Illu Illalu Pillalu Today Episode September 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి చేతిలో ఒక పేపర్ పడుతుంది. అప్పుడే తన చేతిలోకి ఒక పేపర్ వచ్చి పడుతుంది అది చూసిన శ్రీవల్లి షాక్ అవుతుంది. ప్రేమ ఒక అబ్బాయిని పరిగెత్తించినట్లు ఆ ఫోటో కనిపించడంతో ఒక్కసారిగా సంతోషంతో బయటికి వచ్చి గంతులు వేస్తుంది.. దేవుడు నా వైపే ఉన్నాడు. నాకు ఇంత మంచి చేస్తున్నాడని అస్సలు ఊహించలేదు అని డాన్సులు వేస్తుంది. శ్రీవల్లి లోపలికి వెళ్లి రామరాజుకు పేపర్ చూపించి అందులో మన ప్రేమ లాగే ఉంది కదా అని అడుగుతుంది..
వేదవతిని రామరాజు అడుగుతాడు. మన ప్రేమ ఎవర్నో తరుముతో వెళ్తుంది ఏంటి ఎవరు వాడు అని రామరాజు అడుగుతాడు. ప్రేమ మౌనంగా ఉండడంతో శ్రీవల్లి ఏంటి ప్రేమ మౌనంగా ఉన్నావు మావయ్య గారు అంటే భయం లేదా మర్యాద లేదా ఆయనకి ఇలాంటి విషయం చెప్పాల్సిన అవసరం మీకు లేదా అని కావాలని ఇరికించేలా మాట్లాడుతుంది.. ప్రేమ ఏదో ఒకటి చెప్పి అందరిని మేనేజ్ చేస్తుంది. శ్రీవల్లి మాత్రం ఎక్కడో అనుమానం మొదలవుతుంది.. ఇక చందుకి శ్రీవల్లి ఎంత చెప్పినా సరే దూరం పెట్టేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఉదయం త్వరగా చందు రెడీ అయ్యి వెళ్తుంటే శ్రీవల్లి అక్కడికి వెళుతుంది. ఇష్టం లేనట్టు చందు మాట్లాడతాడు. మావాళ్లు చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తున్నావా బావ అని అడుగుతుంది.. నువ్వు నన్ను దూరం పెడితే తిరిగి ఆ డబ్బులు మళ్లీ వస్తాయా? నన్ను దూరం పెట్టొద్దు బావ నా ప్రాణం గుంజేస్తుంది అని ఎంతగా బ్రతిమిలాడినా చందు మాత్రం నీ విషయం నువ్వు చూసుకో నా విషయాలు నేను చూసుకుంటాను అని మొహం మీద తేల్చి చెప్పేస్తాడు..
అదేంటి బావ మా ఇంట్లో వాళ్ళు చేసిన తప్పుకి నన్ను దూరం పెడుతున్నారా? మనిద్దరి మధ్య ఇప్పుడే ఇంత దూరం అయితే ఎలా బావ అని బాధపడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. చందు వల్లి కన్నీళ్లు పెట్టుకున్న కరగడు.. అయితే నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటానని చందు అనడంతో శ్రీవల్లి గుండె ముక్కలు అయినంత పని అవుతుంది. ఈ విషయాన్ని శ్రీ వల్లి తన పుట్టింట్లో చెప్పడానికి వెళుతుంది.. నా కాపురం ముక్కలవుతుంది అని బాధపడుతూ తన తల్లి ఒడిలో కన్నీళ్లు పెట్టుకుంటుంది..
నా కాపురం కూలిపోయింది అమ్మ నేను ఇంకా ఇంటికి వెళ్ళను అని బాధపడుతూ శ్రీవల్లి తన తల్లిదండ్రులతో చెప్పుకుంటుంది. మీరు తీసుకున్న 10 లక్షలు ఇవ్వకపోతే కచ్చితంగా నా కాపురం కూలిపోతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నువ్వు బాధపడకు తల్లి.. అన్ని ప్లాన్ వేసి నీ పెళ్లి చేశాను. ఎలాగో 10 లక్షలు తెచ్చి నీ సమస్యను కూడా పోగొడతాను అని భాగ్యం మాటేస్తుంది. శ్రీవల్లిని అత్తింటికి పంపిస్తుంది.
మన దగ్గర ఇడ్లీ పిండి కొనడానికి డబ్బులు లేవు అలాంటిది 10 లక్షలు ఎలా ఇస్తారండి అని ఆనందరావు అడుగుతాడు.. అలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తూనే ఉంటాడు.. అప్పుడే ఇంటికి భద్ర విశ్వం వస్తారు. వాళ్ల నువ్వు చూసి షాక్ అవుతుంది భాగ్యం. మీరేంటండి ఇలా వచ్చారు సమాచారం లేకుండా వచ్చిన తుఫాన్ లాగానే అంటుంది. విశ్వం అమూల్య ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఈ రెండు కుటుంబాలని కలిపే బాధ్యత ఉంది కాబట్టే ఇలా వచ్చాము అని వాళ్ళ అనగానే భాగ్యం షాక్ అవుతుంది.
మీ సమస్య ఏంటి మాకు తెలుసు కాబట్టి మీరు కచ్చితంగా మాకు హెల్ప్ చేయాలి అని భాగ్యంను భద్ర అడుగుతుంది. ఆ పది లక్షలని చూసిన ఆనందరావు వాళ్లకు సహాయం చేయడం వల్ల మనకు దొరికేది ఏమీ లేదు మన అమ్మాయి సమస్య తీరిపోతుంది కదా అని అంటాడు. అయితే ఆ మాట విన్న భాగ్యం ఒప్పేసుకుంటుంది. మీకు సహాయం చేస్తాము అని అంటారు. ఇక భద్ర రామరాజు నీ పతనం మొదలైంది అని అనుకుంటుంది. ఈ విషయం ఎలాగైనా శ్రీవల్లితో చెప్పి ఒప్పించాలని అనుకుంటారు.
Also Read: అవని వంటను మెచ్చుకున్న బాస్.. విడగొట్టేందుకు ప్లాన్.. పల్లవికి మైండ్ బ్లాక్..
ఇక ప్రేమ ఆ కళ్యాణ్ గాని ఊరంతా తిప్పించి మరీ కొట్టాను ఇక జీవితంలో వాడు నాకు ఫోన్ చేయడు అని సంతోషంగా ఉంటుంది. ధీరజ్ ప్రేమ టెన్షన్ కి కారణం ఏంటో తెలుసుకోవాలని కనిపించిన తన ఫ్రెండ్స్ అందరిని అడుగుతూ ఉంటాడు. అయితే ఎవరు ఈ ఏమైందో తెలియదు అని అంటారు. ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళిన ధీరజ్ ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటాడు.ప్రేమ కాలేజీకి రెడీ అవుతుంటే కళ్యాణ్ ఫోన్ చేసి నువ్వు ఒక గంటలో నా పక్కలో ఉండాలి లేదంటే మాత్రం ఈ విషయాన్ని మీ మామతో చెప్తాను అని వార్నింగ్ ఇస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..