Budget Gaming Phones| బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.25000లోపు బడ్జెట్ లోనే అడ్వాన్స్‌డ్ కూలింగ్, స్మూత్ టచ్ కంట్రోల్స్, ఫాస్ట్ గ్రాఫిక్స్, ఈ-స్పోర్ట్స్ లాంటి గేమ్‌ప్లే ఆఫర్ చేస్తాయి. ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాల్సిన అవసరం అసలు ఉండదు. సెప్టెంబర్ 2025లో టాప్ 6 గేమింగ్ ఫోన్ల జాబితా మీ కోసం.
1. నథింగ్ ఫోన్ 3a (రూ.24,999)
నథింగ్ ఫోన్ 3aలో 6.7-ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ స్మూత్ విజువల్స్ ఇస్తుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ లాగ్ లేకుండా గేమింగ్ అనుభవం ఇస్తుంది. 5000mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ గంటలపాటు గేమింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
2. రియల్‌మీ P4 ప్రో (రూ.24,999)
రియల్‌మీ P4 ప్రోలో 6.8-ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్ క్లియర్ పిక్చర్ ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ పవర్ ఫుల్ గేమింగ్ అనుభవం ఇస్తుంది. 7000mAh బ్యాటరీ, 80W టర్బో ఛార్జింగ్ లాంగ్ గేమింగ్ సెషన్స్‌కు సపోర్ట్ చేస్తుంది.
3. పోకో X7 ప్రో (రూ.23,999)
పోకో X7 ప్రోలో 6.67-ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ అద్భుతమైన గ్రాఫిక్స్ ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్ హై పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. 6550mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ త్వరిత రీఛార్జ్, లాంగ్ గేమింగ్ అనుమతిస్తుంది.
4. వన్‌ప్లస్ నార్డ్ CE5 (రూ.23,969)
వన్‌ప్లస్ నార్డ్ CE5లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ ఉంది. 6.7-ఇంచ్ ఫుల్-HD+ OLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఇస్తుంది. 7100mAh బ్యాటరీ, 80W టర్బో ఛార్జింగ్ రోజంతా గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. గేమర్స్‌కు గ్రేట్ ఛాయిస్.
5. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూషన్ (రూ.22,999)
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూషన్‌లో 6.67-ఇంచ్ P-OLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ స్మూత్ గేమ్‌ప్లే ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 పెర్ఫార్మెన్స్‌ను పవర్ చేస్తుంది. 5500mAh బ్యాటరీ, 68W అల్ట్రాఫాస్ట్ ఛార్జింగ్ లాంగ్ గేమింగ్ సెషన్స్‌కు సపోర్ట్ చేస్తుంది.
6. iQOO Z10 (రూ.21,519)
iQOO Z10 అద్భుతమైన బడ్జెట్ గేమింగ్ ఫోన్. 6.77-ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ శక్తిని అందిస్తుంది. 7300mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ బడ్జెట్ గేమింగ్ బీస్ట్‌గా చేస్తుంది.
ఎందుకు ఈ ఫోన్లు బెస్ట్?
ఈ ఫోన్లు పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు, పెద్ద బ్యాటరీలను కలిగి ఉన్నాయి. స్మూత్, లాగ్-ఫ్రీ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. హెవీ గేమ్స్ బాగా హ్యాండిల్ చేస్తాయి. మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని లేటెస్ట్ గేమ్స్ ఆడండి. ఎక్కువ ఖర్చు చేయకుండా గేమింగ్ ఎంజాయ్ చేయండి!
Also Read: ఐఫోన్ 17 లాంచ్ తర్వాత ఆపిల్ షాకింగ్ నిర్ణయం.. పాత ఐఫోన్‌ల విక్రయాలు బంద్!