ అయ్యేలా చేస్తుంది. కానీ ఈ ప్రాసెస్‌లో సియా తండ్రి శేఖర్‌ని స్థానిక గుండాలు బీట్ చేస్తారు. పోలీసులు ఫాల్స్ కేస్‌లో అరెస్ట్ చేసి, అతన్ని కస్టడీలో చంపేస్తారు. ఈ ఘటన సియాని ఇంకా రెచ్చగొడుతుంది. ఆమె ఒక మూవ్‌మెంట్ స్టార్ట్ చేస్తుంది. పవర్‌ఫుల్ పీపుల్‌తో ఫైట్ చేస్తుంది. కోర్ట్‌రూమ్ షోడౌన్‌లో సియా తన అటాకర్స్‌ని ధైర్యంగా ఫేస్ చేస్తుంది. చివరికి సియాకి న్యాయం జరిగిందా ? ఆ రాక్షసుల చేతిలో ఓడిపోతుందా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్