Intinti Ramayanam Today Episode September 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి అవని వెళ్లిపోయిన తర్వాత ప్రణతితో ఓ ఆట ఆడుకుంటుంది శ్రీయ. ప్రణతి అన్ని వంటలు సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. భరత్ నువ్వు ఒక్కదానివి అన్ని పనులు చేసుకోకపోతే నన్ను కూడా సాయం అడగొచ్చు కదా అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రియ ఏం వంటలు చేశావు ఏం కూరలు చేశావు అని అడుగుతుంది. వెజ్ కూరలు చేశానని చెప్పగానే నాకు నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగడానికి నీకు తెలుసు కదా నువ్వెందుకు చేయలేదని ప్రణతి పై అరుస్తుంది. అక్కడకు వచ్చిన పల్లవి శ్రియాని చంప పగలగొడుతుంది.. నన్ను కొడతావ్ ఏంటి అని శ్రీయా అడుగుతుంది. పార్వతి అవనికి సాయంగా ఉంటుందని వంటకి కూరగాయలను కట్ చేసి ఇస్తుంది. అయితే అవని మీరు ఇలా అలసిపోతే ఒళ్ళు పులుసు మళ్ళీ జ్వరం వస్తుంది మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోండి అత్తయ్య అని అంటుంది.. అక్షయ్ తన బాస్ తో లంచ్ చెయ్యడానికి ఇంటికి వస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ భోజనం తెచ్చుకోలేదని వాళ్ళ బాస్ అవనితో ఫోన్ మాట్లాడుతుంది.. మేమిద్దరం కలిసి భోజనానికి ఇంటికి వస్తున్నామని చెప్తుంది.. అక్షయ్ తను బాస్ తో కలిసి స్వరాజ్యం ఇంటికి వెళ్తాడు. అయితే ఆమెకు డౌట్ వచ్చి అదేంటి అక్షయ్ మీరు ఉన్నది వేరే ఇల్లు కదా ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది. నేను నా భార్య తమ్ముళ్ళతో కలిసి ఉండట్లేదు మేడం. మా నాన్న మా అమ్మ ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు అని అంటాడు. అదేంటి అని ఆమె ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అడుగుతుంది. అని అక్షయ్ మాత్రం ఇది నా పర్సనల్ విషయం మేడం దయచేసి అడగకండి అని అంటాడు.
ఇక ఇంట్లోకి వెళ్ళగానే చాముండేశ్వరిని అందరూ సంతోషంగా స్వాగతిస్తారు. అయితే అందరితో సరదాగా మాట్లాడుతున్న చాము రాజేంద్రప్రసాద్ తో కాస్త క్లోజ్ గా ఉండడంతో పార్వతి కుళ్ళుకుంటుంది. ఆమె వచ్చిరాని తెలుగుతో అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది.. ఇక పల్లవి వీళ్ళందరూ సంతోషాన్ని చూసి కుళ్ళుకుంటుంది. ఏం మేడం తో అయితే మీరిద్దరు కలిసి ఉన్నారని అబద్దం చెప్పారు. ఆ బాస్ చేతే మీరిద్దరూ విడిపోయేలా చేస్తాను అని శపధం చేస్తుంది. వీళ్ళందరూ లోపల ఉంటే పల్లవి కిటికీలోంచి తొంగి చూస్తూ ఉంటుంది.
ఇక అక్షయ్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక అమ్మాయిని రమ్మని పిలుస్తుంది. ఆ అమ్మాయికి భారీగా డబ్బు ఆఫర్ చేసి అక్షయ్ అవని కలిసి లేరని మీ బాస్ కి తెలియజేయాలని చెప్తుంది. ఆ అమ్మాయి అలానే అని ఒప్పుకుంటుంది.. అయితే వాళ్ళందరూ అవన్నీ చేసిన వంటల గురించి మెచ్చుకుంటూ ఉంటారు. అవని ఏం చేసినా సరే చాలా బాగా ఉంటుంది. అందుకే వీళ్ళిద్దరి ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటారని అబద్ధాలు మీద అబద్ధాలు చెప్పేస్తారు. అక్షయ్ కూడా కావాలనే బలవంతంగా అవని తో కలిసి ఉన్న విషయాన్ని బయట పెట్టకుండా ఒప్పుకుంటాడు.
Also Read: టెంట్ లో మీనా, బాలు రొమాన్స్.. సుశీల కండీషన్స్.. మనోజ్ రూమ్ ను లాక్కున్న బాలు..
అయితే అక్షయ్ దగ్గరికి వచ్చిన అవని నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది.. మీకు రేపు ఏ కూర వండి బాక్స్ పెట్టాలో చెప్పండి లేకపోతే మీ మేడం రేపు కూడా ఇంటికి వస్తుంది అవసరమంటారా అని అడుగుతుంది. నన్ను ఆడుకుంటున్నావు కదా అని అవనితో అక్షయ్ అంటాడు. మీ బాస్ ముందర నటించాలంటే కష్టంగా ఉండండి నిజం చెప్పొచ్చు కదా మీరు అని అవని అంటుంది. ఇక చాముండేశ్వరి ఆఫీస్ లోని ఒక అమ్మాయి అక్షయ్ అవనీలు కలిసి లేరని అసలు నిజం అని బాస్ కి చెప్పేస్తుంది. బాస్విషయాన్ని నమ్మినట్లు పల్లవికి చెప్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.